Saturday, November 23, 2024

స్వర్ణశోభితమయంగా శ్రీవరాహ స్వామివారి ఆలయ గోపురం

తిరుమల ప్రభన్యూస్‌ : తిరు మల శ్రీవారి ఆలయ గోపురం తరహా లోనే వరాహస్వామివారి గోపురం కూడా స్వ ర్ణ శోభితం అయింది. రూ.14 కోట్ల వ్యయంతో వరాహస్వామి ఆలయ గోపురానికి టిటిడి స్వర్ణ మయం చేసింది. బంగారు తాపడం పనులు పూర్తి కావ డంతో 21 సుదీర్గ విరామం అనంతరం టిటిడి భ క్తులను వరాహస్వామివారి దర్శనానికి అనుమ తిస్తోం ది. తిరుమలలో స్వామి పుష్కరిణికి వా యువ్య మూలలో తూర్పుముఖంగా వున్నటు వంటి దేవాలయం శ్రీవరాహస్వామి ఆలయం. శ్రీమహావిష్ణు ఆదివరాహమూర్తిగా అవత రించి భూదేవిని రక్షించి ఇక్కడే నిలవడంతో ఈ క్షేత్రం ఆది వరాహ క్షేత్రంగా పేరుగాంచింది. టిటిడి గతేడాది డిసెంబర్‌ 6 న ప్రారం భించిన 43 కేజిల బంగారం, 18 కిలోల రాగిని వినియోగించి దాదాపు ఏడా ది సమయంలో స్వర్ణ యం పనులను పూర్తి చేసింది. వరాహస్వామి ఆలయ గోపు రం స్వర్ణమయం పనులు పూర్తి కావడంతో మరోసారి టిటిడి అష్టబంధన బాలాలయ మహాసంప్రో క్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వ హించింది. దీంతో శ్రీవారి ఆలయ గోపురం వల్లే ప్రస్తుతం వరాహస్వామి ఆలయ గోపురం దగదగ బంగారు కాంతులతో మెరిసిపోతూ భక్తులకు దర్శనమిస్తా వుంది. స్వర్ణ శోభితమైన గోపురాన్ని దర్శించుకుని భక్తులు పునీతులవుతున్నారు. కరోనా నేప ధ్యంలో గతేడాది మార్చి 20 వ తేది నుంచి టిటిడి వరాహస్వామి దర్శనా నికి భక్తులను అనుమతించడం లేదు. భక్తులను అనుమతించినప్పటికీ స్వా మివారికి నిర్వహించే కైంకర్యాలను యదావిధిగా నిర్వహి చింది. దాదాపు 21 నెలల పాటు స్వామివారి దర్శనానికి భక్తు లను అనుమతించని టిటిడి. వరాహస్వామి గోపుర స్వర్ణమ యం పనులు పూర్తి కావడంతో ఆదివారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement