Friday, November 22, 2024

అన్నిటా ఉత్తవెూత్తం దానగుణం…

ప్రకృతిని నిశితంగా గమనిస్తే సర్వత్రా ‘ఇవ్వడమే’ కనిపిస్తుంది. గాలి ప్రాణ వాయువై జీవుల్ని బతికిస్తుంది. చెట్లు కమ్మ ని పళ్లు ఇచ్చి క్షుద్బాధ తీరుస్తాయి. నదు లు తియ్యని నీరిచ్చి దాహార్తిని ఉపశ మింపజే స్తాయి. ప్రకృతికి వనరులను ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. భగవం తుడు వరప్రదాత. భక్తుల కొంగుబంగా రంగా కొలువై ఉంటాడు. మనుషులెప్పు డూ వరగ్రహతలే! వరప్రదాతలు కావడం గొప్ప సుకృతం. అమ్మ స్తన్యం తాగడంతో మొదలయ్యే మనిషి జీవితం, చివరి క్షణాల్లో తులసి తీర్థం పోయించుకోవడంతో అంతమవు తుంది. నడిమి జీవితం చాలావరకు పుచ్చుకోవడం తోనే సాగుతుంది. కాని తనకున్నదాంట్లో ఇవ్వరు.
మన పురాణాలు ‘దానం’ ప్రాశస్త్యాన్ని వీలున్నప్పుడల్లా ఉటంకి స్తాయి. పుణ్యంతో ముడిపెట్టి మనిషిలోని దానగుణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాయి. ఇచ్చే చేయి కలిగి ఉండటం గొప్ప అదృష్టం. చాపే చెయ్యి వెనక సిగ్గుతో ముడుచుకుపోయే #హృద యం ఉంటుంది. అది గమనించగల గాలి. పాత్రత నెరిగి దానం చెయ్యమం టారు. కొంతమంది తమ అవసరాన్ని వ్యక్తపరచి అడిగి తీసుకుంటారు. మరి కొంత మంది అస్సలు మనసు బయట పెట్టరు. అలాంటి వారిని కనిపెట్టుకుని ఉండాలి. భగవంతుడు మనిషికి విచక్షణ ను ఇచ్చింది అందుకే. సృష్టిలోని ఏ జీవీ మరో జీవి మనసును చదవలేదు. అంచనా వేయలేదు. మనిషికే అది సాధ్యం.
నవ విధ భక్తిమార్గాల్లో సేవ ఒకటి. సేవ అంటే మనం చేయగలిగింది చేయడమే, ఇవ్వగలిగింది ఇవ్వడమే. విష్ణుమూర్తి, దేవతలతో సహా అందరికీ వరాలిచ్చేవాడు. సాక్షాత్తు లక్ష్మీదేవే ఆయన భార్య. అటువంటిది- బలిచక్రవర్తి ముందు ‘మూడడుగులు వేసే చోటు కావాలి’ అని చేయి చాపి అర్థించాడు. ఆ వరదుడి హస్తం తన ముందు చాచి ఉండేసరికి, వద్దని రాక్షస గురువు శుక్రాచార్యుడు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టి, ఆ పరా త్పరుడికి దానం చేయడం కంటే తన జీవితానికి వేరే పరమార్థం ఉండదని తలచి ఉబ్బితబ్బి బ్బవుతూ, ఆనందబాష్పాలతో దానం చేశాడు బలి. జన్మను చరితా ర్థం చేసుకున్నాడు.
దానం చేయడానికి తన ఇంట్లో ఏమీ లేక, ఉన్న ఒక్క ఉసిరి కాయను దానం చేసింది ఒక నిరుపేదరాలు. చలించిన శంకరా చార్యులవారు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనక ధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది. అన్నార్తులకు లేదనకుండా అన్నదానం చేసిన దొడ్డ ఇల్లాలు డొక్కా సీతమ్మ. దానం చేయడానికి మనసుండాలి, చేయి సహకరించాలి. కాలు, చేయి ఆడుతున్నప్పుడే హరి నామ స్మరణ చేస్తూ- తోచి నంత దానం చేయగలిగితే ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి అంటారు వేద ప్రియులు. ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో దానం చేసేవారు కొందరైతే, చేతికి ఎముక లేకుండా దానం చేసేవారు మరికొందరు. తమ కోసం ఏమీ మిగుల్చుకోకుండా దానం చేసిన వారు అరుదుగా ఉంటారు.
కీర్తి కోసం కాకుండా, కైవల్య ప్రాప్తి కోసం దానం చేసేవారి అడుగు, అలవోకగా మోక్ష మార్గం పై పడుతుంది.

  • కామిడి సతీష్‌ రెడ్డి
Advertisement

తాజా వార్తలు

Advertisement