Tuesday, November 26, 2024

ఒకటి అడిగితే నాలుగు ప్రసాదించే స్వామి ఔదార్యం!

శ్రీమహావిష్ణువు తన భక్తుడు ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహుడుగా ప్రత్యక్షమయ్యాడు. తండ్రీ కొడుకులు హిరణ్యకశిపుడు- ప్రహ్లాదుడి మధ్య జరిగిన భీకర వాగ్యుద్ధంలో హిరణ్యకశిపుడు రౌద్రంగా ”నీ దైవం ఈ స్తంభంలో వున్నాడా? చూపించు” అని ప్రహ్లాదుడితో అంటాడు. ఆ సమయంలో ప్రహ్లాదుడు ఆ నారాయణుని ”అంతటా నీవే నిండివున్నా వని ఒకసారి నిరూపించవయ్యా” అని ప్రార్థిస్తాడు. తన భక్తుని ప్రార్థనలో ని ఆర్తికి కరిగిపోయిన శ్రీమహావిష్ణువు అతని ఆర్తికి తగ్గట్లుగా స్తంభమున కనపడ్డాడు.”బ్రహ్మ వరాలతో నాకు చావే లేదు” అని గర్విస్తున్న హరణ్య కశిపునికి నా సంకల్పానికి ”బ్రహ్మ వరం అడ్డే కాదు. బ్రహ్మ వరానికి భం గం రాకుండానే నిన్ను సంహరిస్తానురా. మీరంతా జీవులు అల్పజ్ఞాన ము కలవారు. నేను సర్వజ్ఞుడను” అని లోకానికి చాటాడు.
#హరణ్యకశ్యపునికి బ్రహ్మ ఇచ్చిన వర ము ”బ్రహ్మ సృష్టించి న వాటితో చావురాదు” అని. అంటే ”బ్రహ్మను సృష్టించిన వా నితో చావు రావచ్చు కదా” అని హరణ్యకశ్యపుని అల్పజ్ఞతను, జీవుల ఆలోచనాసరళిని లోకానికి చెప్పా డు. కనపడవయ్యా అంటే కనపడ్డాడు. మూడు లోకాలను బాధిస్తున్న హరణ్యక శ్యపుని వధించాడు. ప్రహ్లాదునికి వరాలు ఇచ్చాడు. ”ఇటువంటి వరాలు దుష్టులకీ యరాదు” అని బ్రహ్మకు గుణపాఠం చెప్పా డు. ఋషులకు పరమాత్మ తత్త్వా న్ని బోధించాడు. ఇలా ఒకటి అడి గితే నాలుగిచ్చే ఔదార్యం సర్వాం తర్యామి అయిన ఆ స్వామిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement