Saturday, November 23, 2024

సుఖ జీవనానికి మార్గాలు


మనం అంతా సర్వసాధారణంగా జీ వితం సుఖంగా, ఆ నందంగా సాగాలని అభిలషిస్తాము. కాని మనం కామ, క్రోధ, లోభ వంటి అరిషడ్వర్గాలలో పడి వ్యామోహంతో జీ విస్తూ, దు:ఖాన్ని కొని తెచ్ఛుకొంటున్నాము. భగవద్గీ తలోని
”దైవాసుర సంపద్విభాగయోగం” అనే అధ్యాయంలో-
”నరకస్యేదంత్రివిధం ద్వారం నాశన మాత్రాన:
కామక్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్‌!!”
కామము, క్రోధము, లోభము అను ఈ మూడు నర క ద్వారములు. ఇవి జీ వికి నాశన హతువులు. కాబట్టి ఈ మూడింటిని విడిచిపెట్టాలి. అవి అసురసంపదలు.” అని భగవానుడు తెలియచేసాడు. దైవసంపత్తిలో పేర్కొన్న గుణాలను అలవరచుకొంటే సుఖమయంగా సాగి సాఫ ల్యత వస్తుంది.
దీనివల్ల దైవానుకూలత లభించడమే కాక, భక్తిత త్త్వం అలవడుతుంది. మానసిక క్లేశాలు దూరమవుతా యి. అందుకే మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దైవ గుణా లను మనం అనుసరించడమే మన కర్తవ్యం. శ్రీకృష్ణుడు చెప్పిన దైవీ సంపద గుణాలు —
1) భయం లేకుండా ఉండడం. (ఇది ధర్మంగా జీ వించేవారిలో ఉంటుంది) 2. అంత:కరణ శుద్ధి. (మనసు ఎప్పుడూ మంచి కర్మలు గురించే ఆలోచించాలి.) 3. జ్ఞా న మందుండుట. (భగవతత్త్వాన్ని గూర్చి తెలుసుకొనే జిజ్ఞాస) 4. దానము. 5. బాహ్యంద్రియ నిగ్రహం 6. జ్ఞా నము (ఇక్కడ మంచి చెడుల తేడా)తో ఉండడం 7 .వేద శాస్త్రాధ్యయనం (వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు చదవడం, అవగాహన) 8. తపస్పు (ఇదివలోనే తపస్సు తమస్సు గురించి తెలుసుకొన్నాము.) 9. ఋజుత్వము (కపటము లేకుండుట) 10. అహంస. 11. సత్య వచ నము. 12. కోపము లేకుండా ఉండడం 13. త్యాగ బుద్ధి కలిగి ఉండడం. 14. శాంత స్వభావం. 15. చాడీలు చెప్పకపో వడం. 16. విషయ లోలత్వం లేకుండా ఉండడం. 17. చంచ ల స్వభావము 18. ఓర్పు- సహనం కలిగి ఉండడం. ఇవన్నీ దై వం మెచ్చే గుణాలు. ఇక అసుర సంపత్తిలో లక్షణాలు కూడా వివరించారు.
అవిడంబము (గొప్పలు చెప్పుకునే అలవాటు) గర్వము, దురహంకారం, (తానే గొప్ప వాడినని అహం) కోపం (చేతల్లో, వాక్కుల్లో), కఠినత్వం. అవివేకం అనే ఈ ఆరు గుణాలు అసుర గుణాలు.
ఒక ఇల్లు శుభ్రంగా ఉండడానికి ఊడుస్తారు. లోపల జలంతో శుభ్రం చేస్తారు. బూజు, దుమ్ము లేకుండా చూ స్తారు. పరిమళంగా ఉండడానికి పెరట్లో పూలమొక్కలు పెంచుకొంటారు. పారిశుధ్యం ఏర్పాటు చేసుకొంటారు. దైవాన్ని తలపోస్తూ ఆహారాన్ని తయారు చేస్తారు కదా. అటువంటి మంచి వాతావరణం జీవితానికి ఏర్పాటు చేసుకోవాలి కదా!
అందుకే శ్రీకృష్ణుడు అసుర సంపద వదిలి వేయమం టున్నాడు. అసుర సంపద కలిగిన వారు ఆచారాలు సం ప్రదాయాలు పాటించరు. అసత్యమే చెపుతారు. వీరి త ప్పిదాల గురించి ఎవరైనా బోధించినా, తలకెక్కదు. వా రు కామమే హతువుగా గలిగి, నిర్థయతో జీ విస్తారు. అ టువంటి స్వభావులను భగవంతుడు ఎలా మెచ్ఛుతా డు? వారు భగవంతుడు అనే వాడే లేడని మితండవాదం చేస్తూంటారు.
ఏ కార్యం చేయవలెను? ఏ కార్యం చేయరాదు? అనే వితర్కం ఏర్పడినప్పుడు, ‘శాస్త్రమే’ ఇచట ప్రమాణమ గుచున్నది. శాస్త్రంలో చెప్పిన రీతిలో, ఆచార వ్యవహారా లు, సాంప్రదాయాలు పాటించాలి అని శ్రీకృష్ణ పరమా త్మ విశిదపరచాడు.
దైవీ సంపదలోని గుణాల ప్రభావం

1) అన్ని దుర్గుణాలకు పునాది భయమే. భయం ఎప్పుడైతే మనిషిని ఆవహించిందో, అవగుణాలు అన్నీ సంకురిస్తాయి. ధర్మాన్ని పాటిస్తూ, సత్సంకల్పంతో జీవి స్తుంటేనే నిర్భయత్వం వస్తుంది. 2) మనసులో ఎటువం టి మలిన సంస్కారాలకు తావులేకుండా, ఆత్మశుద్ధితో జీ వించడమే అంత:కరణ శుద్ధి. 3) జ్ఞాన యోగంతో ఉం డడం అంటే సత్కర్మలు- దుష్కర్మలు- ఫలితాలు విశ్లే షిం చి, మంచిపనులు చేయడమే ఒక జ్ఞాన యోగం. అంతే కాకుండా, భగవానుని లీలలు, అవతార విశేషాలు తెలు సుకోవడం, అనుసరణీయం. త్యాగం వలననే మోక్షం సిద్ధిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి. దుర్గుణాల ను, దుస్సంస్కారములను, దుష్ట సంకల్పములను, విష య వ్యామోహం త్యజించడమే త్యాగం. ‘దయాభూతే ష్‌’ అంటే సమస్త ప్రాణులయందు దయకలిగి ఉండడం. ‘మార్థవమ్‌’ అంటే మాటల్లోను, చేతల్లోను కాఠిన్యం లేకుండా ఉండడం. బాహ్యశౌచము, అంత:కరణ శౌచం కలిగి ఉండాలని చెపుతున్నారు. అంత:కరణ శౌచం నిర్మ లమైన మనస్సుతో వస్తుంది. నిర్మలమైన మనస్సు సత్ప్ర వర్తన వల్ల, సత్సంకల్పం వల్ల సిద్ధిస్తుంది. ఆత్మ తృప్తి కలు గుతుంది. అంతేకాక ,”నేనే గొప్ప పూజ్యుడని” విర్రవీగ కూడదు. అని హెచ్చరించారు.
కాబట్టి, శ్రీకృష్ణ పరమాత్మచెప్పిన అసుర గుణాలను వదిలిపెట్టి, దైవ గుణాలను అలవరుచుకొని, మనం మన జీవి తాలను సు ఖమయం చేసుకొందాం. ఈ పని మనం చేతుల్లోనే ఉంది.

  • అనంతాత్మకుల రంగారావు
    7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement