Tuesday, November 26, 2024

ధర్మం మర్మం – మార్గశిరమాస విశిష్టత

అష్టాక్షరాంకితా ముద్రా యస్య ధాతుమయీ కరే|
శంఖపద్మాది బిర్యుక్తా పూజ్యతే సౌ సురాసురై: ||

ధృతా నారాయణీ ముద్రా ప్రహ్లాదేన పురా కరే |
విభీషణన బలినా ధ్రువేణచ శుకేనచ |
మాంధాత్రాహ్యంబరీషేణ మార్కండేయ ముఖైర్ద్విజై:

శంఖాది చిహ్నితైశ్శస్త్రై: దేహం కృత్యాచ మానద |
ఏవమారాధ్య మాం ప్రాప్య సమాహిత ఫలం మహత్‌ ||

గోపీచందన మృత్స్నయా లిఖితో యస్య విగ్రహ: |
శంఖ చక్రాది పద్మాంకో దేహే తస్యవసామ్యహమ్‌ ||

సౌవర్ణం రాజతం తామ్రం కాంస్య మాయ స మేవచ |
చక్రం కృత్వాతు మేధావీ ధారయీత విచక్షణ: |
ద్వాదశారంతు షట్కోణం వలత్రయ విభూషితమ్‌ ||

- Advertisement -

ఏవం సుదర్శనం చక్రం కారయీత విచక్షణ: |
ఉపవీతాది వద్ధార్యా: శంఖచక్ర గదస్సదా ||
ఆయా లోహములతో చేయబడిన అష్టాక్షరాంకితమైన ముద్ర శంఖ పద్మాదులతో కూడియున్నది ధరించినవాడు సురాసురులతో పూజించబడును. పూర్వముప్రహ్లాదుడు తన కరమున నారాయణ ముద్రను ధరించియున్నాడు. అలాగే విభీషణుడు బలిచక్రవర్తి, ధ్రువుడు, శుకమహర్షి, మాంధాత, అంబరీషుడు, మార్కండేయుడు మొదలగు ద్విజులు ధరించియున్నారు. శంఖాది చిహ్నములతో దేహమును అలంకరిచుకొని ఇలా నన్ను చేరి ఆరాధించినచో కోరిన ఫలము లభించును. గోపీచందనముతో మృత్తికతో శంఖ చక్ర పద్మములను శరీరమున అంకితము చేసుకొనినచో అతని దేహమున నేను నివసింతును. బంగారముతో వెండితో రాగితో కంచుతో ఇనుముతో చక్రము చేసుకొని వివేకముతో ధరించవలయును. 12 అరలు, 6 కోణములు, 3 వలలు కలిగి ఇట్లు సుదర్శన చక్రమును వివేకి చేయించవలయును. ఉపవీతాదుల వలె ఆ చక్రమును ధరించ వలయును.

డా|| కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement