అత్యుంత విశిష్టమైన భరత ఖండం ఆధ్యాత్మికతకు నిలయం. ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఆలయాలకు ప్రసిద్ధిగాంచినది. అంతేకా దు అత్యున్న త స్థాయి ఆధ్యాత్మిక కేంద్రం, జ్ఞాన సంపద తో పొంగిపొర్లే వాతావర ణం హమాలయాలలో శ్రీ వేద వ్యాస దేవుల వారు స్థాపించిన బదరికాశ్రమం కూడా భారతదేశంలోనే వుంది. బదరిక అంటే రేగుచెట్టు. ఆ వనంలోనే ఈ పవిత్రమైన ఆశ్రమం స్థాపించబడి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది.
వేదవ్యాసుల వారు చల్లని హమాలయ పర్వత శ్రేణు ల్లో పరవళ్లు తొక్కుతూ ప్రవహంచే నదుల తీరాలలో మంచి అనువైన ప్రదేశంలో ఈ మహత్తరమైన ఆశ్రమా న్ని స్థాపించారు. నాలుగు వేదాలను అధ్యయనం చేసిన ఆయన శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సు మంతుడు ఇంకా ఎంతోమంది జ్ఞానులు, స్థితప్రజ్ఞులు, సాధు పుంగవులు వేలాదిగా ఉండి నిరంతరం వేదపఠ నం, పారాయణం, రచనలు, మున్నగు పవిత్ర కార్యక్ర మాలు సాగించిన గొప్ప గురుకులం అది.
#హమాలయాలోని పవిత్ర గంగానది నుండి చీలిన అలకనంద నదిలో కలిసే సరస్వతీ నదికి పశ్చిమాన పవి త్ర సంగమ ప్రదేశ తీరాన ఈ పవిత్రమైన ఆశ్రమం స్థాపిం చబడినదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడే భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు తన శిష్యులతో వేద విభజన, బ్రహ్మ సూత్రాలు, అష్టాదశ పురాణాలు, మహాభారతం, శ్రీ మద్భగవద్గీత, శ్రీమద్భాగవతం మొదలైన మానవాళికి ఉపయుక్తమైన ఆధ్యాత్మి క ప్రామాణిక మైన గ్రంథాలను రచించి లోకానికి అంద జేశారు. ఈ సమీపంలోని వ్యాస గుహలో విఘ్నేశ్వరుని లేఖకుడుగా శ్రీ వ్యాసదేవుల వారు మహాభారత రచన గావించినట్లు శాస్త్రాలు చెబు తున్నాయి.
బదరికావనములో ఆశ్రమ స్థాపన గావించి, తప స్సు చేసి, బాదరాయణుడిగా కీర్తింపబడిన శ్రీ వ్యాసదేవు లవారికి మనసారా నమస్కరిద్దాం.
ఆధ్యాత్మిక జ్ఞాన క్షేత్రం… బదరికాశ్రమం
Advertisement
తాజా వార్తలు
Advertisement