Friday, November 22, 2024

స్వీయ పరిశీలన

మన్మనా భవ యద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు
మాయే వైష్యసి యుక్వైవ ఆత్మానం మత్సరాయణ:

ఓ అర్జునా! సదా నా చింతన యందే నీ మనస్సును లగ్నం చేయి, నాకు నిజమైన భక్తుడ వుకమ్ము, సర్వశ్చ శరణాగతి చేసి నాకు నమస్కారం చెయ్యి. నన్ను అర్చించు. సాధన ద్వారా నా యందు నీ మనస్సును లగ్నం చేస్తే నన్ను తప్పక చేరగలవు. – అని గీతాచారుని బోధన, చిత్తశుద్ధితో, పరిపూర్ణ మనస్సుతో నిష్కల్మషమైన చిత్తంతో, సంశయ స్వభావములను వీడి, సర్వశ్చ శరణాగతితో, సంపూర్ణమైన నమ్మకంతో భగవంతుని ఆరాధించవలయును. ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొంటు న్నప్పటికీ, ప్రగాఢమైన ఆకాంక్షతో వాటిని అధిగమిస్తూ, ముందుకు వెళ్లగలము. అలాగే దైవముతో తాధాత్మను కూడా పొందగలుగుతాము. ఇకపుడు పూర్ణయోగ ప్రక్రియలోని మూడు దశలను క్రమేణా సమీపిస్తాము.
తొలుతగా తనను తాను అధిగమించి దైవత్వాన్ని సృజించాలనే ప్రయత్నం, తర్వాత ఆసంస్పర్శను వ్యక్తి తనలోకి తెచ్చుకొని తన అస్తిత్వ మంతటినీ పరివర్తన చేసుకోవడం, ఇక చివరిగా పరివర్తన చెందిన మానవతను ప్రపంచంలో ఒక దివ్య కేంద్రంగా అభివ్యక్తీకరించవ లయును.
యోగ సాధనలో తనను తాను పరి శీలించుకోవడం చాలా అవసరము. ఏ పని అయినా ప్రారంభించుటకు ముం దు, దానిని ఎందుకు చేయుచున్నాము. సహజంగానే అందరూ చేస్తున్నారు. కావున నీవు చేయాలనుకుంటున్నావా? ఈ పని వలన యదార్ధమైన ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఇది అవసరమా? అని సాధకుడు తనను తాను ప్రశ్నించుకుంటూ వుండాలి. దీనివలన ఇతరులకు మంచి చేయాలనుకుంటున్నావా? అయితే మంచితనం అనేది తనలో కూడా ఉందా? లేదా? అని పరిశీలించుకోవాలి. ఇతరులకంటే నీవు ఉన్నతస్థాయిలో ఉండి, నీలోని చైతన్యము స్వభావరీత్యా, లోతుగా, విశాలముగా ఉన్నప్పుడే నీవు ఎవరికైనా ఏదైనా చేసి పెట్టగలుగుతావు.
తనను తాను సాధకుడు చక్కదిద్దుకొనుటకు చేసే ప్రయత్నంలో శ్రద్ధ, పట్టుదలతో కృషి చేసే కొలదీ నీవు ఏమిటో, నీవు ఎవరివో అనే అద్భుతమైన విషయాన్ని తెలుసుకోగలుగుతావు. ”నేను” అనేది నిరంతరం మారుతూనే వుంటుంది. శరీరంలో వుండే పదార్థం కూడా ఎప్ప టికప్పుడు పునరుద్ధరింపబడుతూ వుంటుంది. కొన్ని సంవత్సరముల ముందున్న ఆలోచ నలలో, ఆదర్శాలలో, అనుభవాలలోనూ మార్పు గోచరించును. ఈ విధముగా నిన్ను నీవు ప్రశ్నించుకుంటూ, పరిశీలించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే, అసలు నిజం నీకు బోధ పడుతుంది. ”నేను” అనేది ఏమీ లేదని, ఉన్నది అంతా ఏకమే. అదే సత్యం, అదే దైవం అని సాధకుడు అనుభవ పూర్వకముగా గ్రహంచును.
జ్ఞానానికి ప్రధానమైనది నీ గురించి నీవు తెలుసుకొనుటయే. అదే జీవితమునకు పునాది, నిన్ను నీవు తెలుసుకునే క్రమంలో నీ ప్రతి అణువులో పరమ సత్యం, దివ్యప్రకాశం నిండి ఉన్నదని నీకు అవగాహన ఏర్పడును. ఇకప్పుడు ఇప్పటివరకు చేసినదంతా ప్రతికూ లమైనవే అని, అహంకారమును పెంపొందించుకునే చర్యలే చేపట్టానని తెలుసుకుంటావు. ఈ సత్యాన్ని తెలుసుకుని, యధార్థమైన నమ్రతతో జీవితం ప్రారంభమైనప్పుడు భవిష్యత్‌ కర్త వ్యాన్ని ఆకలింపు చేసుకోగలవు.
తనను తాను ఉద్దరించుకున్నప్పుడే, ఇతరులకు ఉత్తమమైన సేవలు అందించగలరు. సాధకుడు తనలో ఒక నల్లని మచ్చగానీ, ఆవగింజంత అహంకారం గానీ, స్వార్థంగానీ ఉండ కుండా తనను తాను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వుండాలి. పుష్పం స్వత: సిద్ధంగా విక సించి, ప్రతి ఫలాపేక్ష లేకుండా తన పరిమళాన్ని అంతటా వ్యాపింపజేస్తుంది. ఆనంద తరం గాలతో నిండిన ఆ సౌరభం ఆ చుట్టుప్రక్కల అందరికీ ఆనందాన్ని, ఆహ్లాదమును అందిస్తుం ది. ఆ విధముగానే సాధకుని ఆత్మ వికసించే కొలది, దాని ప్రభావం సర్వవ్యాప్తం అవుతుంది. ఇక నేను అనేది తొలగిపోయి, ఉన్నది అంతా ఆ దైవమే, ఆయనే పరమ సత్యంగా అనుభూతి కలుగును.

Advertisement

తాజా వార్తలు

Advertisement