Saturday, June 29, 2024

అత్యున్నత ఆధ్యాత్మిక ప్రక్రియ క్రియాయోగ!

అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని వేడుకగా జరుపుకోవ డమనేది ప్రపంచ క్యాలెం డర్‌లో ఒక భాగం. దీని అసలైన ప్రా ముఖ్యత మన ఆత్మల లోపల ఉంది.
‘యోగా’ లేక ‘యోగ్‌’ అంటే ‘ఈశ్వ రుడితో కలయిక ‘అని భావార్థం. అన్ని ఆత్మలూ అంతరికంగా వాంఛించే అస లైన కలయిక. ఈ భూమిపై జీవించే మానవుల్లో చాలామంది ‘యోగ’ అన్నమాట వినే ఉంటారు. కానీ వారి లో అత్యధికులు యోగ అంటే శారీరక వ్యాయామాలైన యోగాసనాలు(హఠ యోగం)గా భావిస్తారు. అయినప్ప టికీ యోగంలో మనం అర్థం చేసుకొని ఆచరించాల్సింది ఎంతో ఉంది.
ప్రఖ్యాత ఆధ్యాత్మిక గ్రంథం ”ఒక యోగి ఆత్మకథ” రచయిత పరమ #హంస యోగానంద సత్యాన్వేషకులకు యోగం అంటే అసలైన అర్థాన్ని తెలియజెప్పడానికి పాశ్చాత్య ప్రపంచానికి ప్రయాణించారు. జీవితానికి అసలైన అర్థాన్ని తెలుసుకోగోరే అన్వేషకులు అనుసరించవలసిన ‘కార్యా చరణ ప్రణాళిక’లో ధ్యానం విడదీయరాని భాగమని ఉద్ఘాటించిన ఆయన బోధన కాలానుగుణమైనది. జీవితపు అత్యున్నత లక్ష్యమైన ఆత్మసాక్షా త్కారం లేదా దైవంతో ఏకత్వం సాధించడం అనేది ఆధ్యాత్మిక కృషి వల్లనే సాధ్యమవుతుందని యోగానంద ప్రతిపాదించారు. ప్రతి భక్తుడూ అంచె లంచెలుగా సాధన చేయగలిగిన శాస్త్రీయమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఒకటి తప్పక అవసరమవుతుంది.
క్రియాయోగ యోగం యొక్క అత్యున్నత స్వరూపం. దైవ సంసర్గం సాధించడానికి మానవులకు తెలిసిన సర్వశ్రేష్ఠ మార్గం. క్రియాయోగంలో ఉన్న నిర్దిష్టమైన శాస్త్రీయ ప్రక్రియలు సాధకుడికి తన భౌతిక, మానసిక ఆరో గ్యాలను మెరుగుపరు చుకోవడానికేకాక ఆ ‘యోగి’ క్రమేపీ అసలైన శాంతి, ఆనందం — మన లోపల దైవసాన్నిధ్యపు ఉనికికి సూచనలు కనుగొన గలిగేలా చేస్తాయి. క్రియాయోగ మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించదగినదని, అస్తి త్వపు అత్యున్నత తలానికి చేరుకొనే తిరుగు లేని మార్గమని యోగానంద తన ప్రాచ్య, పాశ్చాత్య శిష్యులిరువురికీ వివరించారు. కొన్ని ప్రారంభ ప్రక్రియలకు ఆయన వివ రణ ఇవ్వడంతో పాటు అత్యున్నత మెట్టయిన క్రియాయోగ ధ్యానమనే ద్వా రానికి దారితీసే ‘జీవించడం ఎలా’ అనే తన తత్వబోధ కూడా వివరించారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా క్రియాయోగాన్ని గురించి రెండుసార్లు గొప్పగా ప్రస్తావించాడు. క్రియాయోగాన్ని దాని లక్షణాలతో తమ జీవన విధానంగా స్వీకరించడా నికి లక్షలాది మంది ప్రేరణ పొందారు. అయితే క్రియాయోగ వల్ల కలిగే లాభం దానిని శ్రద్ధగా అభ్యసించడంలో ఉందని శ్రీయుక్తేశ్వర్‌ గిరి గురువు లా#హరీ మహాశయులన్నారు. మన ఉనికికి పైనుండే ఉన్నత స్థాయిలలోకి ప్రవేశించడానికి స్వర్ణ ద్వారం క్రియాయోగ ప్రక్రియను క్రమం తప్పకుం డా, సరైన విధంగా అభ్యసించడం వల్లనే వస్తాయి. ఇటీవలి దశాబ్దా లలో క్రియాయోగ మార్గాన్ని అనుసరించే భక్తుల సంఖ్య భారతదేశం లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ అపారంగా పెరిగింది.
(నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం)

Advertisement

తాజా వార్తలు

Advertisement