Tuesday, November 26, 2024

మహాసాధ్వి సీతాదేవికి అగ్నిపరీక్షా

యుద్ధాన్ని చూడడానికి వచ్చిన దేవదానవులు సంతోషంగా వారివారి స్థానాలకు మరలిపోయారు. ఆ తరువాత రామచంద్రమూర్తి తన రథాన్ని నడిపిన సారథి మాతలిని చూసి, ఆయనకు తన మీద వున్న ప్రేమను పొగిడి, అతడు తన రథాన్ని తీసుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్లమని అనుమతి ఇవ్వగా, మాతలి అక్కడినుండి వెళ్లిపోయాడు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడిని కౌగలించుకుని అక్కడి నుండి లక్ష్మణుడు తోడు రాగా, సమస్త వానరసేన సేవించగా, సేనలున్న ప్రదేశానికి పోయి లక్ష్మ ణుడిని చూసి ”లక్ష్మణా! విభీషణుడుని లంకలో అభిషేకం చేయా లని నా మనస్సులో వున్న కోరిక. దీన్ని నువ్వు నెరవేర్చి రావాలి” అన్నాడు. లక్ష్మణుడు వెంటనే నగరంలోకి వెళ్ళి, బంగారు పాత్రల ను తీసుకువచ్చి, వాటితో సముద్ర జలాలను తెమ్మని సైనికులను పంపాడు. వారు జలాలను తీసుకుని రాగానే అందులో ఒకదాన్ని తాను తీసుకుని, రాజయోగ్యమైన ఉత్తమ సింహాసనాన విభీషణు డిని కూర్చోబెట్టి, రాక్షసులంతా చూస్తుండగా వారి మధ్యన మంత్ర యుక్తంగా అతడిని అభిషిక్తుడిని చేశాడు. విభీషణుడు సంతోషించి రామచంద్రమూర్తి ఇచ్చిన రాజ్యాన్ని గ్ర#హంచాడు. శ్రేష్టులైన రాక్ష సులు ఆయన్ను ఆశీర్వదించారు. వారిచ్చిన అక్షతలను, పుష్పాల ను, పేలాలను ఇతర శుభకరమైన వస్తువులను తీసుకుని రామచం ద్రుడి దగ్గరికి వచ్చి అవి ఆయనకు సమర్పించాడు.
ఆ తరువాత సమీపంలో వున్న హనుమంతుడిని పిలిచి, విభీష ణుడి అనుమతి తీసుకుని లంకకు వెళ్లి అక్కడున్న సీతాదేవికి యుద్ధంలో తాను గెలిచిన వృత్తాంతాన్ని చెప్పమన్నాడు. ఆమె ఏమని ప్రత్యుత్తరం ఇస్తుందో తెలుసుకుని రమ్మంటాడు.
రామాజ్ణ శిరసావహించిన హనుమంతుడు తక్షణమే లంక లోకి ప్రవేశించి, దు:ఖిస్తున్న సీతాదేవిని చూసి సంతోషంతో హను మంతుడు రాముడి సందేశాన్ని వినిపించాడు. ”రావణాసురుడు చచ్చాడు. లంక రావణుడి తమ్ముడు, విభీషణుడి స్వాధీనంలో వుంది. కాబట్టి నీ సొంత ఇంట్లో వున్నట్లే భావించు.”
ఆ మాటలకు సీతాదేవి ”నాకు సంతోషం కలిగించిన వార్త చెప్పిన నీకు అంతే సంతోషం కలిగించే మాట ఏదైనా చెప్పాలని ఎం తో ఆలోచన చేశాను. కాని నాకు ఏమీ తోచలేదు. మాట చెప్పకపో యినా ఏదైనా బ#హుమానం ఇద్దామని అనుకుని ఈ లోకంలో అలాంటిది ఏదైనా వుందా అని ఆలోచించాను. ఇతర లోకాలలో ఏదైనా వున్నదా అని ఆలోచన చేశాను. అక్కడా కనబడలేదు. ఇన్ని లోకాల ఆధిపత్యమే అంటే బ్రహ్మత్వమే నీకిచ్చిన చాలునేమో అని ఆలోచించాను. అది కూడా చాలదని అనిపించింది” అన్నది.
సీతాదేవి మాటలు విన్న హనుమంతుడు ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూనే రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతి ఇవ్వమని ఆమెను అడిగాడు. రాజాజ్ఞానుసారం ఆయన్నే ఆశ్రయించి వున్న ఆయన కార్యాన్ని నెరవేర్చాల్సిన ఈ దాసీజనం మీద కోప్పడవచ్చా అని ప్రశ్నించిదామె. తన భర్త ను చూడాలనుకుంటున్నానని త్వరగా తీసుకుపొమ్మని అంటుంది.
సీతాదేవి కోరికను హనుమంతుడు చెప్పగానే రామచంద్రుడు పది నెలలుగా నానా భాధలు పడుతున్న సీతాదేవిని ఇంకా తాను కష్ట పెట్టాల్సి వచ్చింది కదా అని కన్నీరు కార్చాడు. చింతతో ఏమీ తోచక, నేలచూపులు చూస్తూ, ఇలా అనుకున్నాడు. ”దీర్ఘకాలం, పగవాడి ఇంట్లో వున్నదాన్ని కాముకుడై రాముడు మరల పరి గ్రహించాడని లోకులు అంటారేమో అని బాధపడ్డాడు. అలా ఆలోచిస్తూనే, సమీ పంలో వున్న విభీషణుడితో, ”రాక్షస రాజా! భూకన్య అయిన సీతా దేవిని వేగంగా శిరస్నానం చేయించి, గంధాదులు పూసుకొనచేసి, ఆభరణాలు ధరింపచేసి తీసుకుని రా” అంటాడు.
రామచంద్రమూర్తి అన్న మాటలు సీతాదేవికి చెప్పి, ఆమె అనుమతితో అంత:పుర స్త్రీలతో స్నానం చేయించి, ఆభరణాలతో అలంకరించి, మంచి వస్త్రాలను ఇచ్చి, పల్లకి ఎక్కించి, విభీషణుడు రామచంద్రమూర్తి దగ్గరికి తెచ్చాడు. దీర్ఘకాలం రావణుడి ఇంట్లో వున్న సీతాదేవి వచ్చిందని వినగానే రామచంద్రమూర్తి మనస్సులో సంతోషం, దీనత్వం, కోపం ఆవేశించాయి. సీతను వెంటనే దగ్గరికి తీసుకురమ్మన్నాడు రాముడు. స్నేహితులతో కూడి వున్న తనను సీత చూడవచ్చనీ, తీసుకురమ్మనీ చెప్పాడు. శ్రీరాముడు ఇలా అన గానే విభీషణుడు సందేహిస్తూనే సీతాదేవిని శ్రీరాముడి సమీపానికి తెచ్చాడు. సీతాదేవి సిగ్గుతో రామచంద్రమూర్తి సౌమ్యమైన ముఖా న్ని చూసి, ”ప్రాణేశ్వరా!” అని గట్టిగా ఏడ్చింది.
