Friday, November 22, 2024

ధర్మం – మర్మం (ఆడియోతో..)

గంగా ఆవిర్భావ వృత్తాంతంలో భాగంగా పార్వతిదేవి జననం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

దక్షుని కుమార్తె, లోకమాత అయిన సతీదేవి శివశక్తిగా, శివపత్నిగా ఉండెను. బుద్ధి, ప్రజ్ఞ, ధృతి, మేధా, లజ్జా, పుష్టీ, సరస్వతి వంటి నామాలతో వివిధ రూపాలతో
లోకములను పాలన చేసినది. తన తండ్రి దక్షుడు చేసిన శివావమానంతో కోపించి తన దేహాన్ని విడిచిపెట్టినది. సతీదేవి ఇప్పుడు మేన, హిమవంతులకు పుత్రికగా జన్మించునని ఆమె శంకరుని అర్థాంగియై ఈ లోకాలను కాపాడుతుందని తెలుపగా వారికి కొంతకాలమునకు గౌరీ దేవి జన్మించెను. చిననాటి నుండి శివధ్యానములో నిమగ్నమైన పార్వతి దేవతల సూచన మేరకు హిమపర్వతం పై శివుని గూర్చి తపస్సు ప్రారంభించినది. తపోధ్యానంలో ఉన్న శివుని దృష్టి పార్వతిపై మరల్చడానికి మన్మధుని పూలబాణాలే పరి ష్కారమని దేవతల గురువు బృహస్పతి ఉపాయం చెప్పెను. మన్మధునితో అతని మిత్రుడు వ సంతుడిని సహాయంగా పంపమని అతను ప్రకృతిని పూలతో, తుమ్మెదల ఝుంకారంతో, పక్షుల కిలకిల రావాలతో పులకింపచేస్తే తపస్సులో ఉన్న శంకరుడు ఆ చల్లగాలికి స్పందించి తపోధ్యానం నుంచి బయటకు వస్తాడని బృహస్పతి దేవతలతో పలికెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement