రామలక్ష్మణులు వానర సేనతో సముద్ర తీరానికి చేరారన్న వార్త విన్న రావణు డు రాక్షస ప్రముఖలందరిని సమావేశపరిచాడు. యుద్ధంలో విజయం సాధించడానికి మీరందరూ మంచి సలహా ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. అహంకారి అయి న రావణుడు రాక్షసుల సలహా అడిగాడంటే దానికి కారణం హనుమ పరాక్రమం, రావణుని అంతరంగం, తాను చేసిన పని అధర్మమని తలచి బలహీనపడటం.ఈ ప్రపంచంలో మూడు రకాల వ్యక్తులుంటారు. ఏదైన ఒక పని చేసేటప్పుడు ముం దుగా వివేకవంతుడైనవాడు తన పెద్దలు, మిత్రుల సలహా తీసుకుంటాడు. మధ్యము డు అయిన ఆలోచనాపరుడు తనకుతానే ఆలోచన చేసేసుకుని స్వంత నిర్ణయంతో పని ప్రారంభిస్తాడు. వివేకవంతుడు, మధ్యముడు దేవునిమీద విశ్వాసం చూపిస్తాడు. కానీ అధముడు ఒక దిశానిర్దేశం లేక ఏదితోస్తే అది చేసేస్తాడు.ధర్మసూత్రాలకు అనుగుణంగా అధ్యయనంచేసి నిస్పక్షపాతంగా ఇచ్చే సలహా ఉత్త మమైనది. ఆవేశానికి లోనయి ధర్మసూత్రాలను పక్కనపెట్టి స్వప్రయోజనానికి ఇచ్చే సలహా మధ్యమమైనది. సలహా అడిగినవాడి క్షేమాన్ని విస్మరించి అంతిమంగా ఎదు రయ్యే విపత్కర పరిణామాలను అంచనావేయకుండా ముఖ స్తుతి కోసం ఇచ్చే సలహా అధమమైనది. అని సలహాల ఔచిత్యాన్ని విశ్లేషించాడు రావణుడు.రావణునికి సలహా లివ్వడం ప్రారంభించారు రాక్షస వీరులు. కుబేరుణ్ని జయించిన వీరుడవు. మీకు భయపడి అనేకమంది ఎందరో సుందరాంగులను మీ అంత:పురానికి అర్పించారు. మీరు హాయిగా మందిరంలో విశ్రాంతి తీసుకోండి. రాముడు సముద్రా న్ని దాటకముందే ఇంద్రజిత్తు వారందరినీ సర్వనాశనం చేసేస్తాడు. ఈవిధంగా ఒక్కొ క్క సలహాని ఇచ్చారు. రావణుని సర్వ సేనాని ప్రహస్తుడు, దేవ దానవ, గంధర్వ, భూత, పిశాచాలను నాశనం చేసాము. మానవులు, వానరులు మనకు ఒక లెక్క కాదని సలహా ఇచ్చాడు. ”యధా రాజా తథా ప్రజా” అన్నట్లు సభలోని మంత్రులు, రాక్షసవీరులూ అథమాధములై రావణుని ముఖ స్తుతి చేసి చెడు సలహాలను గుప్పిం చారని విభీషణుడు కలత చెందాడు. తన తప్పు వప్పుకోక ధర్మాలు, సలహాలంటూ సమస్త రాక్షస జాతిని ఫణంగా పెట్టిన రావణునికి సలహా ఇవ్వాలనుకున్నాడు.”పరమ ధార్మికుడైన రాముడు ప్రతీకారంకోసం ఎదురుచూస్తున్నాడు. అసలు దీనికం తటికి కారణం సీతను అపహరించడమే కదా! ఇప్పటికైనా మించిపోయింది లేదు. అశోకవనం నుండి నేరుగా సీతను తీసుకువెళ్ళి శ్రీరామునికి అప్పగించు. లంకతో సహా రాక్షస జాతి వినాశనానికి కారణం కావద్దు” అంటూ పరమోత్తమైన సలహా ఇచ్చాడు విభీషణుడు. ‘వినాశ కాలే విపరీత బుద్ది’ నాశనమయ్యే సమయం ఆసన్నమయిన ప్పుడు మనసున విపరీతమైన బుద్దులు పుడతాయి. చివరకు అహంకారం, అధర్మం వల్ల తన జాతితో సహా మట్టిలో కలిసిపోయాడు రావణుడు. విజ్ఞుడై న విభీషణుడు విపత్కర పరిణామాలను అంచనావేసి అధర్మాన్ని వదిలి ధర్మాన్ని ఆశ్ర యించాడు. చరిత్రలో నిలిచిపోయాడు.
– వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
8074666269