మనిషి జీవితం చాలా విచిత్రమైనది. చాలా సంక్లి ష్టమైనది కూడా. ఈ మానవ జీవితాన్ని వర్ణి స్తూ శ్రీ అరవిందులంటారు.
”మనిషి స్వేచ్ఛను కాంక్షిస్తాడు. కానీ బానిసత్వంలో బ్రతుకుతాడు. అతడు కొంత వెలుగైనా కోరుకుంటే చీక టిలో పయనించాలి. ఇంతకుమించిన ఉన్నతమైన జీవి తాన్ని పొందాలనుకుంటే మృత్యువు అవసరము. అన్ని దిక్కులకు తిరుగుతాడు. అన్ని పిలుపులు వింటాడు. కానీ అన్నీ అనుమానాలే. తాను నడక సాగించాలంటే ఏ కొంతైనా వెలుగు కావాలి. అతడి జీవితం గుడ్డివాడి చేతి లో దీపం. చేతిలో దీపం వున్నా త్రోవ కానరాదు. అంతా దాగుడు మూతలాటలే. ఎప్పటికప్పుడు ఏదో సాధించి నట్లే కనిపిస్తుంది. కానీ ఏదీ కనబడదు. తననుతాను వెతుక్కుంటూ, తన నుండి తాను పారిపోతాడు. అసలు ”నేను” ఎవరో తెలియదు. తనలో తాను వుంటూనే తాను వేరు అనుకుంటాడు. ఏవేవో పునాది లేని మేడలు కడుతూ వుంటాడు. నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటాడు. కానీ ఎక్కడికీ చేరుకోలేడు. ఎప్పటికప్పుడు గమ్యం కనిపిస్తుం ది. కానీ అక్కడికి చేరుకోలేడు. ప్రపంచాన్నంతా శాసిస్తా నంటాడు. కానీ తనను తాను అదుపులో పెట్టుకోలేడు. అతని ఆత్మ జ్యోతిలా తనలో వెలుగుతూనే వుంటుంది. అయినా తన జీవితం మాత్రం కొడగట్టుకుపోతుంది.
వారు మేధావులు కావచ్చు, తత్త్వవేత్తలు కావచ్చు, రాజ్యాలు ఏలవచ్చు, పదిమందిలో కీర్తింపబడవచ్చు, పాం డిత్య ప్రకర్ష వుండవచ్చు, విద్యావేత్తలు, ఆచార్యులు కావ చ్చు. అందరిదీ ఒకే స్థితి తానెవరో తనకు తెలియనప్పుడు ఎన్ని వుండి ఏమి లాభం. ఎప్పుడు ఏదో వెలితి. నిండైన జీవి తం కావాలనుకున్నా, ఏదో లేమి వెన్నాడుతుంది. తానేది కాదో అలా వుండిపోతాడు. అజ్ఞానం ఆవరించే వుంటుంది.
అయినా సరే, సకల కోటి జీవరాసులలోనూ మానవ జన్మ దుర్లభం అంటారు. అతడు ఏమీ తెలియని మూర్ఖుడే కావచ్చు గానీ, అంతటినీ తెలుసుకోవాలనే ఆకాంక్ష వుం టుంది. అదే అతడు పొందిన వరం. అదే లేకపోతే మనిషికీ, పశువుకీ తేడా లేదు మరి.
సరే, ఇంతకీ ఈ సృష్టి ఏమిటి? ఈ సృష్టి పరమార్థమే మిటి? ఈ ప్రశ్న ఈనాటిది కాదు. సృష్ట్యాది నుండి వెన్నాడు తూనే వుంది. ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్న వారే ఉపని షత్ ద్రష్టలు. సృష్టికి కారణభూతమైన పరమాత్మకు ఒక సంకల్పం కలిగిందట.
‘ఏ కో#హం బ#హుస్వాం ప్రజాయ్ యేతి’ అని నేనొక్కడినే అనేకంగా మారి ఆనందించాలని అనుకున్నాడట. ఇక ఆ సంకల్పమే శక్తిగా మారింది. ఆ శక్తి చిన్నచిన్న జీవులుగా మారి, అనేకంగా కనిపించే, ఈ చరాచర జగత్తుగా అయింది. అది అలా మారుతూ మారుతూ ఈనాటి మానవుడి వరకు వచ్చింది. తాను అనుకున్న అనేకం అయింది. కానీ తాను సంకల్పించిన ఆనందం ఇంకా దూరంగానే ఉంది. అందుకే ఈ మానవుడు సృష్టిలో వున్నాడే కానీ ఇంకా పరిపూర్ణుడు కాదు.
మానవుడు పరిపూర్ణుడు అయినప్పుడే, దైవసంకల్పం నెరవేరుతుంది. అలా కావాలంటే ఈనాటి మానవుడు దివ్య మానవుడు కావాలి అంటారు శ్రీ అరవిందులు. అందుకోసం వచ్చిన చోటికి చేరుకోవడం కాదు, జన్మరాహత్యం, ముక్తి పరిష్కారం కాదు. తానే అన్నింటిలోనూ ఏకమై, తన నిజ స్థితిని పొందాలి.
అందుకోసం ఎవరిని యాచించినా ప్రయోజనం లేదు. ఎవరి మీద ఆధారపడినా లాభం లేదు. ఎవరిని నమ్మినా తాను పొందాలనుకున్నది పొందలేడు. అందువల న అన్నింటికీ దైవం మీదనే ఆధారపడాలి. తన కోరికను ఆ దైవం తప్ప మరెవరూ తీర్చలేరు. ఒక మిత్రుడిని విశ్వసించి నట్లు, ఒక స్నేహతుడిని సహాయం అర్థించినట్లు, అన్నింటికీ ఆ దైవం మీదనే ఆధారపడాలి. అదే సమర్పణ – సర్వాంగణ సమర్పణ, సర్వ సమర్పణ. ఈ ప్రమాణంలో, ముక్తి అనేవి, జన్మరా#హత్యం అనేది ఒక మజిలీ మాత్రమే. అదే గమ్యం కాదు.
ఇది శ్రీ అరవిందుల ప్రపంచానికిచ్చిన సందేశం. దైవా న్ని మాత్రమే నమ్మాలి. ఎవరైనా యోగం మొదలుపెట్టాల న్నా, తలచిన వెంటనే దైవాన్ని మాత్రమే నమ్మి ముందుకు వెళ్లాలి. చేయూత కొరకు సాధారణ మానవులపై ఆధారప డితే తక్షణం ఆదరణ లభించక క్రిందికి ఒరిగిపోవుట, పడి పోవుట, వంచింపబడుట సంభవించును.
నీవు వేదనకు గురి అయినప్పుడు పరమాత్మ ద్వారానే నీ బలహనతలన్నియూ అగ్నికి ఆహుతి అయి, ఉపశమనం లభించును. దైవం ద్వారానే అవసరములన్నియూ తీర్చబ డి సంతృప్తి పొందెదవు. నిరంతరం నీకు ఏమి కావాలన్నా అవి ఆదరణ, సహాయము, హర్షము ఇంకేవైనా నీకు ఇవ్వ గలిగే సామర్థ్యము భగవంతుడికి మాత్రమే వున్నది. ఎవరికి ఏమి ఇవ్వాలో సర్వము ఎరిగినవాడే భగవంతుడు.
మనకు ఏమి కావాలన్నా మార్గదర్శనం కొరకైనా, జ్ఞానార్జనకైనా, పరమాత్మను మాత్రమే ఎల్లవేళలా అడుగు తూ వుండాలి. అప్పుడు నిజముగా నీకు ఏది అవసరమో అది పరమాత్మ నీకు అందజేస్తాడు. దానిని నీవు ఆనందంగా స్వీకరించడం అలవరచుకోవాలి.
మన అంతరంగంలోనే దివ్యజ్యోతి ప్రజ్వరిల్లు తున్నదని, దైవము నెలకొని వున్నాడని మనం ఎరుగుదు ము. అయితే దానితో ఆధ్యాత్మికత చెందుటకు నిరంతర ముగా దృఢమైన ఆకాంక్ష ఉండాలి. తద్వారా ఆత్మ నివేదన తో మనలో దాగివున్న పరమాత్మను కనుగొనవచ్చును. యోగమార్గంలో ముందుకు వెళ్లకుండా అనేక శక్తులు అడ్డు తగులుతూ వుంటాయి. అయినా వాటిని పటిష్టమైన సంక ల్పంతో, దైవ సహాయంతో తొలగించుకుంటూ, నిరాకరి స్తూ, మనం సర్వం సమర్పణతో ముందుకు కొనసాగాలి.
మనం నివసించే పదార్థ ప్రపంచం ఒక్కటే కాదు, అందులో భూమికలున్నాయి. పదార్థంతో కలిపి మొత్తం ఏడు లోకాలు. పదార్థం, జీవం, మనస్సు, దివ్యచైతన్యం, సత్, చిత్, ఆనందాలు. అయితే ఇప్పుడు ఈ పదార్థ జగత్తు అజ్ఞానం, అస్పష్టతలతో కూడుకొని వున్నది. ఆ దశలన్ని యూ అభివ్యక్తం. క్షేత్రము- జగత్తు కూడా ఇదే.
ప్రారంభంలో ఇలా ఉన్నప్పటికీ, ఒక నాటికి సౌంద ర్యముగా, లయాత్మకముగా, దివ్య వెలుగులతో నిండిపో తోంది. ఆ విధముగా వినియోగించడానికి ఈ పదార్థ ప్రపం చం తయారైనది. మన యొక్క అస్తిత్వంలోని మూలంలో సారవంతముగా వున్నది ఆ పరమాత్మనే.
అతడు మనకు అన్యుడేమీ కాదు. సుపరిచితుడే. తీవ్ర సాధన ద్వారా దానిని గ్రహంచగలము. విశ్వానికి భగవంతు డికి మూలంలో ఏవిధమైన అభేదత్వము లేదు. అది అవగాహన అయితే ప్రపంచంలోని సమస్యలన్నింటికీ పరి ష్కారం లభించును. పరమాత్మను, విశ్వమును విభజించి సృష్టికర్త వేరు, కర్మ చేసేవారు వేరు అని విభజన చేయవలసిన పనిలేదు. ఎందుకంటే అదే సత్యము. మానవ చేతన దివ్య చైతన్యముతో ఐక్యము చెందినప్పుడు మనకు ఆ సత్యము గోచరించును. ఇక అప్పుడు ప్రతిదీ ఏ సమస్య లేకుండా సహజముగానే జరుగుతుంది.
మనని ఉపకరణముగా చేసుకొని భగవంతుడిని మన ద్వారా పని చేయుటకు మనము అనుమతించినప్పుడు సమస్తము అతనే చేస్తాడు. అది చాలా అత్యద్భుతముగా వుం టుంది. ఎల్లవేళలా మనము దైవేచ్ఛనే నెరవేరాలని, దివ్య ఇచ్ఛనే మన ఇచ్ఛగా వుండాలని ఆకాంక్షించాలి. నా సంక ల్పం కాదు, దైవ సంకల్పమే నెరవేరాలని, మనము చైతన్య ముతో వుంటూ నిరంతరము అనుకుంటూ వుండవలయు ను. మనకు మన గురించి ఏమీ తెలియదు. ఆ దైవమునకే అన్నీ తెలుస్తాయి అనే భావనతో ఉండాలి.
నిశ్చల నీరవతలో ఏకాగ్రతతో దైవమును మనతో పని చేసేలా మన అస్తిత్వమును దివ్యత్వముతో నిండిపోయేలా ఆత్మ నివేదన చేసుకోవలయును. ఇక అప్పుడు మన జీవనం నిరంతరం వెలుగుబాటలో సాగిపోతుంది.
సూర్యకాంతి పథం
Advertisement
తాజా వార్తలు
Advertisement