Tuesday, November 26, 2024

మహావైైభవంగా జాతర

పాపన్నపేట, ప్రభన్యూస్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఏడుపాయల వనదుర్గాదేవి జాతర సోమవారం వేకువజామున్నె ప్రారంభ మెంది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ హేమలత, జిల్లా కలెక్టర్‌ హరీష్‌రావు, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ట్రైనీ కలెక్టర్‌ అశ్విని వాఖాడే, ఇప్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి హాజరు కాగా మంత్రి హరీష్‌రావు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాతర ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటీ రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతియేటా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రతి యేటా జాతరకు హాజరయ్యే భక్తుల అవసరాలు తీర్చడానికి నిధులు మంజూరు చేస్తూ జాతరకు విచ్చేసే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి నీటి కొతర ఏర్పడకుండా సింగూరు ప్రాజెక్టు నుండి 0.045 టీఎంసీ నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. తెరాస ప్రభుత్వం ఆధ్వర్యంలో పోతంశెట్టిపల్లి నుండి ఏడుపాయల వరకు రెండున్నర కిలో మీటర్ల మేర వంద ఫీట్ల సీసీ రోడ్డును, డివైడర్ను ఏర్పాటు చేయడం కోసం రూ.54 లక్షల నిధులతో రహదారులు బాగు చేసుకున్నామన్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సింగూర్‌ ప్రాజెక్టుకు కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు అందనున్నాయని, దీంతో జిల్లా సుభిక్షంగా మారిపోతుందని మంత్రి పేర్కొన్నారు. గోదావరి, కాళేశ్వరం జలా ల ద్వారా ఒక్క సంవ త్సరంలోనే కోటి ఎకరాల వరి సాగు చేయడం అంటే ప్రభుత్వం యొక్క కృషికి తోడు శివుడి దయ ఉందని ఆయన పేర్కొ న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్సవాలు అంతం తమా త్రంగానే జరిగేవని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాలకు అత్యంత ప్రాముక్యత ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉత్సాహంగా ఘనంగా జరుపుతున్నారని, ఏడుపాయలను మరింత అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్‌ పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దడానికి రూ.1500 కోట్ల నిధులలో నుండి రూ.100 కోట్ల నిధులను ఏడుపాయలకు కేటాయించనున్నట్లు ప్రకటించినట్లు తెలిపారు. దీంతో ఏడుపాయలలో గిరి ప్రదక్షణ, కాటేజీలు, ఫౌంటైన్‌లను ఏర్పాటు చేసుకొని ఆలయ అభివృద్ధిపరుచుకోనున్నట్లు వెల్లడించారు. పోతంశెట్టిపల్లి వైపు నుండి నూతనంగా బ్రిడ్జిలను ఏర్పాటు చేసుకొని సీసీ రహదారులను ఏర్పాటు చేసుకు న్నామని గుర్తు చేశారు. అంతే కాకుండా భక్తుల సౌకర్యార్థం 50 లక్షల రూపాయలతో మహిళల కోసం స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఏడుపాయలలో నేరాలను నియంత్రించడం కోసం ఇప్పటికే పోలీస్‌ ఔట్‌పోస్టును ఏర్పాటు చేసుకొని నేరాలు అరికట్టు కున్నామని, అలాగే రూర్బన్‌ నిధులతో ఏడుపాయల్లో కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకొని నిర్మించుకొంటున్నామని వివరించారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్‌ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పాటికే ఏడుపాయల షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులకు భూమి పూజా నిర్వహించుకొని నిర్మాణం సైతం జరుగుతుందని మంత్రి తెలిపారు.

వనదుర్గమాతను దర్శించుకున్న
మంత్రి తలసాని శ్రీనివాస్‌ దంపతులు

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మంగళవారం దుర్గాభవాని మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం యాదాద్రితో పాటు, భద్రాచలం, వేములవాడ, కొమురవెళ్లి, ఏడుపాయల ఆల యాలను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. అన్ని ఆలయాల వద్ద భక్తులకు అవసరమైన అన్ని వసతులు సమకూరు తున్న యన్నారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఏడుపా యలను ఎంతో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా కలెక్టర్‌ హరీష్‌, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ హేమలత శేఖర్‌గౌడ్‌, ఆలయ ఈఓ శ్రీనివాస్‌, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement