Sunday, September 29, 2024

దైవ దంపతుల సందేశం!

ఈ భూమండలంపై జీవించే దంపతుల కు (భార్యా, భర్తలకు) ఐదుగురు దైవ దం పతులు అయిన పార్వతీపరమేశ్వరులు, లక్ష్మీదేవి- శ్రీమహావిష్ణువు, సరస్వతి- బ్రహ్మ, ఛా యాదేవి- సూర్యభగవానుడు, రోహిణి- చంద్రుడు. వీరందరూ ఉత్తమ దాంపత్య సంసార సందేశాన్ని అం దించారు. ప్రతీ దాంపత్య జీవితం మూడు పూవులు ఆరు కా యలుగా వర్ధిల్లాలని ఆకాక్షించారు. భార్యాభర్తలూ చెరి సగం గా ఉండాలని, భార్యాభర్తల హృదయం ఒక్కటేనని, భార్యా భర్తల మాట ఒక్కటేనని, భర్తకు భార్య, భార్యకు భర్త తోడునీ డగా ఉండాలనీ… భర్త మెత్తగా, భార్య కఠినంగా ఉన్నా సంసా ర రథాన్ని సమన్వయంగా నడపాలనీ ఉద్బోధించారు.
పార్వతీ- పరమేశ్వరులు: వీరిది అర్ధనారీశ్వరి స్వరూపం. తలనుంచి కాలి బొటనవేలి వరకు నిట్టనిలువునా చెరి సగం ఉంటారు. రెండూ కలిపిన ఒకే రూపంతో ఉండడం వీరి ప్రత్యే కత. ఆలోచనలకు తల, కార్యనిర్వహణకు కాలు సంకేతం. కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త… భర్త ఆపదలో ఉం టే రక్షించే భార్య… వీరే పార్వతీ, పరమేశ్వరులు. వీరు ఆది దంపతులుగా కొనియాడబడినారు. వారి ఆదర్శ దాంపత్య జీవితాన్ని ప్రపంచానికి దివ్య సందేశంగా అందించారు. తమ స్ఫూర్తితో తమ వలే దంపతులు ఉత్తమ దం పతులుగా… కీర్తించబడాలనీ ఉమామహ శ్వరులు కోరారు.
శ్రీలక్ష్మి- శ్రీమహావిష్ణువు: శ్రీలక్ష్మీ శ్రీమహా విష్ణువు వక్షస్థలం మీద (హదయంలో నివా సం) ఉంటుంది. వక్షస్థలం భాగంలోని హృ దయం ఆలోచనలకు కేంద్రం. అక్కడే శ్రీమ హాలక్ష్మి ఉంటుంది. అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఆలోచన ఒక్కటై ఉం టుందో… ఆ జంటే… శ్రీలక్ష్మి- శ్రీమహా విష్ణు వుల జంటకు ప్రతీకని పౌరాణిక పండితులు చెబుతారు.
సరస్వతి- బ్రహ్మ: బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుంది. నాలుక మాటకు సంకేతం. దాని అర్ధం ఇద్దరి మాట ఒక్కటే అవుతుందనీ అర్ధం. ఏ మాట మాట్లాడినా… భార్య మాటే మా ట్లాడే భర్త… భర్తమాటే మాట్లాడే భార్యగా ఉండే జంటను సర స్వతి, బ్రహ్మల జంటతో పోలుస్తారు.
ఛాయా- ఆదిత్యుడు: చండప్రచండుడిగా వెలిగే ఆదిత్యుని (సూర్యుని) తట్టుకుంటూ సాగుతుంది అతడి భార్య ఛాయాదేవి. తన భర్త లోకోపకారం కోసం పాటుపడే వాడు. విపరీతమైన తీక్షణత కలవాడై నా తాను తోడు నీడలా పరిస్థితికి అ నుగుణంగా సర్దుకుపోతూ ఉంటుం ది ఛాయాదేవి. భర్త కఠినంగా, కోపం గా, పట్టుదలతో ఉండి భార్య మా త్రం నెమ్మదిగా, శాంతంగా అణుకు వగాను ఉండి సంసారాన్ని తీర్చిది ద్దుకునే తత్వంతో ఉంటుందో… అ లాంటి జంట ఛాయా ఆదిత్యుల జం టగా స్ఫూర్తి వంతంగా ఉంది.
రోహణి- చంద్రుడు: చంద్రుడు లోకాల కు వెలుగులు ప్రసాదిస్తూ ఆహ్లాదాన్ని కలుగజేసి విపరీతమైన ఆకర్షణ కలిగి ఉంటా డు. చాలా మృదు స్వభావి. కానీ రోహణి కార్తె మహా వేడిగా ఉంటుంది. ఏ దంపతుల్లో… భర్త మెత్తగా, ఆకర్షణీయంగా, భార్య కోపంతో పట్టుదలగా ఉంటుందో… ఆ దంపతులను రోహణి, చంద్రులతో పోల్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement