Wednesday, November 20, 2024

ధర్మం మర్మం – మార్గశిరమాస విశిష్టత

అన్యైర్ధర్మాది భి: కృత్వా గోపితం మార్గశీర్షకమ్‌ |
మాత్ప్రాప్తే: కారణం మత్వా దేవై స్స్వర్గనివాసిభి: ||

యేకే చిత్పుణ్యకర్మాణ: మమ భక్తిపరాయణా: |
తేషా మవశ్యం కర్తవ్యం మార్గశీర్షో మదాపన: ||

మార్గశీర్షం న కుర్వంతి యే నరా భారతా జిరే |
పాపరూపాశ్చ తేజ్ఞేయా: కలికాల విమోహితా:

అష్టస్వపి చ మాసేషు యత్ఫలం లభతే నర:
తత్ఫలం లభతే వత్స మాఘే మకరగేరవౌ ||

మాఘాచ్ఛత గుణం పుణ్యం వైశాఖేమాసి లభ్యతే |
తస్మాత్సహస్ర గుణితం తులాసంస్థే దివాకరే ||

- Advertisement -

తస్మాత్కోటి గుణం పుణ్యం వృశ్చికస్థే దివాకరే |
మర్గ శీర్షోధికస్తస్మాత్‌ సర్వదా చ మమ ప్రియ: ||

ఇతర ధర్మాదుల నాచరించి మార్గశీర్ష వ్రతము రక్షించబడినది. మార్గశీర్షము నన్ను చేరుటకు కారణమని తలచి దాచి ఉంచా. ఇక ఇతరులు నా భక్తిపరాయణులు పుణ్యకర్మల నాచరించు వారు తప్పకుండా నన్ను పొం దుటకు మార్గశీర్ష వ్రతమును ఆచరించవలయును. మార్గశీర్ష వ్రతమును చేయనివారు పాపులుగా కలికాల విమోహితులుగా తెలియవలయును. 8 నెలలలో పొందు ఫలము రవి మకరరాశిలో నున్నపుడు మాఘమాసములో లభంచును. మాఘము కంటే నూరు రెట్లు ఫలము వైశాఖమాసములో లభించును. దానికంటే వేయిరెట్లు తులారాశిలో సూర్యుడు ఉన్నపుడు లభించును. దానికంటే కోటిరెట్లు ఫలము వృశ్చిక దివాకరునిలో లభించును. దానికంటే మార్గశీర్షము అధికము. నాకు అన్ని వేళలా ప్రియతమము.

డా|| కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement