Tuesday, November 26, 2024

పరమాచార్యుల అపారశక్తి

పరమాచార్యస్వామి వారు తమని తాము సాధారణ సన్యాసిగా చెప్పుకున్నా కొన్ని సంఘటనలు వారి నిజరూపాన్ని వారి అపార శక్తిని తెలియపరుస్తాయి. అలాంటి ఒక సంఘటన ఒకరి జీవితంలో జరిగింది. మహాస్వామి వారి వలన వారికి ఎదురైన అనుభూతిని తెలుసుకుని మనమూ అనుభూతిని చెందుదాము.
ఒకసారి పరమాచార్య స్వామి వారు తిరువనై క్కావల్‌లో మకాం చేసారు. తంజావురుకు చెందిన ఒక మహిళ, ఆమె భర్త మహాస్వామి దర్శనానికి వచ్చా రు. అదేరోజు ఆయనను దర్శించుకుని రాత్రికి తంజా వురు వెళ్ళిపోవాలని వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు రాత్రికి వెళ్ళిపోవాలనే అనుకున్నారు. ఎందు కంటే మరుసటిరోజు సోమవారం అమావాస్య. వారి ద్దరూ కలిసి తంజావూరులో రావిచెట్టుకు ప్రదక్షిణ చేయాలని అనుకున్నారు.
మహాస్వామి వారు అక్కడకు వచ్చిన అందరి తోను మాట్లాడి వారికి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు. ఆ భార్యాభర్తల విన్నపం విని కూడా వారి మాటలు విన్నట్టు ఉన్నారు. వారు వరుసలో వచ్చినప్పుడు కూ డా ముందువరకు అందరికి ప్రసాదం ఇచ్చి వారి వం తు వచ్చిన వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయేవారు. వారు పదేపదే అలాగే చేస్తుండేవారు.
మహాస్వామి అనుగ్రహం లభించకపోవడంతో ఆ దంపతులు ఆ రాత్రికి తంజావూరు వెళ్ళే ఆలోచన విరమించుకుని రాత్రికి అక్కడే ఉండిపోయారు. ఆమె కు మహాస్వామి వారిపై చాలా కోపంగా ఉంది.
మరుసటి రోజు ఉదయం విశ్వరూపం తరువా త, వారి గంట జపం మొదలుపెట్టేముందు మేనేజరు వారితో ”ముప్పావు గంట తరువాత నేను జపంలో ఉండగానే పల్లకిని కొల్లిదం నది ఒడ్డుకు చేర్చుటకు ఏర్పాట్లు చెయ్యమని” చెప్పారు. వారు పల్లకి లోపల కూర్చుని తలుపులు వేసుకున్నారు.
రావిచెట్టుకు ఎలాగు ప్రదక్షిణలు చేయలేమని తెలుసుకుని, కనీసం మహాస్వామి వారి చుట్టూ తిరు గుదామని అనుకున్నారు ఆ దంపతులు. మేనా చు ట్టూ ప్రదక్షిణలు చెయ్యడం మొదలుపెట్టారు అది పూర్తి అయిన తరువాత పల్లకి బయలుదేరింది. ఆ దంపతులు కూడా దాని వెంట వెళ్ళి కొల్లిదం చేరుకుని అక్కడే స్నానాదులు ముగించారు.
పరమాచార్య స్వామి వారు తమ అనుష్టానానికి కూర్చుంటూ ఆ మహిళను పిలిచి ”ఎన్ని ప్రదక్షిణలు చేసావు?” అని అడిగారు. ”తొంభై ప్రదక్షిణలు” అని చెప్పింది ఆమె. కాని ఆమె ప్రదక్షిణలు చేసినట్టు మహా స్వామి వారు చూసే అవకాశమే లేదు. మిగిలిన ప్రదక్షి ణములు కూడా పూర్తి చెయ్యమని చెప్పారుట.
ఆమె మిగిలిన ప్రదక్షిణలు పూర్తిచేసిన తరువాత పరమాచార్య ”ఏ శ్లోకం పఠిస్తూ ప్రదక్షిణలు చేసా వు?” అని అడిగారు. ”గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుదేవో మహేశ్వ ర: అని మననం చేస్తూ ప్రదక్షిణ చేసాను” అని ఆమె చెప్పింది.
”రావిచెట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం పఠిస్తావు?” అని అడిగారు.
”మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూ పాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమో నమ:” అని ఆమె చెప్పింది.
వెంటనే మహాస్వామి వారు ”మరింకేంటి ఇక్క డా త్రిమూర్తియే అక్కడా త్రిమూర్తియే. సరిపోయిం ది కదా!” అంటూ ఆమెను ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. అప్పటినుండి ప్రతి సోమవార అమావాస్య నాడు పరమాచార్య స్వామివారికి ప్రదక్షిణ చెయ్యా లని నియమం పెట్టుకుంది ఆ మహిళ.

Advertisement

తాజా వార్తలు

Advertisement