Tuesday, November 26, 2024

అపూర్వం అసామాన్యం సాయి నామం!

సాయి భక్తాగ్రేసరుడైన దాసగణు మహారాజ్‌ తన కీర్తనలు, హరికథ సత్కాలక్షేపం, ఉపన్యాసాల ద్వారా సాయినాథుని మహమలను, అవతార ప్రశస్తిని దేశం నలు మూలలా ప్రచారం చేసాడు. తద్వారా సాయినాథుని దర్శనం కోసం నిత్యం వేలాది మంది శిరిడీకి వస్తుండేవారు. ఒకసారి దాసగణు తన కీర్తనల పరంపరను ముగించుకొని శిరి డీకి వచ్చేందుకు కోపర్గంలో రైలు దిగాడు. మాటల సందర్భంలో అతనికి, కోపర్గాం స్టేషన్‌ మాస్టరుకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. సాయిని గూర్చి ఆక్షేపింపదగిన మాటలను ఆ స్టేషన్‌ మాస్టర్‌ అన్నప్పుడు ఒకసారి శిరిడీ వచ్చి సాయి ప్రభువులను దర్శించుకున్నాక మట్లా డమని దాసగణు సమాధానం చెప్పాడు. సరే అని అతనితో బయలుదేరి స్టేషన్‌ మాస్టర్‌ శిరిడీ కి వచ్చాడు. మసీదు ముందు వరుసగా మట్టికుండలను బోర్లిస్తున్నారు శ్రీ సాయినాథులు. వారికి నమస్కరించి ఎందుకలా కుండలను బోర్లిస్తున్నారని దాసగణు అడుగగా ”ఏం చెయ్యమంటావు గణు? నా వద్దకు వచ్చేవారి హృదయాలన్నీ బోర్లించే కుండల వంటివి. ఎం తగా నీరు నింపుదామన్నా సాధ్యపడడం లేదు” అని చమత్కారం గా అన్నారు.
”కొంచెం అర్ధమయ్యేలా వివరించండి బాబా” అని దాసగణు ప్రార్ధించగా ”మానవుల హృదయాలు ఖాళీకుండల వంటివి. విశ్వాసంతో వస్తే కుండలలో నీరు నింపినట్లు వారి హృదయాలలో జ్ఞానాన్ని నింపవచ్చు. కానీ అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లిం చిన కుండల వంటివి. వాటిపై ఎంత నీరు పోసిన పక్కకు జారిపోతాయి గాని నిండవు” అని బాబా బదులిచ్చారు. ఆ మాటలకు ఆ స్టేషన్‌ మాస్టర్‌ సిగ్గుతో తల వంచుకున్నాడు. అక్కడ వున్న మూడు రోజులలో ఒక కొత్త ప్రపంచాన్నే చూసాడు. సంతానం లేనివారు సంతానాన్ని, నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు. రోగాలతో బాధపడేవారు మందూ మాకు లేకుండానే ఆరోగ్యవంతులై తిరిగివెళ్తున్నారు. ఏడుస్తూ వచ్చినవారు తమ బాధలకు పరి ష్కారం పొంది నవ్వుతూ హాయిగా వెళ్తున్నారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలు లేకనే అందరికీ సమానంగా సాయి అనుగ్రహ ఫలం దక్కుతోంది. మావల్లకాదని వైద్యులు చేతు లెత్తేసిన వారందరికీ సాయి అభయ హస్తం అందించిన తోడనే రోగాలు మటుమాయం. దు: ఖం, ఆశాంతి, ఆందోళన అన్నవి శిరిడీలో మచ్చుకైనా కనిపించడం లేదు. అంతటా స్వచ్ఛమై న అధ్యాత్మిక ప్రశాంతత నెలకొనబడి వుంది.
సాయిని వట్టి మోసగాడినని వాదించిన ఆ స్టేషన్‌ మాస్టరుకు ఇదంతా చెసేసరికి అజ్ఞా నపు చీకట్లు తొలగిపోయి జ్ఞానోదయమయ్యింది. శ్రీ సాయి కేవలం యోగ సామ్రాట్టే కాక పరి శుద్ధ పరమేశ్వర అవతారం అని గ్రహంచాడు. తీవ్రమైన పశ్చాత్తాపంతో వెళ్ళి సాయినాథుని కాళ్ళపై పడి తన తప్పులకు క్షమార్పణ వేడుకున్నాడు. కరుణా సముద్రుడైన శ్రీ సాయి దేవుడు అతనిని శీఘ్రమే క్షమించి ఊదీ ప్రసాదాలతో ఆశీర్వదించి పంపించేసారు.
