అర్జున ఉవాచ
నష్టో మోహ: స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత|
స్థితో స్మి గతసందేహ: కరిష్యే వచనం తవ||
(భగవద్గీత 18వ అధ్యాయము, 73వ శ్లోకం)
అర్జునుడు: ఓ అచ్యుతా! నీ కృపచే నా యొక్క మో#హభ్రాంతి నిర్మూలించబడినది. నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీలేవు. నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.
వివరణ: కృష్ణుడు అడిగిన ప్రశ్నకు అర్జునుడు ముచ్చటగా మూడు ముక్కలలో సమా ధానం చెప్పాడు. అర్జునుడి సమాధానం ”నష్టో” అనే క్రియా పదంతో మొదలయింది.
నష్టో అంటే నష్టం అయింది అని గట్టిగా అన్నాడు. తరువాత మోహ: అని అన్నాడు. అంటే నాలో ఉన్న మోహము, అజ్ఞానము పూర్తిగా నశించిపోయింది అని అర్థం. అంటే నా కు జ్ఞానోదయం త్వత్ప్రసాదాన్మయాచ్యుత అంటే నీ అనుగ్రహం వలన నా అజ్ఞానము నశిం చింది అని అర్థం. మనలో ఉన్న అజ్ఞానం పోవడానికి భగవంతుని అనుగ్రహం తప్పక ఉం డాలి. ఇంక ఆఖరుది. ”కరిష్యే వచనం తవ.” అని అన్నారు. అర్జునుడు అంటే కృష్ణా! నీవు చెప్పినట్టు చేస్తాను అని అన్నాడు. అంటే సంపూర్ణ శరణాగతి. నీవే తప్ప నిత:పరం బెరుగ అనే స్థితి. మనం కూడా క్రమక్రమంగా ఆ స్థితికి చేరుకోవాలి.
దానికి మూడు మెట్లు. ఒకటి మనలో ఉన్న అజ్ఞానం పోవాలి. రెండు మనలో ఉన్న సందేహాలను విడిచిపెట్టాలి. మూడు పరమాత్మను సంపూర్ణ శరణాగతి పొందాలి. ఈ మూ డు ఆచరిస్తే మనకు అనంతమైన సుఖము శాంతి కలుగుతాయి. ఏ చింతా ఉండదు.
ఇంకొంచెం వివరంగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందాము.
”నష్టోమోహం స్మృతి ర్లబ్ధా” అంటే మోహం పోయింది. పూర్వజ్ఞానం వచ్చింది. అంటే మనకు స్వత: సిద్ధంగా జ్ఞానం ఉంది. అది మోహంతో మూసుకుపోయింది. సంసారము, ప్రాపంచిక విషయాలు, విషయ వాంఛలు అనే ఈ మోహం తొలగిపోతే మనలో ఉన్న అజ్ఞా నము అనే చీకటి తొలగిపోతే, జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. ముందు మనం ఆ పని చేయాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. మన సుకు పట్టిన మకిలను తుడిచేసుకోవాలి.
గీత, గురువు మొదలగువారు ప్రసరించే వెలుగు సాయంతో అజ్ఞానం అనే అంధకా రాన్ని తొలగించుకొని ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి. దానికి మనకు కావాల్సింది ”త్వత్ప్ర సాదాత్ అంటే” గురువుల యొక్క, పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. అజ్ఞానము అనే మాయను దాటడానికి గురువు చుక్కానిలాంటి వాడు. మనకు సరి అయిన దారి చూపిస్తా డు. మనకు అంతా తెలుసు అనుకోవడం పొరపాటు. గురువును ఆశ్రయించి తెలియనివి తెలుసుకోవడం విజ్ఞుల లక్షణం. దానివలన కలిగే లాభం ”గత సందేహ” అంటే మనలో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. మనలో కలిగే సందేహాలను తీర్చే సమర్ధత ఉన్నవాడు గురువు ఒక్కడే. కాబట్టి సమర్థుడైన గురువును ఆశ్రయించడం ప్రతివాడి కర్తవ్యం.
ఆఖరు వాక్యం కరిష్యే వచనం తవ అంటే నీవు చెప్పినట్టు చేస్తాను. పరమాత్మ చెప్పిన ట్టు చేస్తాను. అని అర్థం. అంటే నేను చేస్తున్నాను, అంతా నావల్లే జరుగుతూ ఉంది అనే అహంకారము, కర్తృత్వ భావన వదిలి పెట్టి, శరణాగతి పొందడం. ఇదే మానవుని అంతిమ లక్ష్యం. ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. అర్జునుడు గత సందేహ: అని అన్నాడు. అంటే నా సందేహాలు, అనుమానాలు, అపోహలు అన్నీ తొలగిపోయాయి.
ఇంతటితో కృష్ణార్జున సంవాదం పూర్తి అయింది. అమ్మయ్య తన పనిపూర్తి అయింది అని కృష్ణుడు రథం తోలడానికి నొగల మీద కూర్చున్నాడు. యుద్ధం చేయడానికి అర్జునుడు రథం మీద పెట్టిన గాండీవం చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్ముల పొది సరి చూసుకున్నాడు. యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. ఇంక వారి మధ్య మాటలు లేవు.
ఇంక మాట్లాడాల్సింది సంజయుడు.
ఇక్కడి నుండి తరువాతి ఐదు శ్లోకాలలో సంజయుడు తాను పొందిన అనుభవం, అనుభూతి ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు.