విశ్వములోని పదార్థముగా భావించేదంతా బ్రహ్మాండముతో పోల్చిన యడల పర మాణు సముదాయముగా కనబడుట సత్యము. ”అణోరణీయాన్ మహితో మహేయాన్ ఆత్మాస్య జంతో: నిహితో గుహాయామ్”. సకల చరాచరా మహా విశ్వం భర ఒక ఆత్మస్వరూపం అనుకుంటే, దానిలోని ప్రతి అణువు పరమాత్మతో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ యంత్రయుగంలోని మానవుడు కనుగొన్న అంతర్జాలం ఎలాగ యితే ఈ ప్రపంచాన్ని మరియు ఇతర కృత్రిమ గ్రహాలను కలిపి నడిపిస్తోందో అలాగ! ఒక్క మీట నొక్కితే మనకు కావలసిన పనులన్నీ ఎలా జరుగుతున్నాయో అలాగ! సెకనుల్లో డబ్బు ను పంపిస్తున్నాము. క్షణాల్లో దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తున్నాము. ఎటువంటి తంతులు లేకుండానే శూన్యం నుండి ఈ మాయను ప్రసారం చేస్తున్నాము. కనుగొన్నది మానవుడే అయితే దానిని నడిపించే అదృశ్య శక్తి మాత్రం ఎక్కడి నుండి వచ్చిందో ఎప్పుడై నా ఆలోచించామా? ఒకరి నుదుటి రాతను మరొకరు అరచేతి నుండి మీటలు న్రొక్కుతూ నిముషాల్లో మార్చడం చూస్తే ”మానవుడే మహనీయుడు” అనే మాట పరమసత్యముగా కనబడుతుంది. మనం సృష్టించుకున్న డబ్బు, విజ్ఞానం, విజ్ఞాన శాస్త్రాలు, పరికరాలు ఇవన్నీ కూడా చివరకు మనిషి యొక్క ”ప్రవర్తన”ను మాత్రమే ప్రతిబింబిస్తాయి. ప్రవర్తనను మాత్రమే పరిశోధిస్తాయి. అంటే మనిషి ప్రవర్తన మనసు యుెెక్క ఆధీనంలో ఉంటుంది. మనసు యొక్క పరిధి విస్తృతం అని మనం అనుకున్నా అది ఒక పదార్థం కనుక దాని పరిధి చాలా చిన్నదనే భావించాలి.
మనసు పదార్థం అయితే ఆత్మ యదార్థం. మనసుతో చేసే ఈ భౌతిక కార్యకలాపాలన్నీ పదార్థం వరకే పరిమితం. అయితే విజ్ఞానమే సర్వస్వము అని భావించే మానవుడు ఈ భౌతిక యంత్రాలను నడిపించే ”శక్తి” యదార్థం అని గ్రహించినపుడు మాతమే ”ఆత్మ”యొక్క చిచ్ఛక్తి అవగతమవుతుంది. ప్రస్థుత అంతర్జాల విన్యాసంతో అద్భుతమైన సకల సౌకర్యాల ను పొందుతున్న మానవుని యొక్క పుణ్యపాపాలను కూడా మహా అంతర్జాలికుడు అయిన పరమాత్మ కూడా తనదైన శైలిలో మీటలు నొక్కుతూ నియంత్రణ ఎందుకు చేయకూడదు? ఖచ్చితంగా చేస్తా డు. ఆత్మతో జన్మించే జీవులు తమ కోరికలను తీర్చుకోవడానికి పడే తా పత్రయమే సంసారం. తానొకటి తలిస్తే భగవంతడు ఒకటి చేస్తాడు. ప్రపంచంలో వింతగా భావించే అనేక విషయాలు ఆ పరాత్పరుడు ఆడే ఆటలో నడుపుతున్న మహా అంతర్జాల కార్యక్రమము అని నమ్మక తప్పదు. అయితే చాలావరకు తన ప్రతిభ వల్లనే ఇవన్నీ జరుగు తున్నాయి అని గర్వ పడటమే గొప్ప అజ్ఞానం. సఫలమంతా తనదని విఫలమంతా ఆ పైవాడిదని సరిపెట్టుకోవ డమే సృష్టి రహస్యం.
మనసు అనేది ప్రతి ఒక్కరిలో విడిగా ఉందని, ఉంటుందని భావించడం అవివేకం. మనసు అనేది ఒక అంతర్జాలం లాంటిది. ఈ సృష్టిలో తమకు మనసుందని తెలుసున్న జీవు లన్నీ ఎలువంటి సూత్రాలు లేకుండానే కలుపబడి ఉంటాయి. సత్త్వగుణ ప్రధానులకు తమ ఆప్తులు పడే వేదన ఎంత దూరంలోనున్నా వారికి ఏదో ఒక రూపంలో అది స్ఫురిస్తుంది.
ఒకరికి ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని హాని చేసినా తలపెట్టినా అది వారి మనసు పడే వేదనా ఫలంగా తిరిగి వారికి తగిలి ఆ పాపఫలం అనుభవించడం ఖాయం. దానినే వ్యవ హారంలో వాళ్ళ ఉసురు తగిలిందిరా! అని అనడం మనం వింటుంటాం.
శరీరం, మనస్సు ఈ రెండు కాలమును, పరిస్థితులను అనుసరిస్తూ పదార్థ నియమాల కు లోబడి పనిచేస్తాయి. కాని ”ఆత్మ” వీటన్నిటికీ అతీతం. అది పరమాత్మ యొక్క పనిము ట్టు. దాని యొక్క కార్యాకారణ సంబంధాలు, విన్యాసం మనకి తెలియదు మనసు వరకు మాత్రమే మనిషికి తెలిసేది. అయితే ఈ మనసుల యొక్క వెనుక ‘ఆత్మ’ ఉంది. ఈ విశ్వం యొక్క నిజతత్త్వం అదే! మనసు, ఆత్మ ఒకటి కానేకావు.
అయితే మనసుకున్న శక్తి చాలా గొప్పది. పరమాణువును ఛేదించి మహోగ్రమైన ప్రచండ శక్తిని కనిపెట్ట కలిగింది. ఆత్మను సాక్షాత్కారం చేసుకోవడానికి పనిముట్టు మనస్సే! జీవుల మనస్సు విశ్వంలోని ప్రతి ఒక్క మనస్సుతో అనుసంధానం చేయబడి ఉంటుంది. కాబట్టి ఎవరి మనసును బాధించినా దానికి సంబంధించిన వారందరూ స్పందిస్తారు. చేసే పాపకార్యం పరోక్షమయినా అది మనసుల ద్వారా ప్రసారమయి ఆ బాధాతప్త ప్రతిస్పందన తిరిగి చేసినవారిని నాశనం చేస్తుంది.
ఆ మహోన్నత శుద్ధ చైతన్య స్వరూపమే ”ఆత్మ” అనే మహా అంతర్జాలం. పరమాత్మ కనుసన్నలో నడపబడే ఒక మహాయంత్రమని మన యంత్రభాషలో అనుకోవచ్చు. సూక్ష్మ మైన పదార్థంతో నిర్మితమైన ఈ మనస్సు పదార్థమైతే ”ఆత్మ” యదార్థం మనసుకు లభించే ఆలోచనా శక్తి దీని ద్వారానే లభిస్తుంది. శక్తిని అందించడం వరకే దాని పని దానిని ఎలా విని యోగించుకుంటున్నామనేది మనసు యొక్క విచక్షణ. అయితే పరమధర్మమైన సృష్టికి విరుద్ధమైతే పరమాత్మ ఖచ్చితంగా తగిన మీటను నొక్కి ఎప్పటికప్పుడు మనసులను సమ తుల్యధర్మానికి అనుగుణంగా నియంత్రిస్తాడు. అవసరమయితే ఆ శరీర ఉపాధిని అదృశ్యం చేసి తిరిగి ఈ సంసార చదరంగంలో మరొక పావుని చేసి క్రీడిస్తాడు. ఆత్మ”ను దర్శించడానికి మనసును ఒక పనిముట్టుగా చేసుకొని పరమాత్మను చేరుకోవడమే లక్ష్యంగా మన సనాత నం బోధిస్తుంది. మనస్సు సహాయంతో మన మనస్సును ఎప్పటికప్పుడు పరిశీలించుకోవ చ్చని తెలియజేస్తోంది. మనసు ఒక అద్భుతమైన పదార్థం.
దీనితో మూడు అంశాలు, మూడు స్థాయిలు, నాలుగు విధులు, అయిదు పరిస్థితులు ఎల్లప్పుడూ మిళితమై ఉంటాయి. అవి సత్త్వ, రజో, తమో గుణాలు ఇవి అంశాలు. చైతన్య, చైతన్య రహిత, మహా చైతన్య ఇవి స్థాయిలు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇవి విధు లు. చెదిరిన, చీకటి క్రమ్ముకున్న, కూడగట్టుకున్న, ఏకాగ్రమైన, సమాధి ఇవి మనసు యొక్క పరిస్థితులు. వీటన్నింటినీ అనుక్షణం అవగాహన చేసుకుంటూ ముందుకు సాగడమనేది కత్తిమీద సాము లాంటిది. అందుకే ప్రధమంగా దేహాత్మభావన అనే అజ్ఞానం నుండి బయట పడాలి. మహాసూత్రధారి అయిన పరమాత్మ యొక్క ఉనికి, అనగా అదే సత్యమని భావించి మనసును మనసుతో జయించి ”ఆత్మ”ను తలుచుకుంటూ ఆనందించడమే సనాతన తత్త్వం. ధర్మ సంస్థాపన కొరకు తన మహాయంత్రంలోని మీటలు నొక్కుతాడనే విషయం మాత్రం ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుకోవడం ఈ కలియుగంలో చాలా ముఖ్యం.
మహా అంతర్జాలికుడు పరమాత్మ!
Advertisement
తాజా వార్తలు
Advertisement