Friday, November 22, 2024

సత్పురుషుల సాంగత్య ఫలం!

నీతి శతకకర్త అయిన భర్తృహరి తన శతకంలో కలి యుగంలో మానవుల నడవడి గురించి వివరిస్తూ, సత్పు రుషుల లక్షణాలను మనోజ్ఞంగా ఒక పద్యం ద్వారా లోకా నికి సందేశం అందించాడు.
శ్లో|| ఆశాసంహరణంబు- నోర్మియు- మదత్యాగంబు-
దుర్దోష- వాం
ఛా శూన్యత్వము- సత్యమున్‌- బుధమతాచారంబు- సత్సేవయున్‌
వైశద్యంబును- శత్రులాలనము- మాన్య ప్రీతియుం- బ్రశ్రయ
శ్రీ శాలిత్వము- దీనులందు గృపయున్‌- శిష్టాలికిన్‌- ధర్మముల్‌||
అంటూ సత్పురుషుల లక్షణాల ను వివరించారు.
అత్యాశను వదలడం- ఓర్పు- నే ర్పు కల్గియుండడం- గర్వమును వీడ డం- పాపపు పనులపై కోర్కెలు లేకుం డుట- సత్యమునే పల్కుట- పండితు లు- విద్వాంసులు నడచిన బాటనే నడ వడం- సజ్జనులను సేవించడం- ఐశ్వ ర్యము అనగా సంపద కల్గియుండ డం- శత్రువులనైనను చక్కగా చూడ డం- విరోధ భావన లేకుండడం- పూజ్యులను గౌరవించడం- పెద్దల యెడ అణుకువ కల్గియుండడం- దు:ఖితుల పట్ల దయ చూపడం ఇవన్నీ కూడ సత్పురుషులలో వుండే గొప్ప లక్షణాలు అన్నాడు కవి. యదార్థములే గదా యివన్నియును.
మానవులలోని దుర్గుణాలలో ఆశ ఒకటి. తనకు లభిం చని పరుల ధనాదులకై అభిలాష కల్గియుండడం ఆశ.
”అలభ్యేషు పరధశేషు లాభాభిలాష తృష్ణా:” అని పరి మితమైన ఆశ ప్రమాదమే కాదు. అత్యాశ అదే పేరాశ పెద్ద ప్రమాదకారి. అత్యాశకులోనైతే దు:ఖాలకు లోనై, తీరకపోతే క్రుంగిపోతాడు, కృశిస్తాడు. కా వున అత్యాశ లేకుండుట ఒక మంచిగుణం.
లోకంలో కోపం మానవులలో దాగి వుంటుంది. తనకు అవమానాలు కల్గిన పుడు యుక్తాయుక్త విచక్షణ నశించి కోపాన్ని తెచ్చు కుంటాడు. కోపాన్ని అణచుకొని ఓరిమి వహించాలి. మానవులు గర్వం వలన వివేకం కోల్పోతారు. అవసరం లేని విషయాలలో తలదూర్చి అనర్ధాలు తెచ్చుకుంటారు. గర్వం పలు రకాలు. విద్య, ధన, పదవీ, రూప గర్వాలు ము న్నగునవి. వీటిని వదలడం ఎంతో శ్రేయస్కరం. కావున ఎవరి కినీ గర్వం పనికిరాదు.
సత్కార్యాలలో కోరిక ఉండడం యుక్తం. చెడు పనులలో కోరిక ఉండరాదు. అది అనర్థదాయకం. సత్పురుషులు దుర్విష యాలపై కోరికలు లేకుండా మెలుగు తూ వుంటారు. సత్యం అనేది వేదవా క్యం- సూక్తి. సత్యాన్నే పలకాలి.
”నానృతాత పాతకం పరమ్‌” అనేది అసత్యం కన్నా మరో పాపం లే దని భావం. కావున సత్యమును మా త్రమే పలకడం ధర్మం.
ధర్మశాస్త్రాలు తెలిపినట్లుగా సజ్జనులు నడిచే మార్గంలోనే నడవ డం యుక్తం. మన యిష్టం వచ్చిన రీ తిలో నడిస్తే లోకనిందకు పాత్రులమవుతాం కాన సజ్జనుల మా ర్గాన్నే అనుసరించాలి. ఇది సత్పురుషుల లక్షణం.
మానవుని బుద్ధి వికసించాలంటే పండిత సేవ అవసరం. పండితులను సేవిస్తే జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఐశ్వర్యమంటే అణిమాద్యష్ట సిద్ధులు, సంపద, పాలకత్వం అని పలు అర్థా లున్నాయి. ఇవన్నీ సత్పురుషుల లక్షణాలే. వీరి నడవడి, వ్యక్తిత్వం, ప్రవర్తన అందరికీ ఆదర్శవంతం, మార్గదర్శ కం, మూర్తి మంతం. గౌరవం, అణుకువ, కృప, దయ, జాలి కల్గియుంటారు. పలుకులు సత్యవంతం. జీవి తాలు ధన్యత చెందవలెనన్న సమాజం సత్పురు షుల లక్షణాలను అలవరచుకొని ధన్యత చెందాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement