Saturday, November 23, 2024

సూత్ర ప్రాధాన్య గ్రంథమునిర్గమ కాండ

ఇది నలభై అధ్యాయాల గ్రంథం. ఇది ఆది పంచ గ్రంథాల్లో ఉన్న రెండో గ్రంథం, మోషే చేతనే వ్రాయబడింది. క్రీ.పూ. 3000 సంవత్సరాల కాల పరిధిలో ఇది జరిగిన ట్టుగా తెలుస్తోంది. నిర్గమనం. ‘గం’ ధాతువునకు ‘నిర్‌’ అనే ఉపసర్గ చేరితే ఏర్పడ్డ పదం ఇది. ‘గం’ మూల ధాతువుకు పోవుట, వెళ్ళుట అనే అర్థాలు చెప్పుకోవొచ్చు. ఉపసర్గ (నిర్‌)వల్ల ఆ పదం అర్థమే మారి, బయట పడుట, విడుదలై పోవుట అనే అర్థా లు వస్తాయి. ఎవరు బయట పడాలి? ఎక్కడి నుంచి విడుదల కావాలి అనే ప్రశ్నలు ఆ తరువాత వచ్చే ప్రశ్నలు. బైబిల్లోని ఆది కాండంలోని వ్యక్తులు దైవ ప్రజలు ఐగుప్తు లో బందీకృతులయ్యారు. అది వర భూమి. అక్కడి నుంచి బయటపడాలి. మళ్ళీ దైవ భూమికి పునరాగమనం చేయాలి. ఇది వారి నిర్గమనం. ఈ సూత్ర ప్రాధాన్యతపై నడి చిన గ్రంథం, నిర్గమ కాండ గ్రంథం. ఇజ్రాయేలీయులకు దేవుడు చేసిన హత కార్యాల న్నీ ఇందులో స్మరించుకోవటం జరుగుతుంది. ఓ రకంగా ఇందులో గత శుభాలు నెమరువేసుకున్న సందర్భాలు కనిపిస్తాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండటం, ఐగుప్తు నుంచి సీనాయి పర్వతానికి వెళ్ళటం, సీనాయి నుండి బయల్వెడలటం వంటి ప్రధాన సంఘటనల్లోని అంశాలే ఇందులో చోటుచేసుకున్నాయి. ఈ సీనాయి నివాసం ఇశ్రాయేలీయుల్లో చాలా మార్పు తెచ్చింది. నైతికంగా, ఆధ్యాత్మికంగా పూజార్చనా వరంగా వీరిలో పెద్ద పరిణామమే కనిపించింది. ఇక్కడనే దేవునికీ ప్రజలకీ మధ్య గొప్ప ఆధ్యాత్మిక ఒప్పందం జరిగింది. ఒక ఆరాధనా మందిరం దేవునికి కట్టబడింది. కొన్ని నియమ నిబంధనలు ఏర్పడ్డాయి. ఆరు రోజులూ శ్రమించి ఏడో రోజు విశ్రాంతి. తీసుకోవాలన్న నియమం కూడా ఇక్కడే ఈ నిర్గమమనం సమయంలోనే దైవ వాక్కు గా ఏర్పడింది. నాటి నుంచి నేటి దాకా విశ్రాంతి దినం ప్రజల్లో కొనసాగుతూనే ఉంది.
ఈ నిర్గమ కాండలో మోషేను చూడగలుగుతాం. అలాగే యేసేపు మరణాన్నీ చూడగలుగుతాం. వీరిద్దరూ బైబిల్లో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నతోన్నత శిఖరాలు అధిరోహంచి, సామాన్య జనుల కోసం నిలబడిన వ్యక్తులు. పర భూముల్ని, పర జాతుల్నీ పాలించే స్థాయికి పోయి, స్వజాతి విముక్తికై పాటుపడ్డ మహా వ్యక్తులు వీరిద్దరూ!
పాత నిబంధనలోనే #హమగిరుల వంటి వీరు నిర్గమనంలో కూడా ఉండటం ఓ గొప్ప విశేషం. ఎన్నో చెప్పుకోదగ్గ సంఘటనలు, అద్భుతాలూ చోటుచేసుకున్నాయి. ఇశ్రాయేలీయుల్ని అతి క్రూరంగా అణచివేసిన ఈజిప్ట్‌ ఫరో మహారాజుల దౌష్ట్యం కని పిస్తుంది. దాన్ని ఎదుర్కొని, విజేతలైన ఇజ్రాయేలీయుల చాకచక్యం, దైవ బలం ఇందు లో కనిపిస్తాయి. పది ఆజ్ఞలు, చీలిపోయిన సముద్రం వంటి ఘట్టాలు ఇందులోనే ఉంటాయి. (300)

Advertisement

తాజా వార్తలు

Advertisement