అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ఆలయాల ఆభరణాల డిజిటిలైజేషన్‌పై దేవాదాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రతి ఆలయంలో డిజిటిల్ ఆల్బమ్‌లను రూపొందించుకోవాలని దేవాదాయశాఖ ఉన్నతాధి కారులు ఆలయ కార్యనిర్వహణా ధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ఆభరణాల్లో పొరబాట్లకు తావులేకుండా భద్రత కల్పించేందుకు డిజిటలై జేషన్ చేయాలని ఉన్నతా ధికారుల ఆదేశాల నేపధ్యంలో ఆయా ఆలయాల కార్యనిర్వహణా ధికారులు చర్యలు చేపట్టారు. ఆభరణం పేరు, బరువు, దేవాదా యశాఖ కేటాయించిన నంబర్ కనిపించేలా అన్ని కోణాల్లో తీసిన ఫొటోలను డిజిటల్ లైబ్రరీలో పొందుప రచాల్సిఉంటుంది. రాష్ట్రంలోని ఆలయాలకు పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. పేరు మోసిన ఆలయాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయా లకు భక్తులు బంగారం, వెండి ఆభరణాల రూపంలో మొక్కులు చెల్లించుకుం టారు. వీటిని ఆలయ మాన్యువల్ రిజిస్టర్‌లో అధికారులు నమోదు చేస్తుంటారు. అందుకు సంబంధించిన రికార్డులు ఆలయాలతో పాటు జిల్లా దేవాదాయశాఖ అధికారుల వద్ద ఉంటాయి. అనేక ఆలయాల్లో భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన ఆభరణాలు మాయమవు తున్నట్లు పలు విమర్శలు ఉన్నాయి. రికార్డుల ట్యాంపరింగ్‌తో కొందరు అధికారులు బంగారం, వెండి నగలను స్వాహా చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
కొన్ని హిందూ సంస్థలు ఆలయాల్లో నగల మాయంపై అనేక సందర్భాల్లో ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే తగిన వివరాలు లభ్యం కాని స్థితిలో ఉన్నతాధికా రులు సైతం నామమాత్రపు చర్యలకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే మూడు నెలల కిందట దేవాదాయశాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అనుసరిస్తున్న విధానంపై అధ్యయానికి ప్రత్యేక కమిటీని పంపారు. వీరు టీటీడీ విధానాలను అధ్యయనం చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికఆధారంగారాష్ట్రంలోని కార్యనిర్వహణాధికా రులకు గత నెలలో రెండు రోజుల పాటు ప్రధాన కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహిం చారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీలోగా ఆలయా ల్లోని నగలను డిజిటలైజేషన్ చేయాలంటూ ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
ఐదు రకాల రిజిస్టర్లు
ఆలయాల్లోని ఆభరణాలకు సంబం ధించి ఈవోలకు ఉన్నతాధికారులు మార్గ నిర్ధేశం చేశారు. వీటికి సంబంధించి ఐదు రకాల రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశిం చారు. అభరణాల అంచనా రిజిస్టర్, ఆభర ణాల వారీగా నంబరు, వాటి బరువుకు సం బంధించిన రిజిస్టర్, అర్చక కస్టడీ రిజిస్టర్, ఈవో కస్టడి రిజిస్టర్, బ్యాంకు లాకర్‌కు సంబంధించిన రిజిస్టర్‌లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆభరణాలు, వాటి భద్రతకు సంబంధించి కార్యనిర్వహణా ధికారులుపూర్తి పారదర్శ కంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.