Friday, November 22, 2024

సాయిబాబా యోగశక్తి మహిమ

భక్తులను సంరక్షించ డంలో శ్రీ సాయిది ఒక విభిన్న మైన పద్ధతి. భక్తులు తన వద్ద కు రోగాలతో బాధపడుతూ వచ్చి తగ్గించమని ప్రార్ధించి నప్పుడు విభిన్నమైన పద్ధతు లలో సాయి వారికి చికిత్స చేసేవారు. కొంతమందికి ఊ దీ, తీర్ధ ప్రసాదాలను ఇవ్వ డం, మరికొంత మందికి తలపై చేయి పెట్టి లేదా రోగగ్ర స్తమైన శరీరపు భాగాన్ని తాక డం ద్వారా ఇంకొంతమందికి కలలో కనిపించి తీసుకోవల్సి న మందు తెలుపడం, కొందరి కి అపథ్యమైన ఆహారం స్వీకరించమనడం, ఇలా వివిధ రకాలుగా చికిత్స చే సి ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధుల నుండి తమ భక్తులను శ్రీ సాయి రక్షించా రు. ప్రమాదకరమైన క్షయ రోగంతో బాధపడుతున్న భక్త భీమాజీ కి సాయి కలలో అతను బాధలు పడే టట్లు చేసి అతని రోగాన్ని తగ్గించారు. కలలో నరక యాతన అనుభవించిన తర్వాత జాగృత్‌ వ్యవస్థ లోనికి వచ్చాక అతని క్షయ రోగం మాయమైపో యింది. మరొక సందర్భంలో శిరిడీలో నివశిస్తుండ గా కాకా దీక్షిత్‌కు తీవ్రంగా జ్వరం వచ్చింది. లేవ లేకున్నాననీ, తనకు మందు ఇప్పించమని అతను శ్యామా ద్వారా శ్రీ సాయికి కబురు చేసాడు. సాయి కోపంతో ”ప్రతీవారు కోరికలతో నా దగ్గరకు వచ్చే వారే! నేనేమీ వైద్యుడను కాను. అతనిని ఇంటికి వెళ్ళి పోమని చెప్పు” అని అన్నారు. ”సాయీ కాకా మిమ్మ ల్నే నమ్ముకున్నాడు. ఇంత తీవ్రమైన జ్వరంతో అత నింటికి ఎలా వెళ్ళగలడు? దయచేసి అతని బాధను తగ్గించండి!” అని శ్యామా సాయిని వేడుకున్నాడు. అయినా సాయి మనసు మారలేదు. బొంబాయికి తిరిగెళ్లడానికి తనవద్ద శెలవు తీసుకోడానికి వచ్చిన దీక్షిత్‌తో సాయి ”తక్షణమే ఇంటికి పో! ఎలా వచ్చిన జ్వరం అలానే పోతుంది. సీమ బాదం పప్పు, పిస్తా కలిపిన పాయసం శుభ్రంగా తిని తిరుగు. పడుకోకు” అని అన్నారు. శ్యామాను తోడు గా దీక్షిత్‌తో పంపించారు సాయి. బొంబాయి చేరేసరికి దీక్షిత్‌ వళ్ళు తీవ్రమైన జ్వరం తో కాలిపోతోంది. కుటుంబ సభ్యులందరూ ఆందోళన పడ్దారు. డాక్టర్లు మందులు ఇవ్వజూసారు కాని వాటిని దీక్షి త్‌ సున్నితంగా తిరస్కరించా డు. ఈ భౌతిక ప్రపంచంలోని డాక్టర్ల కంటే ఈ సృష్టి, స్థితి లయకారుడైన సాయిపైనే దీక్షి త్‌కు గురి. ఏ మందులు వేసు కోకుండా, సాయి చెప్పిన అప థ్యమైన ఆహారం తింటూ దీక్షి త్‌ హాయిగా వున్నాడు. జ్వరం దానంతట అదేపో యింది. శారీ రక రోగమే కాక అజ్ఞానమమే మానసిక రోగం కూడా తొలగాలి అందుకే బాధలను ఓర్చు కోవాలని (సబూరి) ఈ లీల ద్వారా మనకు తెలియ జేసారు. ఎటువంటి వ్యాధులు సంభవించినా సాయి సన్నిధిని శరణు వేడితే ఆ సద్గురువు అనుగ్ర#హం వలన వాటంతట అవే మటుమాయమౌతాయి.
మరొక సందర్భంలో సాయి భక్తుడైన రఘువీర పురందరే శిరిడీ యాత్రకు బయలుదేరినప్పుడు అ తని కుమారుడికి తీవ్రంగా జ్వరం వచ్చింది. అందు కనే అతని భార్య ప్రయాణం మానుకుంది. పురంద రే తల్లి ఆమెకు తోడుగా వుండిపోతానని అంది కాని ఆ అవసరం లేదని పురందరే ఆవిడను తనతో శిరిడీకి తీసుకువెళ్లాడు. అదే రోజు రాత్రి పురందరే భార్యకు శ్రీ సాయి కలలో కనిపించి, ఆమె కుమారుడి నుదిట ఊదీ పెట్టి ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. కల చెదిరి చూసేసరికి ఎవ్వరూ కనిపించలేదు. ఆ క్షణం నుండే ఆ బిడ్డకు జ్వరం తగ్గిపోయింది. ఏ మందుల అవసరం లేకుండానే క్షణాలలో తన బిడ్డ అనారోగ్యా న్ని తగ్గించిన శ్రీ సాయిబాబా భక్తవత్సలతకు, అపూ ర్వమైన యోగశక్తికి ఆ తల్లి మనస్సులోనే శత కోటి వందనాలు
అర్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement