”త్య్రయంబకం యజామహి సుగంధం పుష్టి వర్ధనం
ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతామ్!”
ఋగ్వేదంలోని మహామృత్యుంజయ మంత్రము ఇది. దీనినే త్రయంబక మంత్రము, రుద్రమంత్రము, మృత సంజీవని మంత్రము అని అంటారు. ఈ మంత్రాన్ని జపిస్తూ… ”శివం శంకరం శంభుమీశానమీడే…” అంటూ లయకారుడుని ఎల్లెడలా పూజించే మహాశివరాత్రి పర్వదినం నేడు. ఈ రోజే విశ్వంలో మొట్టమొదట వివాహం అయినది పార్వతీ పరమేశ్వరులకే. వారికంటే ముందు వివాహం అయినవాళ్లు పురాణాల్లో ఎక్కడా కనిపించరు. అందుకే పార్వతీపరమేశ్వరులను ఆది దంపతులుగా ఈ జగత్తు కీర్తిస్తుంది. జగత్తు కల్యాణానికి నాంది అయిన శివపార్వతులను పూజించే పండుగ రోజు శివరాత్రి. ఈ విశ్వమంతా ‘శంభో… శివ శంభో…’ అంటూ వ్రతాలు, అభిషేకాలు, ఉపవాసం, జాగారం చేస్తూ శివధ్యానం… శివనామస్మరణలతో తన్మయులయ్యే రోజు శివరాత్రి.
మనం ఈ రోజు మహాశివరాత్రి మహోత్సవం వైభవంగా నిర్వహించుకొంటు న్నాము. ప్రతీ నెలా మాసశివరాత్రి వస్తుంటుంది. మాఘమాసంలో వచ్చే మా సశివరాత్రినే ”మహాశివరాత్రి”గా పురాణాలు విశిదపరుస్తున్నాయి. అన్ని శైవ క్షేత్రాల్లో భక్తులు హరహర మహాదేవా, శంభో శంకరా నినాదాలతో హోరెత్తుతూ, ఆ పర మేశ్వరుడుకు అభిషేకాలు, రుద్ర, నమక, చమకం పారాయణల వేదఘోష తో , సాక్షాత్తు కైలాసమే భువికి దిగి వచ్చిందాన్నట్లుగా ఉంటాయి. ”శివ” అంటే మంగళ ప్రదం. శుభప్రదం. మహాశివరాత్రి పర్వదినంలో మనకు గోచరించే ముఖ్య అంశాలు. లింగోద్భవ కాలాన్ని మహాశివరాత్రిగా గుర్తించడం, ఆది దంపతులు శివ పార్వతుల కళ్యాణం లోక క్షేమం, శివరాత్రి మహాత్మ్యం.
మహా శివరాత్రి విశిష్టత
లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రి. సృష్టి ప్రారం భించిన రోజుల్లో బ్రహ్మ వైకుంఠంలో మహావిష్ణువు వద్దకు వచ్చాడు. ఆ సమయంలో విష్ణువు శేషపాన్పుపై శయనించి ఉండగా, తన పరివారమంతా ఉపచర్యలు చేస్తున్నారు. ఆ సమయంలో శివమాయ బ్రహ్మను ఆశ్రయించింది. ”బ్రహ్మను, సృష్టికర్తను వస్తే లెక్కచేయకుండా మర్యాద చేయకుండా నిద్రపోతు న్నా రు. ఈ సమస్త జగత్తుకు నేనే గురువును. నేనే తండ్రిని. లే! లే!” అంటూ కొంచెం అతిశయంతోనే బ్రహ్మ మాట్లాడేసరికి, విష్ణువు మేల్కొ ని చిరునవ్వుతో ”బ్రహ్మ దేవా! నీకు స్వస్థత కలు గుగాక. నీవా గొప్ప వాడివి? నీవు జగత్తుకు గురువా?” అంటూ శ్రీహరి కూడా శివ మాయలో పడి ఆత్మస్తుతి మొదలు పెట్టారు.
బ్రహ్మ నేను గొప్ప అంటే, విష్ణువు నేను గొప్ప అంటూ వాదోపవాదాలు మొదలై, ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ సందర్భంలో ఒక మంచి తేజస్సుతో, ఆద్యంతాలు తెలియని జ్వాలా స్థంభరూపం ఏర్పడింది. బ్రహ్మ, విష్ణువు ఆ అగ్ని గోళంలా ఉన్న జ్వా లాస్థంభాన్ని చూసి ఆశ్చర్యపోతుండగా, వారున్న ప్రదేశంలో శివుడు ప్రత్యక్షమై, వా రిద్దరిని వారించి, ఈ జ్వాలాస్థంభ రూపంలో ఉన్న లింగానికి ఉన్న ఆది స్థానం (మూ లం) కనుగొనమని విష్ణుమూర్తికి, చివరి పై భాగం (ఊర్థ్వభాగం)ను కనుగొనమని బ్రహ్మకు చెప్పాడు. ఎవరు ముందుగా వస్తారో వారే గొప్ప అని చెప్పి పంపించాడు.
విష్ణువు శ్వేత వరాహ రూపంలో భూమిని దొల్చుకొంటూ, పాతాళానికి వెళ్ళిచూ సినా, ఆ అగ్ని లింగం ఆది కనపడలేదు. బ్రహ్మ హంస రూపంలో బయలుదేరి, ఆ లింగం అంత్య భాగం కనుక్కోలేక వెనుదిరిగి వస్తుంటే, ఒక మొగలిపువ్వు పై నుం డి క్రిందకు పడుతోంది. విష్ణువు కంటే తానే గొప్ప కావాలనే దురుద్దేశంతో, ఆ మొగ లి పువ్వును ఆపి ఎక్కడినుంచి వస్తున్నావని అడిగితే, నేను శివుని శిఖనుండే వస్తు న్నానని అసత్యం చెప్పగా, బ్రహ్మ ”నేను ఈ అగ్ని లింగం ఊర్ధ్వ భాగం చూసానని సాక్ష్యం నిమిత్తం తీసుకుని వచ్చాడు. శివుడు ఇద్దరి మాట లు విని శివుడు విష్ణువుతో ”నువ్వు కూడా బ్రహ్మలా ఒక దొంగ సాక్ష్యా న్ని తెస్తే నువ్వే గొప్ప. నువ్వు అలా చేయక సత్యమే చెప్పావు. బ్రహ్మ అసత్యపు సాక్ష్యా లతో గొప్ప కావాలనే దురుద్దేశంతో చెప్పినందుకు భూలోకంలో పూజ కు అనర్హుడు” అని చెప్పాడు. తన భైరవులలో ఒకరితో బ్రహ్మకు ఉన్న ముఖాల్లో ఒక తల తీయించేసాడు. మొగ లి అసత్యపు సాక్ష్యం కారణం గా దేవతా పూజలకు అనర్హం అని చెప్పాడు.
అంతట మళ్లిd శివుడు మాట్లాడు తూ ”ఈ అగ్ని లింగం తేజోవంతమై నదిగా ఇక్కడే నిక్షిప్తమై ప్రజలచేత జ్యోతిర్లింగంగా ఆరాధింపబడు తుంది. ఈ ప్రదేశమే ”అరుణాచలం” అయి ఈ లింగం అరుణాచలేశ్వరు డుగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజు మహాశివరాత్రి అనబడుతుంది” అని చెప్పి అంతర్థానమయ్యారు. ఆరోజునుండి మాఘమాసంలో వచ్చే మాసశివరాత్రి మహాశివరాత్రి అయ్యింది.
శివపార్వతుల కళ్యాణం
దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన తర్వాత, హిహమవంతుని ఇంట పార్వతిగా జన్మించి, శివుడే భర్త కావాలనే సంకల్పంతో, ఘోరమైన తపస్సు చేసింది. సప్త ఋషులు, నారద మహర్షి హిమవంతుని వద్దకు వెళ్ళి ”పార్వతికి శివునిపై ప్రేమ ఉన్నందున వివాహం చేయండి” అని కోరగా, వివాహానికి ఏర్పాటు చేశారు.
