ఉ. రాముఁడు లోకరక్షకుఁడు రాక్షసమాయలఁజిక్కి కానలో
భూమితనూజఁబాసి రవిపుత్త్రుఁగనుంగొని మైత్రి చేసి శా
ఖామృగసేనఁ గూర్చి దశకంఠజయార్ధమొనర్చె విక్రమ
శ్రీ మెరయన్ సముద్రమున సేతువు మోక్షసుఖైక ##హతువున్.
(ఏనుగు లక్ష్మణకవి, రామేశ్వర మా#హత్మ్యము, ద్వితీయాశ్వాసం)
లోకరక్షకుడైన శ్రీరాముడు అడవులపాలై సంచరిస్తూ, రాక్షసమాయల ఫలి తంగా భూమిపుత్రి సీతమ్మను పోగొట్టుకుని వెదుకుతూ, దారిలో సుగ్రీవుడితో స్నే#హం చేసి వానర సేనను సమకూర్చుకుని, లంకాధిపతియైన దశకంఠుడిపై విజ యం సాధించి సీతమ్మను చెరనుంచి విడిపించి తెచ్చుకోవాలనే లక్ష్యంతో, ససైన్యంగా వెళ్ళి లంకను ముట్టడించడం కోసంగా సముద్రంపై సేతువును నిర్మించాడు.
రావణ సంహారం అనంతరం సమరంలో విజయుడైన రఘురాముడు లంకకు రావణుడి తమ్ముడైన విభీషణుడిని రాజును చేసి, సురాసుర సిద్ధ సాధ్య గణాలు చుట్టూ చేరి పొగుడుతూ ఉండగా, శోభతో మరలి సీతాలక్ష్మణ స#హతుడై లంక నుండి తిరుగు ప్రయాణమై లోకములన్నీ ఆనందంతో సంబరపడుతూ ఉండగా రామసేతు మీదుగా గంధమాదన పర్వతం చేరుకున్నాడు. అప్పుడు విభీషణుడు శ్రీరాముడికి వినమ్రంగా నమస్కరించి ”స్వామీ! మీ భక్తుడి విన్నపం ఒకటి ఆలకించండి. వీరులైన అన్య ప్రభువులు ఈ రామసేతు మార్గంలో లంకకు దండుగా తరలివచ్చి ముట్టడించే అవ కాశం ఉంది కాబట్టి ఈ సేతువును శ్రీరాములవారే భేదనం చేసి చొరరానిదిగా మారిస్తే బాగుంటుంది” అని విన్నవించుకుంటాడు. విభీషణుడి విన్నపాన్ని మన్నించిన శ్రీరాముడు అలాగే చేయగా అప్ప టినుండి ‘ధనుష్కోటి’గా పిలవబడుతూ ఉంది. ఈ ధనుష్కోటిని దర్శిం చుకున్నందు వలన జంతు సంతతికి ముక్తి కలుగుతుంది.
గీ. రామకరచాపకోటి నిర్దళిత సేతు
రేఖ కైలాసమునకు విరించిలోక
మునకు వైకుంఠ పట్టణంబునకు స్వర్గ
మునకుఁ దెఱవది తాపస ముఖ్యులార.
శ్రీరాముడి చేతిలోని ధనస్సునుంచి వెలువడిన బాణములతో విడిపోయేట్లుగా చేయబడిన సేతుబృంధం ఆనవాలుగా మిగిలిన రేఖామాత్ర నిర్మాణం దర్శించుకోవ డం వలన కైలాసప్రాప్తి, వైకుంఠమునకు, స్వర్గలోకమునకు దారి అన్నవి ఫలితాలుగా సమ కూరుతాయని చెప్పబడింది. బ్ర#హ్మ విష్ణు మ##హశ్వ రులు, వాణి లక్ష్మీ పార్వతు లు, వసు రుద్రాదిత్య గం ధర్వ కిన్నర కింపురుషాదులు, పితృదేవతలు, దశ కోటితీర్థ గణాలతో ధనుష్కోటి తీర్థానికి సన్ని#హతులై వసిస్తూ ఉంటారు కాబట్టి అక్కడి జల ములో పితృదే వతా తర్పణాలను ఆచరిస్తే సర్వపాప ముక్తులౌతారని, భక్తిపూర్వకం
గా అక్కడ ఒక్క భోజనం దానం చేసినా అనంతమైన శుభాలు ఫలితంగా దక్కుతాయని చెప్పబడింది. ధనుష్కోటి తీర్థముతో సమానమైన తీర్థము ముల్లో కాలలోనూ లేదని కూడా సూతునిచే శౌనకాది మహామునులకు చెప్పబడింది.
కం. దళమును కుసుమము ఫలమును
జలము శ్రీరామనాధ శంకరునకు ని
శ్చల భక్తి నొసఁగు జనముల
నల రామేశ్వరుఁడు కాచు ననవరతంబున్.
‘పత్రం, పుష్పం, ఫలం, తోయం’ అన్నట్లుగా, రామేశ్వరంలో శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన శ్రీరామలింగేశ్వరునికి నిశ్చల భక్తితో ఒక్కటైనా సరే ఆకునుగాని, పూవునుగాని, పండునుగాని, ఇవేవీ లభ్యంకాకపోతే భక్తితో నీటినిగాని సమర్పించుకున్నవారిని ఆ శంకరుడు సదా కాపాడుతూ ఉంటాడని పై పద్యంలో చెప్పబడింది. అంతేకాకుండా…
కం. రామేశ్వర రామేశ్వర
రామేశ్వరయనుచు జనులు ప్రత్యూషమునన్
నేమంబుతోఁ బఠించిన
నామేటికిఁ బూర్వదినకతాఘము వాయున్.
”రామేశ్వర, రామేశ్వర, రామేశ్వర!’ అని నియమం తప్పకుం డా ప్రతి ఉదయం స్మరించుకునే జనులకు, అంతకుముందు రోజు చేసిన చెడు పనుల పాపఫలం నుండి విముక్తి కలుగుతుందని”కూడా చెప్పబడింది. అది ఒక విశేషం!