Friday, November 22, 2024

శ్రీపాదులు దత్తాత్రేయులని చెప్పినపంచభూతాలు

హిమాలయాలలో శతోపథం అనే ప్రాం తం ఒకటి ఉంది. ఆ ప్రాంతం నుండే ధర్మరా జాదులు స్వర్గానికి వెళ్ళారని పురాణ కథ నం. అక్కడ శ్రీ సచ్చిదానందావధూత అనే మహాత్ముడు వున్నాడు. ఆయన వయసు కొ న్ని శతాబ్దములు. వారు కైవల్య శృంగమునం దున్న శ్రీ విశ్వేశ్వర ప్రభువుల శిష్యులు. శ్రీ విశ్వే శ్వర ప్రభువులు తాము పీఠికాపురములో శ్రీపా ద శ్రీవల్లభ రూపమున అవతరించి వున్నామని, తన బాల్యరూపమును చూసి తరించవలసినదని శ్రీ సచ్చిదానందావధూతను శాసించారు. అవధూత పీఠికాపురమునకు విచ్చేసారు. శ్రీ బాపనార్యులు వారిని ఆదరముతో స్వాగ తించారు. శ్రీ పాద శ్రీ వల్లభరూపముననున్న శ్రీ దత్త ప్రభువులని దర్శించి చరితార్థులయ్యారు. శ్రీపాదుల వారి సేవకు గోక్షీరమును వినియోగించాలని అక్కడ కుల పురోహి తులయిన అప్పలరాజశర్మకు శ్రేష్ఠి గోవును దానంగా ఇవ్వా లనుకున్నాడు. దానికి అంగీకరించని అప్పలరాజశర్మతో అవధూత ఇలా పేర్కొన్నారు. గోదానమును స్వీకరించాలి. శ్రీపాదుల వారు సాక్షాత్తూ దత్తప్రభువు. వ్యర్థమయిన నియ మాలతో దత్తప్రభువులకు పాలను ఇచ్చే మహత్తర సేవను పోగొట్టుకోకూడదని చెబుతారు. అంతట అక్కడున్న బ్రాహ్మ ణ పరిషత్తువారు శ్రీపాదులవారు దత్తుడేనని అనడానికి సాక్ష్యము ఏమిటని అడుగుతారు. అంత అవధూత పంచ భూతములచేతనే సాక్ష్యం చెప్పిస్తానని అంటారు.
యజ్ఞము ప్రారంభించారు. భూమాత సాక్ష్యము పలు కుతుంది. శ్రీపాదుల వారు శ్రీదత్తులే గనుక అప్పలరాజశర్మ గోదానమును స్వీకరించుట దోషము కాదు. మామగారు అల్లునికి ప్రేమపూర్వకము గా నిచ్చునది, దానముగా లెక్కకురాదు గనుక సత్య ఋషీశ్వరులు శ్రేష్ఠి నుండి దానిని దానముగా తీసుకొని అల్లునికి కానుకగా యీయ వచ్చును. ఇది భూమాత వచనము. యజ్ఞము ప్రారం భమైన తరువాత యజ్ఞ ప్రాంతము మినహాగా మిగ తా ప్రాంతములో వర్షము కురవడం ప్రారంభమయింది. ఇది రెండవ సాక్ష్యముగా స్వీకరించారు. యజ్ఞమునందు హవిస్సులను అగ్నిదేవుడు స్వయముగా స్వీకరించి గోదానము దోషయుక్తము కాదని వివరించారు. ఇది మూడవ సాక్ష్యముగా స్వీకరించారు. వాయువు యజ్ఞశాల మినహా మిగతా ప్రాంతమంతటిని తన ప్రతాపముతో గడగడలాడించాడు. ఇది నాలుగవ సాక్ష్యము గా స్వీకరించారు. ఆకాశము నుండి దివ్యవాణి శ్రీపాదులు సాక్షాత్తు దత్తప్రభువులే అని తెలియజేస్తుంది. పంచ భూత ముల సాక్ష్యములను ప్రత్యక్షంగా చూసిన అప్పలరాజశర్మ గోదానమును స్వీకరించారు. గోదాన ఫలితము శ్రేష్ఠి గారికి దక్కినది.

(శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం నుంచి)

Advertisement

తాజా వార్తలు

Advertisement