తన పార్శ్వంలో శరీరాన్ని వంచి నిలబడ్డ సీతాదేవిని చూసి రామచంద్రమూర్తి తన #హృదయంలో బాధను దాచుకుంటూ ఇలా అన్నాడు. ”విరోధిని యుద్ధంలో చంపాను. నిన్ను గ్రహించాను. పూర్ణ సామర్థ్యంతో ఏది చేయగలనో అదంతా చేశాను. నేను రావ ణాసురుడిని చంపుతానని చేసిన ప్రతిజ్ఞ వ్యర్థమైపోకుండా చేసి నేను స్వతంత్రుడను అయ్యాను నిన్ను శత్రు బాధ నుండి తప్పించాను. అంతేకాని నిన్ను కలవడం నిన్ను గ్రహించడానికి కాదని తెలుసుకో. కులగౌరవం కాపాడడానికి, అపవాదం తొలగడానికి, కీర్తి నిలపడా నికి చేయాల్సినదంతా చేశాను. ఇక నీ విషయానికొస్తే నువ్వు లోకులు సందే#హంచడానికి అవకాశం ఇచ్చే చరిత్ర కలదానివయ్యావు. రావ ణుడి ఇంట్లో ఇన్నాళ్లు చెడిపోకుండా వున్నావని లోకమెలా విశ్వసి స్తుంది? అందుకే నీకు అనుమతి ఇస్తున్నాను. నీ ఇష్టం వచ్చిన చోటు కు వెళ్ళవచ్చు. ఉత్తమ వంశంలో, ఉత్తమ జాతిలో పుట్టినవాడు, కీర్తి ప్రతా పాలు కలవాడు, ఎవరైనా పరుడి ఇంట్లో దీర్ఘకాలం వున్న ఆడద న్ని మళ్లిd భార్యగా స్వీకరిస్తాడా? నువ్వే చెప్పు. దుష్కామ దోషంకల చూపులతో దుష్టుడు నిన్ను చూశాడు. వాడి ఒడిలో నిన్ను వుంచు కోవడం వల్ల నువ్వు భ్రష్టవయ్యావు. నేను మళ్లిd ఎలా గ్ర#హస్తాను? శత్రువులను వధించి మళ్లీ భార్యను గ్రహించాడన్న కీర్తి దక్కించు కోవడానికి నేను రావణుడిని చంపి నిన్ను వాడి చెర నుండి విడిపిం చాను కాని, నీమీద కామమోహంతో కాదు..”
భర్త నుండి ప్రీతికరమైన మాటలు విని సంతోషిద్దామని ఎదు రుచూసిన సీతాదేవి అప్రియమైన మాటలు విని కన్నీళ్లు కార్చింది.
భర్త మాటలకు జవాబుగా గద్గద స్వరంతో ”భద్రచరిత్రా! ఇంత కఠినవాక్యాలు ఎలా అనగలిగావు? నువ్వు గొప్పవాడివి. గొప్పవాడిలాగా మాట్లాడకుండా ఇలా మాట్లాడడం నీకు తగదు. నా శీలంలో ఏ దోషం వుందని నువ్వు సందేహించావో అలాంటి దోషం నాలో లేదని నాపాతివ్రత్యం మీద ప్రమాణంచేస్తున్నాను”.
”నన్ను రావణుడు అంటుకున్నాడా? లేదా? అది దోషం కాదా? అని అడుగుతావేమో? వాడు నన్ను తాకింది నిజమే. వాడై వాడే నన్ను తాకాడు కాని నేను వాడిని తాకలేదు కదా? నా భావన దుష్టమైతే నన్ను దండించాలి కాని ఇతరుల భావన దుష్టమైతే నన్ను దండించవచ్చా? నన్ను రక్షించాల్సిన భారం నీమీద వుంది. నువ్వు రక్షించలేకపోయావు. నీ కర్తవ్య లోపంవల్ల నాకీ బాధ కలిగింది. కాబట్టి దోషం నీది కాని నాదికాదు.” ఇలా గద్గద స్వరంతో చెప్పి, సీతాదేవి ముఖమంతా చిన్నబుచ్చుకుని, మరది లక్ష్మణుడిని చూసి ”లక్ష్మణా! ఈ పెనుశోకం అనే వ్యాధికి ఔషధం అగ్ని ప్రవేశం తప్ప మరొకటి లేదు. నా ఇష్టం వచ్చినట్లు పొమ్మని పారతంత్య్రంనుండి నన్ను నా భర్త విముక్తిరాలిని చేశాడు. ఇక నేను చేసే పనికి అడ్డం వచ్చే అధికారం ఆయనకు లేదు. నీకైనా నామీద పూర్వ భక్తి వుంటే చితి పేర్చు. ఇలాంటి అపనింద వచ్చిన తరువాత జీవచ్ఛవమై ఎందుకు బతకాలి? లక్ష్మణా! పతివ్రతకు ఏగతి యోగ్యమో నేను అగ్నిప్రవే శం చేసి ఆ గతికి పోతాను.” సీతాదేవి ఇలా చెప్పడంతో లక్ష్మణుడు పెద్ద చితిని పేర్చాడు. రామచంద్రమూర్తికి సీతాదేవి ప్రదక్షిణ చేసిం ది. ఆ తరువాత ఆమె అగ్ని#హూత్రుడిని సమీపించి, చేతులు మోడ్చి, అగ్నిని ఉద్దేశించి భక్తితో ఇలా అన్నది.
”నా #హృదయం రాముడిమీదే నిలిచివుంటే, నన్ను అగ్ని హోత్రుడు సర్వదేశ, సర్వకాల, సర్వావస్థలందు రక్షించుగాక! సదా చార సంపత్తిగలనా భర్త నన్ను దుష్టురాలని భావించాడు. నేను దుష్ట స్త్రీని కాదేని సర్వ జనులు చేసే కర్మలకు సాక్షైన సూర్యదేవుడు, ఇతర దేవతలు నమ్మితే అగ్నిదేవుడు కీడు తొలగించి నన్ను రక్షించుగాక! సూర్యచంద్రులు, దేవతలు, వాయువు, రాత్రులు, సంధ్యలు, పగ ళ్లు, భూమి నా శీలాన్ని తెలిసున్నవారై దాని విషయంలో సందేహం లేనివారైతే, ఈ లోకులందరికీ తెలిసేట్లు ఓ అగ్నిహోత్రుడా! నన్ను రక్షించు” అంటూ అగ్నికి ప్రదక్షిణ చేసి అగ్నిలోకి ప్రవేశించింది.
సీతాదేవి అలా అగ్నిప్రవేశం చేసిన తరువాత కుబేరుడు, యముడు, ఇంద్రుడు, వరుణుడు, ముక్కంటి శివుడు, బ్రహ్మ, ఇతర దేవతలంతా వచ్చి, ఎదురుగా భూమ్మీద నిలబడి వున్న రామ చంద్రమూర్తిని చూసి ”నువ్వు సీతాదేవి అగ్నిజ్వాలల్లో ప్రవే శిస్తుంటే చూసి చలించకుండా వుండతగునా? సామాన్య మనిషి లాగా సీతాదేవిని వదలవచ్చా? నువ్వామె మీద కరుణ చూపు”.
అప్పుడు అగ్నిహోత్రుడు మనిషి రూపంలో సీతాదేవిని ఒడి లో వుంచుకుని బయటకువచ్చాడు. ఆమెను రాముడికి అప్పగిస్తూ, ”ఈమె నీ సీత. ఈమెలో ఏపాపం ఏమాత్రం లేదు. ఏ పాపం ఎరుగని ఈ సాధ్వీమణిని నువ్వు స్వీకరించు” అన్నాడు. అగ్నిహో త్రుడి మాటలకు బదులుగా శ్రీరాముడు, ”జానకిలో ఏ దోషంలేదని నాకు తెలుసు. రావణుడి అంత:పురంలో వున్న సీతను పరీక్షించకుండా స్వీకరిస్తే నన్ను బుద్ధి#హనుడని అనేవారు పెద్దలు. ఆ నింద పడలేక జానకి పతివ్రత అని తెలిసి కూడా లోకులను నమ్మించడానికి నేను ఉపేక్షించాను. ఈ స్త్రీరత్నం తన పాతివ్రత్య మ#హమతో తనను కాపాడుకోగలదని, రావణుడు ఆమెను తాకి బతకలేడని నాకు తెలుసు. పవిత్రమైన ఈ సీత నిష్క ల్మష #హృదయం కలది అన్నాడు. ఈవిధంగా దేవతలకు చెప్పి సీత ను చేరదీసి రాముడు సుఖపడ్డాడు.
(వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

  • వనం జ్వాలా నరసింహారావు
    8008137012
Advertisement

తాజా వార్తలు

Advertisement