ఒకసారి బాపూసాహబ్‌ జోగ్‌ తన స్నేహతునికి పదిహను వందలు అప్పు ఇచ్చాడు. ఇద్ద రూ అప్పు తాలూకు వివరాలను స్టాంపు పేపరుపై రాసుకున్నారు. ఆర్ధికపరమైన కష్టాలలో వున్నందున ఆ స్నే#హతుడు గడువు లోపల అప్పు తీర్చలేకపోయాడు. అప్పుడు జోగ్‌ ఆగ్రహంతో నిప్పులు చెరుగుతూ ఆ స్నే#హతునిపై దావా వేయడానికి సిద్ధమై సాయి అనుమతి కోసం మశీదుకు వెళ్లాడు. శ్రీ సాయి అతనిని శాంతపరుస్తూ ”భావూ, నీ డబ్బు ఎక్కడికీ పోదు, నువ్వు ప్రశాంతంగా ధ్యానం చేసుకో” అని అన్నారు.
”అదేమిటి బాబా అలా అంటారు. నేను దావా వేయనిదే ఒక్క పైస కూడా మిగిల్చేలా లేడు వాడు. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు, కష్టాలలో వున్నాడని ఇస్తే ఇలా ఎగగొడ తాడనుకోలేదు” అంటూ అసహనం ప్రదర్శించాడు జోగ్‌.
జోగ్‌ ఎంత బ్రతిమిలాడినా శిరిడీ విడిచిపోవడానికి అతనికి శ్రీ సాయి పర్మిషన్‌ ఇవ్వలే దు. కొంతకాలం తర్వాత జోగ్‌ స్నేహతుడు డబ్బు మొత్తం తీసుకువచ్చి ఇవ్వగా వడ్దీ కూడా ఇస్తే గాని తీసుకోనని జోగ్‌ మంకు పట్టుపట్టాడు. ఈ తంతు జరుగుతుండగా శ్రీ సాయి జోగ్‌కు కబురుపెట్టారు. మసీదుకు వచ్చిన జోగ్‌కు కమ్మగా చివాట్లు పెట్టారు ”అత్యవసరమైతే తప్ప ఎదుటి వారి నుండి వడ్డీ తీసుకోవడం మహా పాపం. అందువలన నువ్వు ఆచరించిన ధర్మ మంతా వ్యర్ధమైపోతుంది. ఎదుటివారు కష్టాలలో వున్నప్పుడు ఇతోధికంగా సాయం చేయ డం మానవులు కనీస ధర్మం. పూర్వజన్మ కర్మ వలన అతను కష్టాల కడలిలో కూరుకుపో యాడు. అందువలన నీ డబ్బును తిరిగివ్వడం కాస్త ఆలస్యమయ్యింది అంతమాత్రాన అతని ని వడ్డీ అంటూ పీడించుకు తినడం తప్ప.”
బాబా మాటలకు జోగ్‌కు జ్ఞానోదయమయ్యింది. తన స్నేహతుని నుండి అసలు మా త్రమే తీసుకొని పంపేసాడు. రాదనుకున్న డబ్బును వచ్చేలా చేసిన శ్రీ సాయి దేవునికి ఆ డబ్బు అంతా సమర్పించాడు కాని సాయి కొద్దిగా దక్షిణగా స్వీకరించి మిగితాది అతనికి తిరిగి ఇచ్చేసారు. భగవంతుడు దయతో ప్రసాదించిన ధనమును చక్రవడ్డీ అంటూ వడ్డీలకు తిప్పు తూ, సమయానికి కట్టని బడుగులపై కొరడా ఝులిపించి వారిని జలగల వలే పీక్కు తినే నేటి వడ్దీ వ్యాపారస్థులకు ఈ లీల ఒక కనువిప్పు.
సాయి నామం అపూర్వం, సాయి ధ్యానం అసామాన్యం, సాయి శరణమే సకల చింతన లను దూరం చేస్తుంది. సమర్థ సద్గురువు శ్రీ సాయినాథునికి శ్రద్ధ సబూరిలతో సర్వస్య శరణా గతి చేస్తే చాలు ఆయన కరుణా వీక్షణం మనపై కురుస్తుంది. మనల్ని అతి దుర్లభమైన ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటించేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement