మేషరాశి : ఈ రోజు బద్ధకం అధికంగా ఉంటు-ంది. పనులు వాయిదా వేసి విశ్రాంతి కోరుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరులతో వ్యవహారాల్లో ఓపిక అవసరం. తొందరపాటు- పనికి రాదు.
వృషభం: ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. కుటు-ంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం బాగుంటు-ంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులను కలుస్తారు.
మిథునం : కొత్త పనులు ప్రారంభించడానికి, వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటు-ంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ఉద్యోగార్థులు అనుకూల ఫలితం సాధిస్తారు.
కర్కాటకం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పెట్టు-బడులలో అజాగ్రత్త, తొందరపాటు- పనికి రాదు. మీ తొందరపాటు- వలన డబ్బు నష్టపోయే అవకాశముంటు-ంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వారిపై ఒక కన్నేసి ఉంచండి.
సింహం : ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమయానికి భుజించండి. శ్వాస లేదా జీర్ణసంబంధ అనారోగ్యం బారిన పడే అవకాశముంటు-ంది. ఉద్యోగంలో కొంత అనుకూలత ఉంటు-ంది. సహోద్యోగుల సహాయం అందుకుంటారు.
కన్య : మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొద్ది కాలంగా ఇబ్బందిపెడుతున్న సమస్య ఒక కొలిక్కి వస్తుంది. వాయిదా పడిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.
తుల : ఆరోగ్యం బాగుంటు-ంది. కొద్ది కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య తగ్గుముఖం పడుతుంది. వృత్తి పరంగా ఒక శుభవార్త వింటారు. రోజంతా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది.
వృశ్చికం : ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కొంత అసౌకర్యంగా ఉంటు-ంది. ముఖ్యంగా వాయు సంబంధ అనారోగ్యం బాధించవచ్చు. డబ్బు విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. అనుకోని అవమానం లేదా మానసిక ఆందోళన ఎదురవవచ్చు. ఇతరుల విషయాల్లో కల్పించుకోకండి.
ధనుస్సు : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటు-ంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ శక్తిపై నమ్మకముంచిముందడుగేయండి, విజయం మీ సొంతమవుతుంది. అనుమానంతో ఏ పని చేయకండి. దూరప్రయాణం చేసే అవకాశముంది.
మకరం : ఈ రోజు అనుకూలంగా ఉంటు-ంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వృత్తిలో మార్పు కానీ, అభివృద్ధి కానీ ఉంటు-ంది. చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది.
కుంభం : ఈ రోజు ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటు-ంది. నేత్ర సంబంధ అనారోగ్యం కానీ, మానసిక ఆందోళన కానీ ఉంటు-ంది. ఎక్కువ ఆహారం తీసుకోవటం మంచిది కాదు. మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. సంగీతం వినడం లేదా ఏదైనా వినోద కార్యక్రమంలో పాల్గొనడం మంచిది.
మీనం : ఆర్థికంగా చాలా అనుకూలించే రోజు. పాత బకాయిలువసూలవడం కానీ, అనుకోని ఆదాయం రావడం కానీ జరుగుతుంది. కుటు-ంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పెట్టు-బడులకు కూడా అనుకూల దినం.