Monday, November 25, 2024

గురువు మాట… వికాస గీతం

గు అం టే చీకటి, రు అంటే వెలుగు. గురువు చీకటి నుండి వెలుగు వై పు నడిపించేవాడు. మనం గురువుల గురిం చి చెప్పుకోవాలంటే వేదవ్యా సుడు, శంకరాచార్య వారిని పేర్కొ నాలి. అయితే మనం ముఖ్యంగా వారి జీవన విధానం గురించి తెల్సుకుని కొద్దో గొప్పో వాటిని ఆచరించాల్సి వుంది. అదొక అమూల్య సం దేశాన్ని అందిస్తుంది. వారి ప్రతిమాటా ఒక వికాస గీతంగా భావించాలి. వారి నిరా డంబరత, సచ్చీలత ఎంతగానో గమనార్హం. అందరూ అనుకునే విధంగా వారెప్పు డూ పాదపూజల్ని కోరుకోలేదు. ఆడంబరాన్ని మెచ్చుకోలేదు. పొగడ్తలను ప్రోత్స హించలేదు. వారు ప్రచార పటాటోపాలకు వీలైనంత దూరంగా వున్నారు. ఆచరణ ను మాత్రమే ఇష్టపడ్డారు. వారెప్పుడూ చెప్పింది సమర్పణ అనేది హృదయ పూర్వకంగా వుండాలన్నారు. నిరాడంబరతకు విలువనిచ్చారు. సత్యాన్ని గౌరవిం చాలన్నారు. ఎవ్వరూ తమ తమ కర్తవ్యాలను మరువరాదన్నారు. వారి కర్తవ్యం తోనే దైవాన్ని చూడాలన్నారు. అదే జీవన తత్వంగా భావించాలని చెప్పకనే చెప్పారు. అందుకే గురు అంటే గుణాతీతుడు, గొప్ప రూపాతీతుడు.
గురువు లేకుండా మంత్రం కూడా జపించకూడదు. కారణం ఈ మంత్రంలోని బీజాలకు నాడులు స్పందిస్తాయి. తప్పుగా పలికితే అది నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది, అలాగే దేనికి ఏది ఉపయోగపడుతుంది తెలుసుకుని చేయాలి.
ఒక జబ్బు చేసినప్పుడు సొంతంగా ఔషధం మింగకూడదు ఒక జబుకి ఒకే రకం మందులు అందరికి పని చేయదు ఒకే రకం జబ్బుకి అనేక రకాల ఔషధాలు ఉన్నాయి.. అలాగే ఒక సమస్యకు అనేక రకాల పరిష్కరాలు వారి వారి జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది.. అందుకే ఏది ఎలా చేయాలి అని చెప్పేవారు ఉంటే అది తెలుసుకుని చేయాలి..
ఉదా#హరణకు ఒక ఔషధం చేసే సమయంలో పఠించే మంత్రం ఉంటుంది అది చెప్తూ చేయడం వల్ల దానికి ప్రాణ శక్తి వస్తుంది అలాగే అది తీసుకునే రోగికి కూ డా ఒక మంత్రం చెప్తూ సేవించే వాళ్ళు త్వరగా ఆ మందు వారికి ఆరోగ్యాన్ని ప్రసా దించేది.. అది రహస్యంగా ఉంచడం వల్ల ఔషధ తయారీ తెలుసు కానీ దాన్ని మంత్ర శాస్త్రం మరుగై పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement