మానవ జన్మ ఎంతో విలువైనది. జీవితంలో సమయమెంతో అమూల్యమైనది. మానవులు సమయాన్ని ఎలా ఉపయో గించుకోవాలి? ఎలా సద్వినియోగం చేసుకోవా లి? సద్వినియోగమైన సమయం యొక్క సత్ఫ లం ఏమిటి? అనే విషయాలు అందరూ గుర్తెర గాలి. అనుక్షణం సమయం గడచిపోతూనే ఉం టుంది. గడచిన సమయం తిరిగిరాదు గదా! అలాగే గడచిపోయిన మన ఆయువును కూడా వెనుకకు తీసుకొని రాలేము. సమయాన్ని బట్టి జీవులకు సుఖ భోగాలు- విలాసాలు- కడకు భగవంతుడు కూడా ప్రాప్తించవచ్చు. మానవ జన్మం మాటిమాటికీ లభించేది కాదు. మానవుని జీవిత కాలం అమూల్యమైనదిగాన దానిని అం దరూ సద్వినియోగం చేసుకోవాలి. జీవితాలను ఇతర క్యాాంలకు వినియోగిస్తే జన్మ సార్థకత చెందదు. లక్ష్యం నెరవేరదు. కావున ఈ సత్య మునెఱిగి మానవులు సర్వదా భగవత్ ప్రాప్తికి వినియోగించుకోవాలి. ఈ సాధన విషయంలో నోటితో అర్థం లేని ప్రసంగాలు చేయరాదు. నిరర్థక వాక్యాలు పల్కరాదు. చెవులతో ఇతర విషయాలు వినరాదు. కంటితో ఇతర దృశ్యాలను తిలకించ రాదు. మనస్సులో ఇతర విషయాలకు తావీయ రాదు. మన హృదయం భగవానుని మందిరం గదా! ఇవన్ని ఆ మందిర ద్వారాలుగా నిరంతరం వీటిని భగవానుని కోసమే తెరచి వుంచాలి. మన సంసారాలు- సంపద- శరీరం- మనస్సు- బుద్ధి- ఇంద్రియాలు- జీవితం- ప్రాణము అన్నియు భగ వంతుని వలననే మనకు లభించాయి. ప్రాప్తిం చాయి. వీటిని ఆ భగవానుని పొందుటకు సాధన యందే వినియోగించాలి. అప్పుడే జీవన సాఫ ల్యం లభిస్తుంది. దైవం ఇలా అన్నాడు. నీ అధికా రంలో వున్నదీ, నీ పరిధిలో నీవు నీదిగా తలచేది ఏది వున్నదో అదంతా నాకు అర్పించు. నీవు తరి స్తావు. కావున మనకున్న సర్వస్వాన్ని ఆ భగవం తునికి అర్పించడమే మనం చేయవలసిన పని. అర్పణలో ఏ లోపం జరుగరాదు. ఒకవేళ జరిగితే ఆ దైవమే చక్కదిద్దుతాడు. మన కార్యాన్ని నెర వేరుస్తాడు. ఇది విశ్వసనీయమైన వాక్కు. నారు పోసిన వాడే నీరు పోస్తాడనేది దైవం పట్ల విశ్వాసం. ఏ మానవుడు పూర్తిగా భగవంతుని మీద ఆధారపడి ఉంటాడో వానిని గూర్చి భగవానుడు చింతిస్తూనే ఉంటాడు. వాని భారం అంతా తన పైనే వేసుకొంటాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రచారం చేయమంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ గీత రెండవ అధ్యాయంలో ఒక శ్లోకంలో ఇలా తెలి పాడు.
శ్లో|| నేహభిక్రమ నాశోస్తి- ప్రత్యవాయోన విద్యతే
స్వల్పమప్యస్య- ధర్మస్య- త్రాయతేమహతో భయాత్||
అంటూ ఏ జీవుడు పరోపకారాన్నే తన లక్ష్యంగా చేసుకొని తన జీవితాన్ని అంతటినీ నిష్కామ భావంతో అందుకోసమే వినియోగి స్తాడో వానికి ఎలాంటి నష్టం జరుగదన్నాడు. నిష్కామ కర్మను మొదలు పెట్టిన వెంటనే దానికి నాశనముండదు. పాపం అంటదు. అది మహా భయం నుండి కాపాడుతుంది అనేది గొప్ప భావం. కావున మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొనుటకు భగవద్గీత- రామాయణం- భార తం- భాగవతం వంటి పవిత్ర గ్రంధాలను భగ వద్భక్తుల నడుమ ప్రచారం చేయాలి. ఉపన్యా సాల ద్వారా- పుస్తకాల ద్వారా భగవంతుని భావా లనూ, లీలలను, గుణాలను- చరిత్రలను- నామా రూపాలను విరివిగా ప్రచారం చేయాలి. నిండు జీవితాన్ని నవవిధ భక్తి మార్గాలకు అంకితం చేసుకోవాలి. ఒక్క క్షణం కూడా నిరర్థకం చేయ రాదు. శరీర నిర్వహణ సంబంధమైన కర్మ చేస్తూ వుండాలి. దాని వలన నష్టం రాదు.
గీతలో భగవానుడు
”శారీరం కేవలం కర్మ- కుర్వాన్నాప్నొతిల్బిషమ్” అన్నారు. శారీరక కర్మలు చేస్తే పాపం అంటద న్నారు. నాలుగవ అధ్యాయంలో
”నిరాశీర్యతచిత్తాత్మా- త్యక్తసర్వపరిగ్రహ:” అంటూ ఆశ లేకుండా, కోరిక లేకుండా, నిష్కామ భావంతో ప్రవర్తిల్లమనినాడు. అన్నిటినీ త్యజించి తన యందే మనస్సు లగ్నం చేయమ న్నాడు. సర్వత్రా మనోనిగ్రహం పాటించమన్నా డు. వేటి యందునూ చివరకు బిడ్డలయందు- తనువు నందు- ధనమునందు మమకారం లేకుండా చరించమన్నాడు. తనలో దాగి వున్న తేజము- బలము- బుద్ధి- మనస్సు- ఇంద్రి యాలు వంటి వాటిని భగవదర్పణం చేయమ న్నాడు. మన జీవితాలు ధన్యం కావాలంటే ఇలా చేస్తూ వుండాలి. భగవత్ ప్రాప్తి కోసం భగవదాజ్ఞాను సారం గా ప్రయత్నం చేస్తూ వుండాలి. సమయాన్ని వృధా చేయరాదు. జీవితమంతా భగవానుని పేరు మీదనే జరుగుతూ వుండునట్లు చేయాలి. భక్తుల జీవన విధానాన్నే అనుసరించాలి. శ్రేయ స్సును పొందాలి. భక్తి- శ్రద్ధలతో స్వచ్ఛమైన హృదయంతో దైవాన్ని ప్రార్థిస్తూ ఆరాధనలు- పూజలు- సేవలూ చేస్తుండాలి. భక్తులను ముగ్థు లను గావించడమే భగవంతుని లీలల లక్ష్యం.
ఆధునిక కవి దువ్వూరి రామిరెడ్డి సమయం గురించి ఇలా తెలిపారు
చం|| సమయమ మూల్యమొక్క- నిముసమ్ము
వృ ధాచనగ్రమ్మరింప-నే
రము,మనమాయువాత్రుటిపరంపర¸°టయెఱింగి, నిద్రమాం
ద్యమును దొఱంగి మీ పనుల నారయుడో జనులార యంచు||
అంటూ సమాజాన్ని హెచ్చ రించాడు. అమూల్య సమయాన్ని వృధా చేసు కోవద్దని సందేశాన్ని అందించాడు. ఇది సత్యమే గదా!
- పి.వి.సీతారామమూర్తి 9490386015