Tuesday, November 26, 2024

తడిసి ముద్దయిన యాదాద్రి

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్‌: బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి కొండతో పాటు పట్టణం తడిసి ముద్దయింది. సుమారు రెండు గంటల పాటు వర్షం కురవడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం క్యూకాంప్లెక్స్‌, ప్రమాద విక్రయశాలలోకి వరద నీరు చేరింది. ఆలయ ఉత్తర భాగాన స్వర్ణ వర్ణంతో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్‌ విరిగి కింద పడింది. వేసవి తాపం దృష్ట్యా భక్తుల కోసం బస్‌బే నుంచి శివాలయం వరకు ఏర్పాటు చేసిన చలువ పందిల్లు సైతం కూలి పోయాయి. రెండవ ఘాట్‌ రోడ్డుకు అనుబంధంగా ఉత్తర భాగంలో నూతనంగా వేసిన ఘాట్‌ తారు రోడ్డు కుంగిపోయింది. యాదగిరిపల్లి సమీపంలో రింగ్‌ రోడ్డుపై వరద నీరు నిలిచి పోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. కొండ దిగువన వాహన పూజల స్థలిలో ఓ వృక్షం నేలకూలింది. మొదటి ఘాట్‌ సమీపంలో రోడ్డు బురదమయం కావడంతో రెండు ఆర్టీసీ బస్సులు కూరుకుపోయాయి. ఒక్క భారీ వర్షంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అధికా రులు, కాంట్రాక్టర్ల పనితీరు, నాణ్యత ప్రమాణాల డొల్లతనం బయటపడిందని కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ నాయకులు విమర్శల వర్షం కురిపించారు.
దేవాదాయశాఖ కమిషనర్‌ పరిశీలన
అకాల వర్షం కారణంగా అతలాకుతలమైన యాదాద్రి దేవస్థానాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ కమిష నర్‌ అనిల్‌కుమార్‌, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు పరిశీలించారు. ప్రధానాలయంతో పాటు క్యూకా ంప్లెక్స్‌, ప్రసాద విక్రయశాల, కూలిన చలువ పందిళ్ల ను వారు పరిశీలించారు. భారీ వర్షానికి స్వల్ప ఇబ్బం దులు తలెత్తాయని, నిర్మాణంలో నాణ్యత, పర్యవేక్షణ లోపించిందన్న ఆరోపణలు పూర్తిఅవాస్తవం అని వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు ఖండిం చారు. దేవస్థానం ఇంచార్జీ ఈవో రామకృష్ణారెడ్డి, వైెటీడీఏ ఎస్‌ఈ వసంత్‌నాయక్‌, ఈఈ వెంకటేశ్వర్లు, ఆలయ డీఈలు, విద్యుత్‌ ఈఈ తదితరులు వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement