విశాఖపట్నం, ప్రభన్యూస్ బ్యూరో: విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు నాలుగో రోజూ వైభవంగా కొనసాగాయి. గురు వారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనా పూర్వకంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేం ద్ర సరస్వతి మహాస్వాములు తమ ఉపాసనా దైవం వల్లీ దేవసేన సమేత షణ్ముఖ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్ధిస్తూ ప్రత్యేక పూజ లు చేసారు. స్వయంజ్యోతి మండపంలో షణ్ముఖ యాగం జరి గింది. మరోపక్క యాగశాలలో రాజశ్యామల యాగాన్ని కొనసాగిం చారు. వేద మంత్రోశ్చరణల నడుమ మృదుమధుర మంగళవాయి ద్యాల మధ్య నిర్వహించిన ఈ యాగంలో పీఠాధిపతులు స్వరూపానం దేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పాల్గొని కలశాలకు పూజలు చేసారు. లోక కళ్యాణార్థం చేపట్టిన చతుర్వేద పారాయణ కార్యక్రమాన్ని పండితులు కొనసాగించారు. వీటితో పాటు- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రధోత్సవం వేడుకగా సాగింది. వందలాది మంది గిరిజనులు ఈ రధోత్సవంలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, తప్పెట గుళ్ళు, భజన బృందాలు వెంట రాగా సుబ్రహ్మ ణ్యుని రధోత్సవం కనులపండువగా సాగింది. అనంతరం వల్లీ దేవసేన సమేత షణ్ముఖ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేం ద్ర మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆదాధిస్తే మనోధైర్యం కలుగుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement