తెలుగు మాసాలలో కార్తీకం ఎంతో పుణ్య మాసం అయితే ఆ తర్వా త వచ్చే మార్గశిర మాసం ఎంతో పవిత్రమైంది. కార్తీకమాసంలో శివారాధనతో ఆలయాలు మారుమోగితే, ధనుర్మాసంలో వైష్ణ వారాధనతో ఆలయాలు సూర్యోదయానికి ముందు నుండే మారు మోగుతాయి. అర్చన జరుగుతాయి. ఈ నెల రోజులపాటు వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావైలు నిర్వహస్తూ చివరి రోజు మకర సంక్రాం తి ముందు రోజైన భోగి నాడు గోదా రంగనాధుల కళ్యాణం నిర్వహ స్తారు. కార్తీకమాసంలో బిల్వపత్రాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుం దో ధనుర్మాసంలో తులసీదళాలకు అంత ప్రాముఖ్యత ఉంటుంది.
సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచిన ధనుర్మాసంలో ప్రతి ఇంటి ఆడపడుచు తమ తమ ముంగిళ్లను అందమైన రంగవ ల్లులతో అలంకరిస్తారు. గ్రామీణులైతే ఈ సమయాన్ని నెల పట్టడం అంటారు. చిన్న పిల్లలు, వివాహం కాని యువతులు గొబ్బెమ్మలను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహంచి సంప్రదాయ గీతాలు ఆలపిస్తారు.
జానపదాలకు జీవం పొసే ధనుర్మాసం…
నేటి హటెక్ ప్రపంచంలో మల్టిd చానల్స్ మాయాజాలానికి ఆ కర్షితులవుతున్న గ్రామీణ ప్రజలు సైతం పాశ్చాత్య సంప్రదాయపు మోజులోపడి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే జానపద కళారూపాలను పట్టించుకోవడం లేదు. దీంతో జానపద కళారూపాలు అంతరించిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. అయితే ఈ ధనుర్మాసం జానపద రూపాలకు జీవం పోస్తుండటంతో, ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్న కళాకారులు భారంగా కొనసాగిస్తున్న తమ జీవితాలలో కాస్తంత వెలుగులు నింపుకునేందుకు ఈ ధనుర్మా సంలో ప్రత్యక్షమవుతున్నారు. ముఖ్యంగా గంగిరెద్దుల నిర్వాహకు లు, హరిదాసులు ఈ నెల రోజులపాటు కనిపిస్తూ సాంప్రదాయాల ను పరిక్షిస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా హరిదాసులు, నడ వకుండా, కాలాను గుణంగా ఊరూరా మోటారు సైకిళ్లపై తిరుగు తూ సాంప్రదాయాన్ని మాత్రం పరిరక్షిస్తున్నారు. ఇంకా జంగమ దేవరులు, బుడబడక్కుల వాళ్ళు,పిట్టల దొరలు, సాతానులు, కూ డా ఈ ధనుర్మాసంలోనే కనబడతారు.
ప్రసాదం ప్రత్యేకతలు…
ఈ ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాల్లో పంపిణీ చేసే ప్రసాదం ప్రత్యేకమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుంది. మొదటి 15 రోజులు మిరియాలతో కూడిన పులగం, కట్టు పొంగలి నైవేద్యం పెడితే, మిగిలిన 15 రోజులు దద్దోజనం నైవేద్యంగా సమర్పి స్తారు. ఇలా నైవేద్యాలు సమర్పించడంలో ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. శీతాకాలంలో కడుపులో ఉన్న జఠరాగ్ని పెరిగి ఆకలి ఎక్కువవుతుంది. ఈ సమయంలో సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మిరియాలు కూ డిన ప్రసాదం తీసుకోవడం వల్ల గొంతులో పేరుకొని పోయిన కఫం తగ్గుతుంది. ఇలాంటి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల సత్వగు ణం అలవడుతుంది.
గోదా రంగనాధుల కళ్యాణం…
ధనుర్మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెల రోజుల పాటు గోదా దేవి మార్గశిర వ్రతం పేరుతో విష్ణువును కీర్తించిందని ప్రతీక. భక్తి మార్గంలో తిరుప్పావై స్మరిస్తూ విష్ణుమూర్తి పాదపద్మాలు అందుకోవడంతో ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి రంగనాథుల కళ్యాణం నిర్వహస్తారు.