Saturday, November 23, 2024

సూర్యగతిని శాసించే జగత్కారుడు

సూర్యభగవానుడు కూడా ఎవరి అనుమతి లేకపోతే ఉదయించడో, అస్తమించడో ఆ మహర్షి జరత్కారుడు. ఆయన తపోశక్తి, సాధనా విధానాలు అనితర సాధ్యాలు. శరీరాన్ని తపస్సు చేత కృశింపచేసుకున్న కారణం చేత ఆయ న్ను జరత్కారుడు అంటారు. కేవలం ఎముకలు, నరాలు మాత్రమే ఉండే మహర్షి నిరంతరం భూప్రదక్షిణ చేస్తూ సూర్యాస్తమయం నాటికి ఏ గ్రామం చేరితే అక్కడ ఆగి ఉదయాన్నే ఆ ప్రదేశం విడిచిపెట్టేవాడు. అలా పరివ్రాజక జీవితాన్ని అనుసరి స్తూ ఒకరోజు విచిత్రమైన వ్యక్తులను చూశాడు.
అంతులేని లోతైన గొయ్యి ఒక చెట్టు ప్రక్క ఉంది. ఆ చెట్టు నుంచీ ఒక బల మైన వేరు గొయ్యికి అడ్డంగా ఉంది. ఆ వేరుకు తలకిందులుగా గొయ్యిలోకి వేళాడు తూ కొందరు తపస్సు చేసుకుంటూ కనిపించారు. ఇదే వింత అనుకుంటే ఆ వేరును ఒక ఎలుక కొరికేస్తూ ఉండడం మరో వింత. ఇప్పటికే చాలా మటుకు వేరును ఎలుక కొరికేసింది. మరికొంత భాగం కొరికేస్తే త్వరలోనే వారంతా అం తు కనిపించని గొయ్యిలో పడిపోతారు. అ భయంకరమైన చీకటిగా ఉంది. జరత్కారుడు మహా శ్చర్యంతో అది ఏవిధమైన తపస్సో తెలుసుకోవాలని వారిని”మీరెవరు? ఈ మహా ప్రమాదమైన తప స్సు ఎందుకు చేస్తున్నా రు?” అని ప్రశ్నించాడు.
దానికి వారు సమా ధానంగా ”మేమంతా పితృ దేవతలం. మా వంశంలో ఒకడు పెళ్ళీ పెటాకులూ లేకుండా దేశదిమ్మరిగా తిరు గుతున్నాడు. వాడు సంతా నం లేకుండా చనిపోతే మేమంతా ఈ తామస నర కంలో పడిపోతాము. ఈ చీకటి గొయ్యే నరకం. ఆ చెట్టు వేరు మా వంశంలోని పనికిమాలిన వాడి ఆయుష్షు. దాన్ని కొరుకుతున్నవాడు యమధర్మరాజు” అని చెప్పారు.
అది విని గతుక్కుమన్న మహర్షి ”వివాహం సంతానం లేకుండా ఉన్న ఆ వ్యక్తి పేరు ఏమిటి?” అని అడిగాడు. దానికి వారు ”ఆ… ఉన్నాడులే మా వంశంలో ఒక పనికిమాలినవాడు జరత్కారుడు అనే పేరుతో” అని అన్నారు.
వారి సమాధానం విని మహాదు:ఖం పొంది జరత్కారుడు ”పితృదేవతల్లా రా! మీ దుర్గతి పోగొట్టాలంటే నేను ఏం చేయాలో చెప్పండి” అని వేడుకొన్నాడు.
”నాయనా! నువ్వే జరత్కారుడని మాకు తెలుసు. నీవు ప్రాపంచిక వైరాగ్యం వల్ల చేస్తున్న మహాతపస్సు మాకు సంతోషదాయకమే అయినా, నీవు పితృ ఋణం తీర్చుకోలేదు. పెళ్ళి చేసుకొని పిల్లలను కనకపోతే మేము తిలోదకాలు లేకుండా శాశ్వత నరకంలో పడిపోతాము. కనుక వెంటనే పెళ్ళి చేసుకొని వంశతంతువు (తీగ) కొనసాగించు. వ్యక్తిగతంగా బ్రహ్మచారిగా ఉండి ఎంత ఉన్నతి ఏ రంగం లో సాధించాము అనేది ప్రధానం కాదు. జన్మనిచ్చిన తల్లితండ్రులకు నువ్వులూ నీళ్ళూ ఇచ్చే మనుమలను ఇవ్వని జన్మ వృథా. అటువంటి వారికి మురిక్కాలు వలోని పురుగులకూ తేడాలేదు. సూర్యగతిని కూడా శాసించగలిగే తపో సంప న్నుడైన జరత్కారుడికి కూడా పితృ ఋణ విముక్తి తప్పలేదు.
వేదవేదాంత అధ్యయనం చేసి సామాన్య సంసారం మీద ఏహ్యభావం పొం ది గృహస్థాశ్రమం స్వీకరించని శిష్యుడిని కూడా గురువులు ”ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీహ” అని హెచ్చరిస్తారు. కానీ ఈ జీవితానికి భూ మండలం మీద ఉన్న సమస్త స్త్రీలూ నాకు అమ్మలే అనే ప్రమాణం చేసి సన్యాసం స్వీకరించి తన గురువునే సేవిస్తూ ఉండేవారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. సన్యాసం స్వీకరించకుండా బ్రహ్మచర్యం వహించడం శాస్త్ర విధిరహితం. వివాహం ఎందుకు? అనే ప్రశ్నకు అత్యద్భుతమైన వివరణే ఈ జరత్కారుని జీవి తం అని వ్యాస మహర్షి మహాభారత ప్రారంభంలో వ్రాశారు. సకల సాధ నలకూ గృహస్థాశ్రమమే మహాశ్రేయో మార్గ మని రమణ మహర్షి వంటి వారు కూడా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement