సంస్కృతంలో దామం అంటే ‘తాడు’ అని, ఉదర అంటే ‘పొట్ట’ అని అర్థం. కొంటె చేష్ట లు చేస్తున్న చిన్ని కృష్ణుని ఉదరాన్ని తల్లి యశోదమ్మ త్రాడుతో చుట్టి రోకలికి కట్టి వేసిన లీలా వృత్తాంతపరంగా శ్రీకృష్ణుడికి ఏర్పడిన నామమే ‘దామోదర’. దామోదరుడు లీల చూపింది కార్తీకమాసంలోనే. కార్తీకంలో దామోదరుణ్ని ఆరాధించడం వల్ల సకల శుభాలూ కలుగుతాయి. శ్రీకృష్ణుడు ఏవిధంగా భక్తవశుడు, భక్త పరాధీనుడన్న విషయాన్ని ఈ దామోదర లీల తెలియజేస్తుంది. శ్రీమద్భాగవతం (10.9.19)లో శుక మహాముని వివరించారు.
సమస్త విశ్వంతో పాటు, బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు సైతం ఆ దేవదేవుడి వశంలో నే ఉంటారు. అయినా ఆయనలో ఒక దివ్యగుణం ఉన్నది. అదే భక్తులకు పరాధీనుడై ఉండ టం. దామోదర లీలలో కృష్ణుడు చూపిన గుణం అదే! పన్నెండు మాసాలలో ఒక్కొక్క మాసాన ఒక్కొక్క పేరున నారాయణుడు అర్చించబడుతున్నాడు. ఈ ఆరాధన ఏకాదశ వ్రతంతో కూడినది. మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ‘కేశవ’ నామంతో మొదలై, క్రమంగా కార్తిక శుద్ధ ఏకాదశి వరకు పన్నెండు నామాలలో స్వామిని అర్చిస్తారు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర… ఇవీ క్రమంగా పన్నెండు నామాలు. పన్నెండవ నామమైన ‘దామోదర’ నామం కార్తిక శుద్ధ ఏకాదశి నాటిది. కార్తీకమాసానికి దామోదరుడు అధిపతి. అందుకే కార్తీక మాసమంతా ‘దామోదర’ నామంతో వ్యవహరిస్తూ విష్ణ్వారాధన చేస్తారు. కేశవాది చతుర్వింశతి నామాలలో మిగిలిన పన్నెండు కృష్ణ పక్ష ఏకాదశులు. వాటి మాసాది నియ మాలు వేరు.
‘దామోదర’ నామానికి చాలా అర్థాలున్నాయి. కృష్ణావతారంలో తాడుతో బంధింపడి న ఉదరం కలవాడు అని లౌకిక అర్థం. ప్రధానంగా ‘దామములు ఉదరమున కలవాడు’ అని అర్థం. ‘దామము’ అంటే లోకం. ‘ఉదరం’ అంటే లోపలి భాగం. తనలో సమస్త జగములు కలవాడు దామోదరుడు. ఒక దానితో ఒకటి అనుబంధింపబడి సాగేవే లోకములు. ప్రతి పదార్థంలో, సమస్త లోకాలలో (ఉదరాలలో) ఈ అనుబంధ సూత్రం (దామము)గా ఉన్న వాడే వాసుదేవుడు.
‘దమాట్ దామోదరో విభు:’ దమము (ఇంద్రియ నిగ్ర#హం) చేత కలిగి ఉదార (మేలి మి) బుద్ధికి దొరికేవాడు- అని అర్థాన్ని మహాభారతం చెప్పింది. ఇది పరమాత్మ అయిన నారాయణుని పరంగా అర్థం. ఈ నారాయణుడే శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు ‘దామోదర’ నామానికి పై అర్థాలతోపాటు, మరొక అర్థాన్ని కూడా కల్పించాడు.
‘తాతస్య దామోదరతాం ప్రయమౌ దామబంధనాత్’ (విష్ణు పురాణం) తాటిచే కట్టబ డిన కారణంగా దామోదరుడయ్యాడని భావం. యశోదమ్మచే తాడుతో రోటికి కట్టబడిన కృష్ణ మూర్తియే దామోదరుడు. ఇది భాగవతంలో ఒక అద్భుత లీలా స్వరూపం, యశోద మ్మ బాలకృష్ణుని ఒళ్ళో ఉంచుకొని, చల్ల చిలుకుతున్నది. ఈ లోపల ఇంట్లో పాలు కాగి పొం గుతుండడంతో స్వామిని దింపి లోపలికి వెళ్ళింది. తనను వదిలి వెళ్ళినందుకు అలిగిన చిన్నారి కృష్ణుడు, అక్కడున్న పాలు, పెరుగు కడవల్ని పగలగొట్టి పారిపోయాడు. తిరిగి వచ్చి, నేల పాలైన పాలు పెరుగుల్ని చూసి ఉలిక్కిపడిన తల్లి, స్వామిని వెతుకుతూ వెళ్ళింది. వేరొక ఇంట్లో రోటిని తిరుగవేసి దానిపై ఎక్కి ఉట్టి మీదున్న వెన్నని తీసి ఒక కోతికిస్తున్న కృష్ణు డు కనబడ్డాడు. వెంటనే శిక్షించాలని సంకల్పించుకున్న అమ్మ, బాలుని పట్టుకోవడానికి ప్రయత్నించింది. అది గమనించి పరుగు లంకించుకున్నాడు పరమాత్మ. వెంటపడింది జనని, పట్టుచిక్కకుండా వడిగా పరుగెడుతున్న కన్నయ్యని పట్టలేక పరుగాపక ప్రయాసప డుతున్నది. ఇదంతా వ్రేపల్లెకి వినోదమయింది. పరంధాముని పట్టుకోవడానికి ఏకాగ్రంగా ప్రయత్నిస్తున్న భక్తి రూపిణి యశోదకు దేవతలు సైతం నమస్కరిస్తున్నారు. అలసిన అమ్మ ను చూసి జాలిపడి నిలబడ్డాడు నీలమో#హనుడు. తల్లి అందుకుంది. స్వామిని పట్టుకోగలి గింది. కాదు స్వామి తనంత తాను దొరికాడు.
మన శ్రమని చూసి కరుణించి లభించవలసినదే ఈశ్వరుడు. పట్టిన స్వామిని కడదా మనుకుంది యశోదమ్మ. ఈ బాలుని కట్టేందుకు పెద్ద తాడు ఎందుకు! అంటూ ఒక తాడు తీసుకొని పొట్ట చుట్టూ తిప్పి తెచ్చేటప్పటికి ఆ తాడు చాలలేదు. వెంటనే ఆ తాడుకి మరో తాడు కలిపి బొజ్జ చుట్టూ తిప్పి తెచ్చింది. మళ్ళీ రెండంగుళాలు చాలలేదు. ఇలా క్రమంగా ఇంట్లో తాళ్ళన్నీ అయ్యాయి గానీ, రెండంగుళాలు చాలనితనం అలాగే ఉంది! చెమటలు పడుతున్నాయి. పరిసరాలనీ, తననీ కూడా మరచి ప్రయాసపడుతోంది.
తజ్జనని లోగిటం గల
రజ్జు పరంపరల క్రమ్మరన్
సుమగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే,
జగజ్జాలములున్న బొజ్జ, కట్టన్ వశమే! (పోతన)
అలసటని లెక్క చేయకుండా, క్రమిస్తున్న మాతృమూర్తిని దయతో చూసి, కట్టుబడ్డా డు స్వామి. కట్టగలిగాననుకొని సంతోషించింది తల్లి. మన తపనకి కరిగి తానే లభించాలి గానీ, పట్టుబడడానికీ, కట్టుబడడానికీ సాధ్యుడా అతడు! రెండంగుళాల కడమ ఇక లేదు. ఉదరానికి కట్టిన దామాన్ని రోటికి కట్టి, శిక్షించగలిగాననుకొని, గృహకార్యాలలో మునిగిం ది యశోదాదేవి.