ఈ వివాహం మహాశివరాత్రి అర్థరాత్రి అభిజిత్ లగ్నంలో జరిగింది. పెండ్లి కొడు కుగా శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాద మస్తకం విభూతి రాసుకొని, మెడలో పుర్రె ల దండలతో నాగాభరుణుగా, ఆయన గణాలతో తరలి రాగా, పార్వతీదేవి తల్లి, హమ వంతుని భార్య మీనాదేవి శివుడిని చూసి స్పృహ కోల్పోయింది. వెంటనే పార్వతీదేవి కోరిక మేరకు శివుడు అందమైన రూపంలో దర్శనమిస్తాడు. ఆ జగత్కళ్యాణమునకు అత్రి, అగస్త్యుడు, భరద్వాజ, మార్కండేయ మహర్షులు ఎందరో వచ్చారు. బ్రహ్మ చెప్పిన రీతిలో గర్గాచార్యులు అనే మహర్షి ఆధ్వర్యంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం జరిగింది. దేవతలంతా ముక్త కంఠంతో-
”నమోరుద్రాయ దేవాయ మధునాంతకదాయచ,
స్తుత్యాయ భూరి భాసాయ త్రినేత్రాయ నమోనమ:!” అంటూ కీర్తించారు.
లోక రక్షణలో శివకుటుంబం
శివ కుటుంబం లోక సంక్షేమానికే అవతరించింది. ఎలాగంటే తారకాసురుని సంహారం, దేవసేనాపతిగా, మరెన్నో ఘనకార్యాలకు కారకుడైన కుమారస్వామి జన నం, కార్యాలు దిగ్విజయంగా పూర్తవుటకు గణనాథుడుగా గణపతి జననం ముఖ్య మైనవి. అలాగే నూతన వధువు చేత ముత్తైదువుగా కలకాలం ఉండాలనే సంకల్పంతో గౌరీపూజకు, దుర్గగా, మరెన్నో అవతారాలు ధరించి శుంభని- శుంభులను, మధు కైట భులను, మహిషాసురుని వంటి రాక్షసులు సంహారం చేయడానికి, జీవులు మరణిం చిన తదుపరి, స్మశానం చేరినప్పుడు ”నీకు నేనున్నాను” అని ధైర్యం చెప్పేవాడే పరమాత్ముడు. ఇలా ఆ కుటుంబం అంతా లోకసంక్షేమం కోసమే ఉద్భవించింది.
శివరాత్రి మహాత్మ్యం
దీనిని గురించి అనేక కథలు ఉన్నాయి. శివశర్మ అనే విప్రుడు పండితుడైనా, చెడు అలవాట్లకు బానిసై, ఆఖరుకు భిక్షమెత్తుకొని జీవించే స్థితిలో, ఒక మహాశివరాత్రి రోజున ఎక్కడా ఆహారం దొరకక, ఉపవాసంతో ఉన్నాడు. ఆ రాత్రి సద్ధుమణిగిన తదుపరి శివాలయంలో ఆహారం దొరుకుతుందనే ఉద్దేశంతో దొంగతనానికి వచ్చి ఆహా రం వెతుకుతున్న సమయంలో, చేయి తగిలి ధ్వనిరాగా ఆ శబ్దానికి, రక్షక భటులు కొట్టడంతో, శివశర్మ శివాలయ ప్రాంగణంలో మరణించాడు. శివభటులు వచ్చి కైలా సానికి తీసుకుని పోయి ముక్తి కలిగించారు. అలాగే వేటగాడు తనకు తెలియక పోయినా మారేడు దళాలతో పరమ శివుని పూజించడం వల్ల మోక్షాన్ని పొందాడు. ఇలా పురాణాలలో ఎన్నో గాథలు. ఇంతటి మ#హత్తరమైన శివరాత్రి రోజున శివుని దర్శించి, పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులమవుదాము.