ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలం… ఆశ నిరాశల మధ్య కొట్టుకులాడే మనుషుల వ్యధార్థ జీవనానికి పరిష్కారం….
సాయి… సాయి… అని ఉదయం లేచిన వెంటనే తలచుకోవడం గొప్ప మేలుకొలుపు. మనసుకు హాయినిచ్చే… మనిషికి స్వస్థత చేకూర్చే గొప్ప ఊరడింపు…. సాయి జీవనం.
నిరంతరం శ్రమించేవారు సాయి. తన పనులకు ఇతరులపై ఆధారపడ లేదు. తన పనుల్ని ఇతరులకు పురమాయించ లేదు ఎల్లప్పుడు పదు గురికి ఉపయోపడే పనుల్లో నిమగ్నమయి వుండేవారు. పనులు లేని సమయాన మౌనం వహించి ధ్యానంలో నిమగ్నమయ్యేవారు. మూడు మైళ్ళ దూరంలో వున్న రహతాకో, నీమ్‌గామ్‌కో వెళ్ళి సాయం త్రానికి మసీదుకు తిరిగి చేరుకునేవారు. రాత్రి త్వరగా నిద్రపోయేవారు. తెల్లవారుజామునే నిద్రలేచేవా రు. ఉదయం కొంతసమయం లెండికి వెళ్ళి వచ్చేవారు. యోగా, ధ్యానం చేసేవా రు. ఉదయం యోగస్థితిలో వుండేవారు. భిక్షను అయిదుగురి ఇళ్ళ వద్దనే తీసుకోవాలన్నది ఆయన నియమం. కనుక ఏ రోజు కూడా అంతకుమించి ఎవరి దగ్గరకు భిక్షకు వెళ్ళలేదు. తన బట్టలు తానే ఉతుక్కునేవారు. తిరుగలిలో గోధుమలు విసురుకుని గోధుమ పిండిని తయారుచేసుకునేవారు. క్రమక్రమంగా తనను దర్శించుకునే వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ తను పనులు స్వయంగా చేసుకునేవారు. ఇది ఆయన దినచర్యలో సుస్పష్టంగా కనిపించే అంశం. మసీదుకు తనని చూడటానికి వచ్చేవారితో అవసరమైన మేరకే మాట్లాడే వారు. ఎదుటివారు చెప్పుకునే బాధలు ఓపికగా వినేవారు. తనకు తోచిన ఓదా ర్పు మాటలు చెప్పేవారు. అయితే ఎక్కువసేపు మౌనంగానే వుండేవారు. మధ్యా హ్నం సాధారణమైన భోజనం చేసేవారు. రాత్రిళ్ళు చాలా తక్కువ తినేవారు. సాయిబాబా ఇహపరమైన విషయాల మీద, విలాసాల మీద ఎన్నడూ మనసు పెట్టలేదు. సాయిబాబా తన దగ్గరకు వచ్చే భక్తులకు స్వయంగా వండి ప్రసా దంగా అందించేవారు. పెద్ద గంగాళంలో ప్రసాదం తయారుచేసే వారు. ఇందు కోసం పప్పు, బియ్యం, కూరగాయలు కిచిడీ తయారుచేసేవారు. చక్కెరపొంగలి వండేవారు. ఒక్కొక్కసారి మాంసము, మసాలాలు కలిపి పలావు వండి పంచిపెట్టేవారు.
ఆధ్యాత్మిక చింతన ఉండగానే సరిపోదు. లోకవ్యవహారంలో కరుణాంతరం గంతో నడచుకోవలసిన అవసరాన్ని బాబా జీవన శైలిని గమనిస్తే అర్థం చేసుకో వచ్చు. బాబా జీవనం మానవులందరికీ ఆదర్శ ప్రాయం. అనుసరణీయం. కనీసం ఈ స్ఫూర్తితో మన రోజువారీ జీవితాన్ని, మానసిక ప్రపంచాన్ని శుభ్రం చేసుకోవడం, శ్రమతో పరిమళింపజేసుకోవడం అందరికి శ్రేయస్కరం.