ఎన్నో జన్మల సాధనల పుణ్యఫలంగా యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాదుల వలన- పరమాత్మను #హృదయంలో చూడగలిగే భాగ్యం లభించింది. కానీ ఆ భాగ్యాన్ని పదిలంగా, దృఢంగా నిలుపుకోలేక, విషయ వాసనల పాల పొంగులకి, చెదిరిపోయి- స్వామిని దించేస్తే- మళ్ళీ ఆయనను పట్టడం అంత తేలికా! కానీ ప్రయత్నిం చాలి. పట్టులో ఒదిగిన వానిని దింపివేస్తే, తిరిగి పట్టుకొనే ప్రయత్నమే ‘ధారణ’. కట్టే సాధనే ‘ధ్యానం’. ఆ ధ్యానపు కట్టుబడికి- రెండంగుళాల అడ్డంకి! ఆ రెండే అహంకార, మమకారా లు. ఈ లోకపు ఇంట్లో మన ముందున్న పాశాలన్నీ ఒక్కటి చేసి ‘సర్వం త్వమేవ’ అనే సమర్ప ణా భావంతో, స్వామితోనే ముడిపెట్టుకుంటే, ‘అ#హం’, ‘మమ’లు తొలగి పరమాత్మ మన ధ్యానంలో నిలుస్తాడు. ఆ నిలుకడయే రాతికి కట్టుబడి నిలిచిన అనుగ్ర#హం. దీనికి ఫలంగా జన్మజన్మల కర్మబంధాలని తొలగించి మోక్షాన్నిస్తాడు. దానికి సూచనగానే, రోటిని కదిలించుకు వెళ్ళాడు. శాపవశాత్తు చెట్లై పడివున్న కుబేర పుత్రులకు శాప విమోచనం చేశాడు. భక్తుల బంధాలను తెంచడానికి తానూ బంధితుడై వెళ్ళాడు భగవానుడు.
ఈ ధారణ ధ్యాన సాధనల భక్తి స్వరూపమే యశోద. ఆ భక్తికి సులభుడు శ్రీకృష్ణుడు. అ#హంకార జనితమైన ఏ ప్రయత్నాలకీ లభించని పరదైవం. ‘నిష్కపటమైన భక్తికి కట్టుబ డతాను’ అని చాటడానికే దామోదరుడయ్యాడు. భక్తి పాశ బద్ధుడై, కర్మ పాశ మోచకుడైన పరమాత్మకు ప్రణామాలు.
పన్నెండు నెలల్లో కార్తీకం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది. పవిత్రమైన ఈ పుణ్యకాలంలో కొద్దిసేపైనా మహావిష్ణువును ఆరాధించిన వారికి, కార్తీకం విష్ణు సాన్నిధ్యాన్ని అనుగ్రహస్తుందని పద్మ పురాణం చెప్తున్నది. శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన ఈ నెలలో గోపాలుడి అనుగ్రహం కోరుతూ చేసే చిన్నపాటి సేవ అయినా ఆయనకు పరమానందాన్ని కలిగిస్తుందట. ఈ లీల విన్నవారికి కర్మబంధాలు తొలుగుతాయి. దామోదరుని పూర్ణ అను గ్రహం కలిగి కర్మపాశాల నుంచి విముక్తి లభించి నిత్యమైన, సత్యమైన మార్గంలో మాన వులు పయనిస్తారని పురాణ ప్రాశస్త్యం.
సుమనోహరం…దావెూదర లీలా విన్యాసం!
Advertisement
తాజా వార్తలు
Advertisement