శంఖాంకిత తనుర్విప్రో భుంక్తేవైయస్యవేశ్మని |
తదన్నం స్వయమశ్నామి పితృభిస్సహ పుత్రక ||
కృష్ణాయుధాంకితం దృష్ట్యా సన్మానం న కరోతియ: |
ద్వాదశాబ్దార్జితం పుణ్యం వాష్కలేయాయ గచ్ఛతి ||
కృష్ణాయుధాంకితో యస్తు శ్మశానే మ్రియతేయది |
ప్రయాగేయా గతి: ప్రోక్తా సాగతిస్తస్య మానద ||
మమాయుధై: కలౌ నిత్యం మండితోయస్య విగ్రహ: |
తత్రాశ్రమం ప్రకుర్వంతి విబుధావా సవాదయ: ||
య:కరోతి చ మే పూజాం మమశసస్త్రాంకితో నర: |
అపరాధ సహస్రాణి నిత్యం తస్య హరామ్యహమ్ ||
కృత్వా కాష్ట మయం బింబం మమశ స్త్రై: సుచిహ్నితమ్ |
యోవా అంకయతే దేహం తత్సమోనాస్తి వైష్ణవ! ||
శంఖమును చిహ్నించుకొని దేహము కలవాడైన విప్రుడు భుజించిన ఇంటిలోని ఆ అన్నమును స్వయముగా నేను భుజిం చెదను. పితృదేవతలతో కలసి మరీ భుజించెదను. శ్రీకృష్ణ భగవానుని ఆయుధములను చిహ్నములుగా ఏర్పరుచుకొనినవానిని చూసి సన్మానము చేయని వాడు 12 సంవత్సరములు సంపాదించిన పుణ్యమును యమధర్మరాజునకిచ్చును. కృష్ణాయుధికింత దేహము కలవాడు శ్మశానమున మరణించినచో ప్రయాగలో మరణించినకపుడు లభించు ఉత్తమ గతి లభించును. కలియుగమున నిత్యము నా ఆయుధములతో అలంకరించుకొనబడిన దేహము కలవాడున్న ప్రదేశమున ఇంద్రాది దేవతలు తమ ఆశ్రమమును ఏర్పరచుకొందురు. నా ఆయుధములను తన దేహమున ఏర్పరచుకొనిన నరుడు నా పూజను చేసినచో ప్రతి దినము అతను చేసిన నూరు అపరాధములను నేను నశింపచేతును. నా ఆయుధముతో చిహ్నితమైన కాష్టమయమైన బింబమును చేసి దానితో తన దేహమును చిహ్నించుకొనినచో అతనితో సమానుడైన వైష్ణవుడు ఇలలో ఉండడు.
డా|| కందాడై రామానుజాచార్యులు