Tuesday, November 26, 2024

మాటలకందనిది ప్రసాద మహత్యం

భగవంతుని గుణ గణాలు, రూప విశేషణలు స్వరూపాల విశేషాలు మననం చేసుకోవటం ప్రసాదం. భగవంతుని ఊసులతో మనసు నింపుకోవటం ప్రసాదం. భగవంతుని లీలలు, మహమల ధ్యాసలో మనముండటం ప్రసాదం. ఉండగలగటం ప్రసాదం. భగవత్‌ తత్వాన్ని ఆలకించడం, భగవత్‌ తత్వం గురించి ఆలోచన చేయడమూ, అనుభవానికి తెచ్చుకోవడం ప్రసాదమే. ఆధ్యాత్మిక మార్గంలో నడవడం దైవ ప్రసాదమే. ఏది జరిగినా, ఏమి జరుగుతున్నా, ప్రతీదీ దైవ నిర్ణయం అని అనుకోవడం, అనుకోగలగటమూ ప్రసాదమే.
”కర్మణ్య వాధికారస్తే …” అని గీతాచార్యుడు గీతలో చెబుతాడు. గీతాచార్యుడు చెప్పినట్లు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. దానినుంచి వచ్చే ఫలితాన్ని ఆశించకు. ఫలితం ఏమొచ్చినా, అసలు రాకున్నా, అది భగవత్‌ నిర్ణయం అనుకున్నప్పుడు, భగవత్‌ నిర్ణయాన్ని అనుభవించగలిగినప్పుడు అది ప్రసా దమే. అలాంటి స్థితికి, పరిస్థితికి మనం ఎదిగినప్పడు ప్రతీదీ దైవ ప్రసాదమే అవుతుంది.
ప్రసాదాలన్నిటిలోను ఏది ఉత్కృష్ట మైన ప్రసాదం? ఈ సందేహం ఓ మా మూలాయనకు వచ్చింది. వెంటనే మామూలాయన ఓ మహానుభావుడ్ని ఇదే ప్రశ్న అడిగాడు సందేహం తీర్చ మని. ”విభూతి ప్రసాదం” అని ఆ మహానుభావుడు సమాధానం చెప్పా డు. ఎందుకు? ఎలా? అని సందేహం వెలిబుచ్చాడు మామూలాయన. సృష్టి లో ఏ పదార్థమైనా, ఎంత విలువైనదై నా క్షణికమైనదే. ఎప్పుడో ఒకప్పుడు నాశనమయ్యేదే.చివరికి బూడిద అవ్వా ల్సిందే. బూడిదయ్యాక దానికి మరో రూపం ఉండదు. అచిరమైన ఐశ్వర్యా లు మారిమారి, యిక మారలేని ఆఖరి స్థితి బూడి ద. అంటే ”విభూతి”. జీవి త తత్వాన్ని అందించే, బోధించే మహోన్న త ప్రసాదం ”విభూతి ప్రసాదం” అని జ్ఞానబోధ చేసాడు ఆ మహనీయుడు.
ఆధ్యాత్మికంగా జీవిత అర్ధాన్ని, పరమార్ధాన్ని విడమర్చి చెప్పే ఎంత లోతైన విశ్లేషణ!!
అసలు ”ప్రసాదం” అంటే ఏమిటి? కొబ్బరి చెక్కో, బెల్లం ముక్కో, వడపప్పో , పానకమో, కాకపోతే గోధుమ పిండి, పాలు, చక్కెరతో చేసిన ప్రసాదం అని పిలువబడే వంటకమో, యేదైనా ప్రసాదమే. ఆఖ రుకి వండి వార్చిన అన్నమైనా, దానిని భగవంతునికి నివేదన చేస్తే, భగవత్‌ శేషమైన, ఆ అన్నం కాస్తా ”అన్న ప్రసాదం” అవుతుంది. ఏ పదార్థాన్నైనా భగవంతుడికి నివేదన చేసి, నైవేద్యంగా అర్పణ చేస్తే, అది పవిత్రతను ఆపాదించుకుని, దైవ ప్రసాదంగా మారుతుంది. భగవంతుని అనుగ్రహానికి ప్రతీక అవుతుం ది. భక్తుల మనోభావాలను, మనసులను, హృదయాలను భగవంతుని దరిచేరుస్తుంది.
ఎంత పనిలో ఉన్నా ప్రసాదం అనగానే, ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంతో పరవశించి పోతారు. ఎం త వారైనా పాదరక్షలు వదిలి, రెండు చేతులు శుభ్రం చేసుకుని, భక్తితో రెండు చేతులు చాచి వినమ్రంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కళ్ళకు అద్దుకొని ఆరగిస్తారు. ప్రసాదం కోసం ప్రతి ఒక్కరూ తపిస్తారు. దైవ దర్శనం కోసం పుణ్య క్షేత్రాలకు వెళ్ళలేక పోయినా, అక్కడి నుంచి తెచ్చిన ప్రసాదంలోనే ఆ భగవంతుణ్ణి దర్శించుకున్నంతటి అనుభూతికి లోనవుతారు అందరూ.

ప్రసాదం విశిష్టత

సత్యనారాయణ స్వామి వ్రత కథలో ”ప్రసాదం” విశిష్టతను వివరించే ఘట్టాలు రెండుంటాయి. మనస్ఫూర్తిగా భక్తిప్రపత్తులతో సత్యనారాయణస్వామి వ్రతం జరుపుకున్న ఓ అమ్మాయి, వ్యాపారం కోసం విదేశాలకేగిన తన పెనిమిటి వస్తున్నాడన్న వార్త తెలియడంతో, భర్త మీదున్న ప్రేమతో, వ్రత ప్రసా దం స్వీకరించకుండా పరుగున సముద్ర తీరానికి వెళ్తుంది. ఫలితంగా పెనిమిటి ప్రయాణం చేస్తున్న పడవ అకస్మాత్తుగా సముద్రంలో మునిగిపోతుంది. ప్రసాదం స్వీకరించలేదన్న తను చేసిన తప్పు, తల్లి ద్వారా తెలుసుకున్న ఆ అమ్మాయి, పశ్చాత్తాపంతో యింటికి పరుగెత్తి కళ్ళకద్దుకుని ప్రసాదాన్ని ఆరగి స్తుంది. ఇది ఒక ఘటన. ప్రసాదం అనేది కుల మత బేధాలకు, స్థాయీ స్థానం తేడాలకు, హోదాలకు, అంతస్తులకు అతీతమైనదనే సందేశాన్ని, విశదపరచే మరో సం ఘటన కూడా స్వామి వ్రత కథ లో మనకి దర్శనమిస్తుంది. నిజానికి దేవుడు మానవుడికి యిచ్చిన మహా ”ప్రసాదం” జీవితం.

Advertisement

తాజా వార్తలు

Advertisement