Tuesday, November 26, 2024

ధర్మం మర్మం – మార్గశిరమాస విశిష్టత

అనామికా శాంతిదోక్తా మధ్య మాయుష్కరీమతా |
అంగుష్ఠ: పుష్టిద: ప్రోక్త: తర్జనీ మోక్షదాయినీ ||

గోపీచన్దన ఖండంతు యోదదాతి చ వైష్ణవే |
కుల మష్టోత్తరం తేన తారితంవై భవేచ్ఛతమ్‌ ||

యజ్ఞో దానం తపో హోమ: స్వాధ్యాయ: పితృతర్పణమ్‌ |
వ్యర్థం భవతి తత్సర్వం ఊర్థ్వ పుండ్రం వినాకృతమ్‌ |

యచ్ఛరీరం మనుష్యాణాం ఊర్థ్వ పుండ్రం వినాకృతమ్‌ |
తన్ముఖం నైవ పశ్యామి స్మశానసదృశంహి తత్‌ ||

ఊర్థ్వపుండ్రం ప్రుకుర్వీత మత్స్యకూర్మాది ధారణమ్‌ |
కుర్యాద్విష్ణు ప్రసాదార్థం మహావిష్ణురతిప్రియమ్‌ ||
ఊర్థ్వపుండ్రము(నుదుటున తిరునామము)ను అనామిక(ఉంగరం వేలు)తో ధరించిన శాంతిని కలిగించును. మధ్యను ఆయుష్యమును పెంచును. బొటనవేలు పుష్టిని ప్రసాదించును. చూపుడు వేలు మోక్షమును ప్రసాదించును. గోపీ చందన ఖండమును వైష్ణవునకు ప్రసాదించినచో అతని కులమున నూటా యెనిమిది తరములు తరించబడును. ఊర్థ్వపుండ్రము లేకుండగా చేసిన యజ్ఞము, దానము, తపము, హోమము, స్వాధ్యాయము, పితృతర్పణము అన్నీ వ్యర్థములగును. ఊర్థ్వ పుండ్రము లేని శరీరము కల ముఖమును నేను చూడను. ఊర్థ్వ పుండ్రము లేని ముఖము స్మశాన సదృశమని తెలియుము. ఊర్థ్వ పుండ్రమును ధరించవలయును. మత్స్య కూర్మాదులను ధరించ వలయును. ఇది మహావిష్ణువునకు అతిప్రియము. మహావి ష్ణువు అనుగ్రహము పొందుటకు ఊర్థ్వ పుండ్రధారణ చేయవలయును.

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement