Friday, November 22, 2024

సూర్యుని ద్వాదశ రూపాలు

మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సూర్య దేవునికి అత్యంత ప్రియమైన మాసం మాఘమాసం. ఈ నెలలో సూర్యారాధన, నదీస్నానాలు, సూర్య నమస్కారాలు చేస్తే విశేష ఫలాలు లభిస్తాయి. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు. తెలుగు మాసాలు పన్నెండు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

1. ధాత : చైతన్యమాసంలో వచ్చే సూర్యుడి పేరు ‘ధాత’ ప్రజాపతియై భూతములను సృష్టించాడు.
2. అర్యముడు: వైశాఖ మాసంలో సూర్యుడు పేరు అర్యముడు. దేవతారూపంలో వుంటాడు.
3. మిత్రుడు : జ్యేష్ట మాసంలో సూర్యుడు మిత్రుడు. మిత్రత్వతో లోకాలకు మేలు చేస్తూ… చైతన్యాన్ని కలిగిస్తాడు.
4. వరుణుడు: ఆషాఢంలో వరుణుడు. జీవులు తాగే నీటిలో వుంటాడు. వారిని రక్షిస్తాడు.
5. ఇంద్రుడు శ్రావణ మాసంలో సూర్యుడు ‘ఇంద్రుడు’. స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సం#హరిస్తూ లోకాలను కాపాడతాడు.
6. వివస్వంతుడు

భాద్రపదంలో ‘వివస్వంతుడు’. ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాడు.
7. త్వష్ట: ఆశ్వయుజంలో సూర్యుడు ‘త్వష్ణ’. ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి.
8. విష్ణువు : కార్తీక మాసంలో సూర్యుడు ‘విష్ణువు’. శత్రువులను నాశనం చేస్తాడు.
9. అంశుమంతుడు : మార్గశిర మాసంలో ‘అంశుమంతుడు’. గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.
10. భగుడు : పుష్యమాసంలో భగుడు. ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు.
11. పూషుడు : మాఘ మాసంలో ‘పూషుడు’. ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు.
12. పర్జన్యుడు : ఫాల్గుణ మాసంలో సూర్యుడు ‘పర్జన్యుడు’. తన కిరణాలతో నీటిని ద్రవించి,
తిరిగి మేఘ రూపంలో వర్షించును.
ఇలా ఆయా మాసాలలో సూర్యుడి కిర ణాల తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబు తారు.
సూర్యుడు ఏడు గుర్రాలు

హిందూ పురాణాలు, పంచాంగం ప్రకారం మాఘ మాసంలోని శుద్ధ సప్తమినాడు వేయి కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని… ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజు రథసప్తమిగా భారతీయులంతా భావిస్తారు. సకల జీవకోటి రాశులందరికీ వెలుగును
ప్ర స ాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజేనని నమ్మకం.
సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రా లున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేద వాఙ్మయం చెబుతోంది. సూర్యుడు రథానికి వుండే ఏడు గుర్రాల పేర్లు-
1. గాయత్రి 2. త్రిష్ణుప్పు
3. అనుష్టుప్పు 4. జగతి
5. పంక్తి 6. బృహస్పతి 7. ఉష్ణిక్కు
వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోలుతాయి.
రథసప్తమి స్నానం

రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందు నదీస్నానం చేస్తే సప్త జన్మల పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగు తాయి. నదీ స్నానం వీలుకాకపోతే ఇంట్లో అయినా చన్నీటి స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్య నారాయ ణుని మనసారా ధ్యానించి తలపై రెండు జిల్లేడు ఆకులు, రెండు రేగు పండ్లు పెట్టుకొని ఈ క్రింది మంత్రం చదువుతూ స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది.
యదా జన్మకృతం పాపం
మయాజన్మసు జన్మసు
తస్య రోగంచ శోకంచ మాకరీ
హంతు సప్తమీ
ఏతజన్మకృతం పాపం
యచ్చ జనమంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ
జ్ఞాతాజ్ఞాతేచ యేపున:
సప్త విధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరిసప్తమి
ఎర్రని పూలతో పూజించాలి
‘రథసప్తమి రోజున మంత్రాలు చదువుతూ స్నానం చేసిన తర్వాత ఎర్రని రంగులో ఉండే పువ్వులతో సూర్యభగవానుడికి ప్రత్యే ప్రార్థనలు చేయాలి. సూర్యదేవుని చిత్రపటానికి ఎర్రని కుంకుమ, ఎర్ర చందనంతో పూజలు చేయాలి. అలాగే ఆవు నేతితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఆదిత్యుడిని ఇలా పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అంతేకాదు ఈ రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభించ నున్నాయి. చర్మరోగాల నుండి విముక్తి లభిస్తుంది.
పురాణాల ప్రకారం శ్రీరాముడు కూడా ఆదిత్య హృదయం మూడు సార్లు పఠించి రావణ వధకు బయలుదేరారట. సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున ఆదిత్య హృదయం పఠించి, సూర్యుడిని పూజించి, ఆవుపాలతో చేసిన పొంగలి ని ఏడు చిక్కుడు ఆకులలో వేసి నైవేద్యం పెట్టడం వల్ల విశేష ఫలితాలు చేకూరుతాయి.
(రేపు రథసప్తమి)

Advertisement

తాజా వార్తలు

Advertisement