Thursday, November 21, 2024

ధర్మం మర్మం – మార్గశిరమాస విశిష్టత

తులసీకాష్ఠ మాలాంతు ప్రేతరాజస్య దూతకా: |
దృష్ట్యా నశ్యంతి దూరేణ వాతోద్భూతం యధా దలమ్‌ ||

యద్గృహే తులసీ కాష్ఠం పత్రం శుష్క మధార్ధ్రకమ్‌ |
భవంతి తద్గృహేనైవం పాపం సంక్రమతే కలౌ ||

తులసీకాష్ఠ మాలాభి: భూషితో భ్రమతే భువి |
దుస్స్వపనం దుర్నిమిత్తంచ న భయం శాత్రవం క్వచిత్‌ ||

ధారయన్తి న యే మాలాం హేతుకా: పాపబుద్ధయ: |
నరకాన్నన్ని వర్తన్తే దగ్ధా: కోపాగ్నినా మమా ||

తుస్మాద్ధార్యా ప్రయత్నేన మాలా తులసి సంభవా |
పద్మాక్ష నిర్మితా భక్త్యా ఫలై: ధాత్య్రాసు పుణ్యదా ||
యమరాజ దూతలు తులసీకాష్ఠ మాలను చూచి గాలికి ఎగిరిపోయిన ఆకులవలె దూరములోనే నశించెదరు. తులసీకాష్ఠము పచ్చిది కాని, ఎండినది కాని, తులసీపత్రమున్న ఇంటిలో కలి యుగములో పాపము సంక్రమించదు. తులసీకాష్ఠ మాలలతో అలంకరించబడి, ఈ భూమండలమున సంచరించు వారికి దుస్స్వప్నము కాని, దుర్తిమిత్తములు కాని శత్రు భయములు కాని సంభవించవు. హేతువాదులు, పాపబుద్ధులు తులసిమాలను ధరించనివారు నా కోపాగ్నిచే దహించబడి నరకము నుండి తొలగిపోరు. కావున ప్రయత్నపూర్వకముగా తులసిమాలను ధరించవలయును. లేదా భక్తితో తామరపూసల మాలను కానీ, ధాత్రీ ఫలముల మాలను కాని ధరించవలయును. ఇది మంచి పుణ్యమును ప్రసాదించును.

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement