Friday, November 22, 2024

కాశీలో స్వరూపానందేంద్ర పంచగంగా స్నానం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి కాశీ యాత్ర కొనసాగుతోంది.దీనిలో భాగంగనే బుధవారం స్వామీజీ తన పరివారంతో కలిసి పంచగంగా స్నానమా చరించారు. కాశీ మహాక్షేత్రంలో గంగానదీ తీరాన 64 ఘాట్లు ఉన్నప్పటికీ అందులో ప్రధానమైనవి ఐదు మాత్రమే వాటిలో అస్సి, కేదార్‌, దశాశ్వమేధ, పంచగంగ, మణికర్ణిక ఘాట్లు ఉన్నాయి. వీటిలో పుణ్నస్నానం ఆచరిస్తే భక్తి, జ్ఞాన, వైరాగ్యములు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. ఈ ఐదు ఘాట్లను సందర్శించిన స్వరూపానందేంద్ర స్వామి పుణ్య స్నానమాచరించారు. గంగమ్మ తల్లికి పూజలు చేసి హారతులిచ్చారు. విశాఖ శ్రీ శారదాపీఠం తరపున చీరను సమర్పించారు. అలాగే దండ తర్పణం చేసారు. అనేకమంది తెలుగువారు స్వరూపానందేంద్ర స్వామితో కలిసి మణికర్ణికలో మాధ్యాహ్నిక స్నానం చేసారు. వేద మంత్రోచ్చా éరణల మధ్య పంచగంగా స్నానం సాగింది. ఈ సందర్భంగా పండితులు పవమా న సూక్తం, అఘమర్షణ సూక్తాలను పఠించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామి కాశీ ప్రాంతానికి క్షేత్రపాలిక దేవతగా విరాజిల్లుతున్న వారాహి మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. స్వామీజీ వెంట వారణాసి ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సత్యనారాయణ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement