మానవ జీవితమే ఓ మహాభారతం. అది మంచి చెడుల మధ్య జరుగు నిత్య ఘర్షణం.” అంటారు మహాశయుడు శ్రీశ్రీ. కురుక్షేత్ర సంగ్రామంలో, కర్తవ్య విముఖుడై నీరసపడిపోయిన అర్జునునికి, కృష్ణ పరమాత్మ చేసిన కర్తవ్య బోధే భగవద్గీత. మంచి చెడుల మధ్య జరిగే నిత్య ఘర్షణతో సాగే జీవన పోరా టంలో, అజ్ఞానమనే అంధకారంలో కొట్టు మిట్టా డుతున్న మానవాళికి, అర్జునుడిని ఓ నిమిత్త మాత్రుణ్ణి చేసుకుని, సమస్త మానవాళికి కృష్ణ పర మాత్మ చేసిన జ్ఞానబోధే భగవద్గీత.
అసలు జ్ఞానం అంటే ఏమిటి? అన్ని తెలుసు కున్న తర్వాత ఇక తెలుసుకోడానికి ఏమీ మిగిలి ఉండదో అదే జ్ఞానం.
నాలుగు ”గ”కారాలు, అంటే- గీత, గంగ, గాయత్రి, గోవింద నామాలు. వీటిని ఎవరు ఆశ్ర యిస్తారో, వారికి పునర్జన్మ ఉండదు. మోక్షం ప్రాప్తి స్తుంది అంటారు. అంతటి విశిష్టమైనది భగవద్గీ త. అయితే గీతను తెలుసుకుని, నేర్చుకుని ఆశ్ర యించాలి. ఎందుకు? జీవన పధం, విధం, విధా నం, గమనం, మార్గం, గమ్యం, లక్ష్యాలను నిర్దే శించి, జీవితాలకు విజయాన్ని ప్రసాదిస్తుంది.
అంతేకాకుండా మానవాళిని కార్యోన్ముఖు లను చేయాలని, దేవదేవుడు శ్రీ కృష్ణ పరమాత్మ, స్వయంగా చెప్పిన భగవత్ వాక్యాలే భగవద్గీత అవటం భగవద్గీత మరో ప్రత్యేకత. వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తుల సంగ్రహ సారమే భగ వద్గీత అవటమూ భగవద్గీతకు ఇంతటి ప్రాశస్త్యం రావటానికి మరో కారణం.
భగవద్గీత ప్రాశస్త్యం గురించి తెలుసుకుం దాం. ”తదిదం గీతా శాస్త్రం సమస్త వేదార్ధ సార సంగ్రహమ్”. వేదాంత సారములన్నిటి సంగ్రహమే భగవద్గీత అని అంటారు భగవద్గీత వ్యా ఖ్యానంలో ఆదిశంకరాచార్యులు.
భగవద్గీత హిందూ సంస్కృతీ., ఆర్ష సంప్ర దాయాల ఊట. వ్యక్తిత్వ వికాసం అందించే గొప్ప సాధనా పరికరం. జీవతత్వాన్ని, జీవన తత్వాన్ని, జీవిత తత్వాన్ని అందించే పవిత్ర గోపురం. జీవన వికాసాన్ని పెంపొందింప చేసే ఉద్గ్రంధం. భవ రోగ పీడితుల పాలిట ఔషధం. అహం, మోహం, మమకారాలను దునుమాడే అగ్ని కణం. ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని పరిపుష్టం చేసే మహా భాష్యం భగవద్గీత. బం ధాలను బంధనాలను తగ్గించే మహోధృత తరం గాల వాడి. మానవాళి జీవనాడి భగవద్గీత.
జీవన విధాన్ని, పధాన్ని, విధానాన్ని నిర్దే శించి, జీవితం మొత్తాన్నే మార్చివేసే దివ్య యం త్రం భగవద్గీత. మన తలరాతను మార్చే మహా మంత్రం. భగవద్గీత దివ్య విధానాల ధృతి. జీవన రీతిని శాసించే మహా శృతి. అర్జునుని సకల జీవుల సంకేతంగా భావించి, జీవన సందేహాలను నివృ త్తి చేసేందుకు, దేవదేవుడు శ్రీ కృష్ణుడు అర్జునునికి చెప్పిన మాట. ఉపనిషత్తుల పూబాట. బోధనల ఊట. ప్రబోధాల తేట. పారమార్థికాల సొబగులు అందించే ఆధ్యాత్మిక తోట.
భవితను బంగారం చేసే ఘనత భగవద్గీత. భవితకు పట్టం కట్టి, ఘనతను నిలబెట్టే సాధనా సంపత్తుల పూత. జీవితమనే యుద్ధాన జయాలు, అపజయాలు తప్పవని, అన్నిటినీ ఓర్పుతో, నేర్పు తో ఎదుర్కొన వలసిందే, అనే జీవిత పాఠాన్ని చెప్పే మహా సూత్రం భగవద్గీత.
ప్రజ్ఞతను నేర్పించి, దివ్యత, నవ్యత, రమ్యత సమకూర్చే ఉపదేశ సారం భగవద్గీత. దేవదేవుడు మానవాళికి యిచ్చిన అభయం. మానవ జీవితా న్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళే మహోన్నత త్రోవ. పరమాత్మ కోసం జీవాత్మ చేయవలసిన సేవ. దివ్యత్వం అంచులకు తీసుకువెళ్ళే మహివ న్విత నిర్దేశం. పారమార్థిక అలౌకిక ప్రబోధం.
పరమార్ధాన్ని, పర అర్ధాన్ని బోధించే అమర త్వం. సమగ్ర జీవిత విశేషాలు అందించే గ్రంథం. హితాన్ని పంచే, పర హితాన్ని పెంచే, మత బంధ తలేని మకరందపు ఊట. అన్నిటికీ మించి వేద మంత్రాల మోత. మహత్తుని మహత్యాన్ని అం దించే మహా మంత్రాల కలబోత. అందుకే భగవ ద్గీత గీతా మాత అయ్యింది. ఆదిశంకరులు ”భగ వద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్ధం చేసుకుని ఆచరిం చినా, కొద్దిగా గంగా జలం త్రాగినా, కృష్ణ పరమా త్మను పూజించినా మరణ సమయంలో యమ దూతలతో చర్చించు కోవలసిన అగత్యం ఉండ దని, మోక్షం ప్రాప్తిస్తుందని చెబుతారు .
– రమాప్రసాద్ ఆదిభట్ల
93480 06669