Monday, November 25, 2024

శక్తి తరంగాల ప్రవేశ స్థలి…ఆలయం

ఆలయాలను దర్శించుకోవడం వెనుక శా స్త్రీయ ప్రయోజనాలు ఉన్నా యి. అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయ మై వేదాలు ఏం చెప్తున్నాయంటే… మనదేశంలో వేలాది దేవాలయాలు ఉన్నా యి. అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరిం చుకున్నాయి. భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరం గాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. భూమిలో పాజిటివ్‌ ఎనర్జీ పాసయ్యేచోట నిర్మించిన దేవాలయాల్లోకి అడుగు పెట్ట గానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
దేవాలయ గర్భగృహంలో ఆకర్షణా తరంగాలు కేం ద్రీకృతమైన చోట మూలవిరాట్‌ను నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహంచే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహంచిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవా టు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకి నా తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళే వారిలో పాజిటివ్‌ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది. గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయం లో, ముఖద్వారం దగ్గర పాజిటివ్‌ ఎనర్జీ కేం ద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. ఆలయాల్లో గంట లు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపి స్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చ ర్య జరిగి శక్తి విడుదలవుతుంది. అలా పాజిటివ్‌ ఎనర్జీ లన్నీ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరో గ్యం లభిస్తాయి. తీర్థప్రసాదాల్లో ఉండే ఔషధ గు ణాలన్నీ కలిసి మనలో దివ్యశక్తి ప్రవేశించి, తేజ స్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపానికి కాదు, ఎన్నో శక్తి తరంగా లు ప్రవేశించే అత్యంత పవిత్రమైన పుణ్యస్థలం ఆలయమని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement