బ్రాహ్మణౖశ్చ వివేషణ వైష్ణవైశ్చ విశేషత: |
ఉపవీతం శిఖాయద్వత్ చక్రం లాంఛన సంయుతమ్ ||
చక్రలాంఛన హీనస్య విప్రస్య విఫలం భవేత్ |
మమ చక్రాంకితో దేహ: పవిత్ర ఇతివై శ్రుతి: ||
చక్రాంకితాయ దాతవ్యం హవ్యం కవ్యం విచక్షణౖ: |
మమ చక్రాంక కవచమభేద్యం దేవదానవై: |
అజేయ స్సర్వభూతానాం శత్రూణాం రక్షసామపి ||
మమ చక్రాంక కవచం శరీరేయస్య తిష్ఠతి |
నాశుభం విద్యతే తస్య గృహపుత్రాది కస్య హి ||
దక్షిణచ భుజే విప్రో బిభృయద్వై సుదర్శనమ్ |
సవ్యేచ శంఖం బిభృయాత్ ఇతి వేదవిదో విదు: ||
తత్తన్మంత్రేణ మంత్రజ్ఞ: ప్రతిష్ఠాప్య పృధక్పృథక్ |
లలాటే చ గదాధార్యా మూర్థ్ని చాపం శరస్తధా |
నందకాచైవ హృన్మధ్యే శంఖ చక్రే భుజద్వయే ||
తస్మాత్సర్వ ప్రయత్నేన చక్రాదీన్ ధారయేత్సదా |
ధారణానన్తరం బ్రూయాత్తత్రచైవ ద్విజోత్తమ! ||
విశేషించి బ్రాహ్మణులు, అందులోను వైష్ణవులు ఉపవీతమును శిఖను ధరించినట్లు చక్రలాంఛనమును ధరించవలయును. చక్రలాంఛనము లేని విప్రుని క్రియలు విఫలములు అగును. నా చక్రాంకితమైన దేహము పవిత్రమని శ్రుతి కలదు. చక్రాంకితుడైన వానికే హవ్యమును కవ్యమును ఈయవల యును. నా చక్రాంక కవచము దేవదానవులకు అభేద్యము. సకల ప్రాణులకు శత్రవులకు రాక్షసులకు కూడా ఇదియే అభేద్యము. నా చక్రాంక కవచము శరీరమున నున్నచో అతనికి గృహపుత్రాదుల లో అశుభ ముండదు. విప్రుడు దక్షిణ(కుడి) భుజమున సుదర్శనమును వామ(ఎడమ) భుజమున శంఖమును ధరించవలయునని వేదవిదులు తెలియుదురు. మంత్రములు చ క్కగా తెలిసిన వాడు ఆయా మంత్రములతో ప్రతిష్ఠించపచేసి లలాటమున గదను, శిరమున ధనువును, శరమును, హృదయమధ్యమున నందకమును భుజద్వయమున శంఖచక్రములను కావున సకల ప్రయత్నముతో ఎల్లపుడు చక్రాదులను ధరించవలయును.
డా|| కందాడై రామానుజాచార్యులు