శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో వున్న పాండవుల వద్ద కు వెళ్ళాడు. అక్కడ పాండవుల చేత సేవింపబడుతున్నా డు. కుంతీదేవి కృష్ణపరమాత్మను ఎప్పుడూ కేవలం ఆమె దే#హబంధువుగా చూడలేదు. ఆవిడ ఎప్పుడూ ఆయన యందు పర మాత్మ తత్త్వమును చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండే ది. ఆయన కుంతీదేవి చేత, ధర్మరాజు చేత, యితర పాండవ ప్రము ఖుల చేత స్తుతింపబడ్డాడు. కృష్ణ పరమాత్మకు అర్జునునియందు ప్రీతి ఎక్కువ. అందుకనే ఆయన అర్జునునకు సారధ్యం చేస్తూ ఉం టాడు. దాని వెనకాతల వున్న రహస్యం వేరు.
”యత్ర యోగేశ్వర: కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర:!
తత్ర శ్రీర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మ మమ!”
ఎక్కడయితే మన జీవన రథమును నడపడానికి చోదకునిగా, సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో, అక్కడ మన వెనక కూర్చుని రథమును ఆయన నడిపిస్తున్నారని నమ్మి, ఆయనకు పగ్గములు అ ప్పజెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయముండదు.
ద్వాపర యుగంలో అష్టభార్యలతోపాటు పదహారు వేల మం ది గోపికలతో సరసాలు, ఇటు రాజ్యపాలన చేస్తూ, మహాభారత యు ద్ధంలో కీలక పాత్ర పోషించి, ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఆపి ద్రౌపది కి మంచి అన్నయ్యగా, యశోద, దేవకికి మంచి పుత్రుడిగా, బలరా మునికి మంచి తమ్మునిగా, అష్ట మహషులకు మంచి భర్తగా కీర్తించబడ్డ శ్రీకృష్ణుడు- ”పరమాత్మ”గా అవతరించడం వెనుక ఎంతో తత్వ బోధనా తన్మయత్వాలు ఉన్నాయి!
శ్రీమహా విష్ణువుకి, కృష్ణావతారంలో ఎనమండుగురు భార్య లు. లక్ష్మీదేవియే ఎనిమిది అంశలతో అష్టభార్యలుగా ఆ స్వామిని సేవించిందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఆ ఎనమండు గురినే అష్టలక్ష్ములుగా అందరూ సేవిస్తుంటారు.
అష్టమహషులు శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు. ఈ అష్ట మహషులే కాక మిగిలిన పదహారు వేల మంది కృష్ణుడి భార్యలకు కూడా ఆయన తన ప్రేమను పంచగలగటం, దానిని వారు పోటీపడి స్వీకరించటం చాలా గొప్ప విషయం.
శ్రీకృష్ణుని అష్ట భార్యలు
1. రుక్మిణి: భీష్మకుని పుత్రిక, రుక్మిణి సందేశాన్ని అందుకొని స్వయం వరం సమయంలో ఎత్తుకొచ్చి రాక్షస వివాహం చేసుకొన్నాడు. అన్యాయంగా, బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్ళి చేసుకొన్నాడని శిశు పాలుడు ఆరోపించాడు. ప్రేమ వివాహం.
2. సత్యభామ: సత్రాజిత్తు కుమార్తె. శ్యమంతక మణిని తెచ్చి నిర్దోషి త్వం రుజువు చేసుకొన్న పిమ్మట సత్రాజిత్తు కూతురునిచ్చాడు. ఈ మె భూదేవి అవతారం. గోదాదేవి సత్యభామ అవతారమని అంటా రు.
3. జాంబవతి: జాంబవంతుని పుత్రిక, శ్యమంతకమణికై వచ్చిన జాం బవంతునితో 28 రోజులు యుద్ధంచేసి ఓడించి గ్రహంచాడు శ్రీకృష్ణు డు. జాంబవతి వీణా విద్వాంసురాలు.
4. మిత్రవింద: ఆమె కోరిక మేరకే బహరంగంగా స్వయం వరానికొ చ్చి అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి చేపట్టాడు.
5. భద్రాదేవి: మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కు మార్తె. పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.
6. నాగ్నజితి: కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. కృష్ణుడు ఏడు రూపాలను ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దు గుద్ది లొం గదీసుకుని వాటిని తాళ్ళతో బంధించి పెళ్ళి చేసుకున్నాడు.
7. కాళింది: సూర్యపుత్రిక, యమునా సైకతస్థలి నుంచి తీసుకొచ్చి పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.
8. లక్షణ: మద్ర దేశపు రాజకుమారి. మత్స్యయంత్ర పరీక్ష. స్వయం వరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు.
అష్ట ప్రకృతులు
ఈ ఎనిమిది శ్రీకృష్ణుని భార్యలు ఎవరికి వారే సౌందర్య రాశులు. దీని వెనుక దాగిన అసలు అర్ధం వేరని ప్రబోధిస్తుంది నిరుక్త నిఘంటువు. వీరు అష్ట ప్రకృతులు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలే కాక, మనసు, బుద్ధి, అ#హంకారం అనే వాటిని కలిపి అష్ట ప్రకృతులు అంటారు.
ఇందులో సత్యభామ- భూ ప్రకృతి అంటే భూదేవే, పట్టమ#హ షి రుక్మిణి- మనసు, జాంబవతి- బుద్ధి, కాళింది- నీరు, మిత్రవింద- వాయువు, నాగ్నజితి- అహంకారం, భద్ర- ఆకాశం, లక్షణ- అగ్ని, కనుక కృష్ణుని అష్టభార్యలు ప్రకృతికి ప్రతిరూపాలు. ఈ అష్ట ప్రకృ తులు పురుషుడైన శ్రీకృష్ణుడి అధీనంలో వుంటాయని చెప్పడానికే వ్యాసుడు ఆయనకు అష్ట భార్యలని చెప్పాడు. వీరి సాయంతోనే కృష్ణుడు అనేక మ#హమలు చూపాడు.
అష్టమ#హషులే అష్టసిద్ధులు
అణిమ- రుక్మిణి, మహమ- సత్యభామ; లకిమ- జాంబవతి, గరిమ- మిత్రవింద, ఇసిత్వం- కాళింది, వశిత్వం; నాగ్నజితి- ప్రాప్తి- భద్ర; ప్రాకామ్యం- లక్షణ అష్ట భార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుచున్నాడు. ఎనమండుగురు భార్యలు అని చెప్పడం వెనక ఒక రహస్యం ఉంది. యథార్థమునకు కృష్ణ భగవా నుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరససల్లాపములతో కాలం గడపాలని వచ్చిన అవతా రం కాదు. కృష్ణ పరమాత్మ అవతారమును అర్థం చేసుకోవడం చాలా కష్టం.
భార్య అనే శబ్దము చేత ఆరు లక్షణ ము లను ఆవిష్కరిస్తారు. భార్య అన గానే ఆమె భర్తతో ఆరు రకములయిన సంబంధములను కలిగి ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. ఈ ఆరు లక్షణములు ఆమెకు వేరొక పురుషునితో ఉండవు. భార్య అనునది భర్తకి మాత్రమే చెందినది. ఈశ్వర చైతన్యం లేకపోతే ఎని మిది వస్తువులు జడం అయి ఉండిపోతాయి. ప్రకృతి ఎనిమిది రక ములుగా భాసిస్తూ ఉంటుంది.
భూమిరాపోనలో వాయు: ఖం మనో బుద్ధిరేవ చ!
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా!!
అవే పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములనబడే పంచభూత ములు, మనస్సు, బుద్ధి, అహంకారములు. మొత్తం ఎనిమిది. ఈ ఎనిమిదింటి సంఘాతమే ఈ శరీరము. ఈశ్వరుడు పురుషుడై జడమయిన ప్రకృతికి చైతన్యము కలిగిస్తాడు. ఈ ఎనిమిది ఈశ్వ రుడు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయి. ఈశ్వ రుడు లేకపోతే శివము శవము అయిపోతుంది. ఈ ఎనిమిదింటిని కదుపు తున్నవాడు ఎవరో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు ఎనమండు గురినే చేసుకోవాలి. అందుకనే కృష్ణునికి భార్యలు ఎనిమిది మంది. ఇదీ అందులో వున్న ర#హస్యం. జ్ఞాన స్థాయిలో దర్శనం చేసినవారికి మాత్రమే ఈ విషయం అవగాహన అవుతుంది. అందుకనే భాగవత మును రెండుగా వినాలని చెపుతారు. అర్థమయిన చోట జ్ఞానిగా వినాలి. అర్థం కాని చోట భక్తునిగా వినాలి.