Tuesday, November 26, 2024

సర్వజ్ఞులు సాయినాథులు

సాయి భక్త శ్రేష్టులలో నానాసాహబ్‌ రాసనే ఊరఫ్‌ దాము అన్నా ఎం తో ముఖ్యుడు. చిన్నతనం నుండే సాయిని తన సద్గురువుగా నిశ్చయం చేసుకొని, తాను జీవించినంత కాలం ఆ పరిశుద్ధ పరమేశ్వర అవతారమూర్తిని త న హృదయంలో పదిలపరచుకొని భక్తిశ్రద్ధ లతో పూజించుకున్న ఆదర్శ భక్తుడు రాసనే.
రాసనే మహరాష్ట్ర బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు. తాత ముత్తాతలందరూ అమిత మైన దైవ భక్తి కలవారు. వారందరూ గురు దత్తాత్రేయ స్వామి భక్తులు. మహారాష్ట్రలో ఆధ్యాత్మిక గురువుగా పేరెన్నిక గల మహపతి బువ్వా తహ్రా బాడ్కర్‌ రాసనే తాతగారికి గురుదే వులు కాగా భానుసాద్‌ మహరాజ్‌ అతని తండ్రికి గురువు. రాస నే చిన్నతనంలోనే ఆర్ధిక ఇబ్బందుల కారణింగా అహమ్మద్‌ నగర్‌లో గాజుల వ్యాపారం ప్రారంభిం చాడు. భగవంతుని కృప వలన అతని వ్యాపారం దినదినాభివృద్ధి చెంది రాసనే ఒక గౌరవప్రదమై న స్థాయికి వచ్చాడు. అయితే అతనికి వున్న పెద్ద లోటు అల్లా వివాహమై పది సంవత్స రాలు గడిచినా అతనికి సంతానం కల గలేదు. బంధుమిత్రుల ప్రోద్బలం వలన రెండో వివాహం చేసుకున్నాడు కానీ ఏం ప్రయోజనం కలుగలేదు.
అతని గురువును ఒకసారి కలిసినప్పుడు సంతాన ప్రాప్తికి సాధు సత్పురుషు లను సేవించి వారిని మెప్పించాలని సెలవిచ్చారు. తర్వాత ప్రముఖ జ్యోతిష్కు లను సంప్రదించినప్పుడు అతని జాతకంలో పుత్ర స్థానంలో కేతుగ్రహం వుండడం వలన ఈ జన్మలో సంతాన ప్రాప్తి లేదని తెలియజేసారు. ఎంతో మంది జ్యోతిష్కులను సంప్రదించి, మరెన్నో పుస్తకాలు చదివినందున అచిర కాలంలోనే రాసనేకు జ్యోతిష్య శాస్త్రంపై మంచి పట్టు వచ్చింది.
ఒక రోజున రాసనే కుటుంబానికి అత్యంత సన్నిహతుడైన గోవింద్‌ సప్కర్‌ (శ్యామా మావగారు) వారి ఇంటికి రాగా సంగతి అంతా విని శిరి డీ వచ్చి సాయిని శరణు వేడమని రాసనేకు సలహా ఇచ్చాడు. తర్వాత 1892వ సంవత్సరంలో రాసనే వ్యాపార రీత్యా నీంగాం వెళ్ళినప్పుడు అక్కడ సాయి మహమల గూర్చి విన్నాడు. అక్కడికి శిరిడీ ఒకటిన్నర మైళ్ళు మాత్రమే కావడంచే ఇక ఆలస్యం చేయక రాసనే శిరిడీకి వెళ్ళాడు.
బాబా దర్శనంతో రాసనే మనసు చాంచల్యం పోయి ప్రశాంతత ఆవ #హంచింది. అతను శిరిడీ వెళ్ళింది కేవలం సంతాన ప్రాప్తి కలిగించమని. రాసనే బాబాకు సాష్టాంగ ప్రమాణం చేయగానే బాబా అతని ముఖంలోకి తీక్ష ణంగా చూసి ”నీ కోరిక త్వరలోనే తీరుతుంది” అని ఆశీర్వదించారు. తను ఏమీ చెప్పకనే తన మనసులో వున్న కోరిక తెలుసుకొని ఆశీర్వదించిన బాబా సర్వజ్ఞత పట్ల ముదమొంది దాము అన్నా ఆనంద బాష్పాలతో అభిషే కం చేసాడు.
అ#హ్మద్‌నగర్‌ నుండి శిరిడీ దగ్గర కావడాన దామూ అన్నా తరచుగా శిరి డీ వెళ్తుండేవాడు. అయితే తొలినాళ్ళలో బాబా అతనిని శిరిడీలో ఎక్కువ కాలం వుండనిచ్చేవారు కాదు. భక్తుల కోరికలను సత్వరం తీర్చేందుకు బాబా వారిని శిరిడీలో ఎక్కువ రోజులు వుండనిచ్చేస్తారని ఇతర భక్తుల ద్వారా విన్న దాము అన్నా తన పట్ల అలా జరుగక పోయేసరికి ఒకింత నిరాశకు గురయ్యాడు. బాబా పట్ల పెంచుకున్న విశ్వాసం సంశయాలకు తావులేకుండా చేసింది.
అప్పుడే దాము అన్నాచెల్లెలు మరణించింది. ఆ వార్తతో దాము అన్నా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. నిద్రాహారాలు కూడా మా నివేసి చెల్లెలు గూర్చి శోకించసాగాడు. అప్పుడు దూతల ద్వారా దా ము అన్నాకు బాబా కబురు పంపించి, అతను శిరిడీకి వచ్చాక తన సన్నిధిలో కూర్చో బట్టుకొని స్వాంతన వాక్యాలను పలికారు. తర్వాత అప్పా కులకర్ణిని పిలి చి రాసనే కోసం పోళీలను తయారు చెయ్యమన్నారు. అశుభం జరిగి నప్పుడు పిండివంటలు, సంబరాలు నిషేధమైనా బాబా ఆజ్ఞకు తల ఒగ్గి రాసనే కులకర్ణి ఇంటిలో విందులో పాల్గొన్నాడు.
ఇలా అయిదారు సంవత్సరాలు గడిచాయి. రాసనే బాబాను అదే భక్తి విశ్వాసాలతో సేవిస్తూ వున్నాడు. అయితే సంతానం కావాలన్న అతని కోరిక తీరలేదు. రాసనే బంధుమిత్రులు రాసనేను మూడవ వివాహం చేసుకోమని బలవంత పెట్టసాగారు. ఇక అటోఇటో తేల్చుకోవాలని, తన సమస్యను బాబాకు నివేదించాలని ఒక శుభ ముహూర్తాన రాసనె శిరిడీ బయలుదేరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement