శ్రీశైలంలో హటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాల యం. ఒక బంగారు లింగం తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించిన హాట కేశ్వర దేవాలయ ము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు.
అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధార ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయి న ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలా టమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలిత మును పొందుతారు.
ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపు డయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మ ర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్క డే శివానందల#హరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది.
చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్ర#హ్మధా ర. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార.
ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూ ర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమపావనమయి న క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శ బ్దంగా ఉన్న ప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసు కుని వింటే ఒ క తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రమరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీ చక్రములను వేశారు.
అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది.
శ్రీశైల లింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగా నం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకో వాలి. నాలుగు మారేడు దళములు పట్టు కెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.
పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్ర#హ్మ ఇచ్చిన వ రముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రా#హ అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆ విడ భ్రమరాంబి కాదేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివు డు ఉన్నాడు. పైన శక్తి రూపం తో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది.
శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుం టాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని ”అవిద్యానా మంతస్తిమిర మి#హరద్వీపనగరీ” అని సౌందర్యల#హరిలోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది. అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉంటాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు ఈ వీరభద్రుడి దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గం ట శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉంటే ఆ వ్యాధులు నయం అవుతాయి.
వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. చంద్రావతి అనే రాజకుమార్తె ఒక భయంకరమైన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మో#హం చాడు. ఆమె పరుగున శ్రీశైల క్షేత్రం చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే. ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను కాపాడు’ అంటూ తన సిగలోని మల్లెదండను తీసి స్వామికి సమర్పించింది.
అప్పుడు లింగోద్భవమూర్తి వచ్చి ఆమెను తరుముకు వస్తున్న రాజును చూసి ”నీవు పచ్చలబండవగుదువుగాక” అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఆవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి ‘మల్లికార్జునా’ అని మరొకమారు పిలిపించు కున్నాడు. శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడి పోయి ఉంటుంది. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మ#హధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది.
సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మో#హం చింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వ చ్చి ”నీకు నన్ను వివా#హం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివా#హం ఆడతాను” అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది.
అప్పుడు పార్వతీదేవి ”జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” అని చెప్తారు. కా నీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ”ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివా#హం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకో వడం” అని చెప్పాడు. అపుడు పార్వతీదేవి ”అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా?” అని అడిగింది. అప్పుడు శంకరుడు ”ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు” అని వెంటనే 96 సంవ త్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి ”పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెత కుతున్నావు?” అని అడిగాడు.
ఆమె ”తాను శివుడి కోసం వెతుకుతున్నాను” అని జవాబు చెప్పింది. అప్పుడు ఆయన ”నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా?” అని అడిగాడు.
”నీవు వృద్ధుడవో ¸°వనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను” అని చెప్పింది.
”ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమె ను నాలో ఐక్యం చేసుకుంటున్నాను.” అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని, ”ఈ పిల్ల ను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలి కోసం సృష్టిలో లేనివిధంగా ముడతలు పడిపోయి న శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని నన్ను తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను.” అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణ ములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం. ఆలయ ప్రాంగణం మేడి, జువ్వి, రావి ఈ మూడూ కలిసి పెరిగిన త్రిఫల వృక్షం వుంటుంది.
అత్యంత ఫలప్రదం శ్రీశైల మల్లన్న దర్శనం
Advertisement
తాజా వార్తలు
Advertisement