Friday, November 22, 2024

సుభిక్ష రక్షణ కవచం…అరణ్యక గౌరీవ్రతం!

ఆదిశక్తి పార్వతీదేవి అనేక రూపాలలో దర్శ నమిస్తుంది. ఆమె సౌమ్య శక్తి రూపమే గౌరీదేవి. మంగళ రూపిణి గౌరీదేవి సువర్ణ ఛాయను కలిగి ఉంటుంది. సంతాన, సంపదలకు మూలము. సనాతన ధర్మములో గౌరీపూజకు విశి ష్టమైన స్థానముంది. ముఖ్యంగా వివాహ సమ యంలో సంతాన, సౌభాగ్యాలకు మంగళ సూత్ర ధారణకు ముందు చేసే గౌరీపూజ అత్యంత మహి మ కలది. చతుర్భుజములతో దర్శనమిచ్చే తల్లి రెం డు హస్తములలో ఢమరు, త్రిశూలం ధరించి రెం డు హస్తములతో అభయము, వరములు కురిపి స్తుంది. మహిళలు చేసే వ్రతాలన్నీ కొన్ని నియమా లతో కూడి ఉంటాయి. మానవ జీవితంలో నియ మం అనేది చాలా ముఖ్యం. ఎవరైతే నియమానుగ తంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారో వారు తలచుకున్నది సాధించగలరు. అటువంటి నియమ స్థితినే వ్రతం అన్నారు. వ్రతములు ఆచరించడం వలన సమస్త జీవకోటి, వృక్షములతో సహా సంరక్షించబడి ఆయురారోగ్యా లు లభిస్థాయి. ప్రకృతిలో భాగమైన మానవుడు ప్రకృతితో కలసి జీవించే మహత్తర యజ్ఞమే వ్రతం. అనాదిగా పురుషుడు శ్రమించి కుటుంబ భారం వహిస్తే, స్త్రీ సంతాన, గృహ నిర్వహణతో బాటు పశుపోషణ చూసుకొనేది. ఆధునిక యుగంలో స్త్రీ బహుళశక్తిగా మారింది. పూర్వం స్త్రీలు ప్రకృతిని కూడా రక్షించుకొనే మార్గం గురించి అన్వేషించారు. వారికి వేదవేదాంగా లు మార్గదర్శనం చేసాయి. ఆవిధంగా ఏర్పడినవే వ్రతాలు. మానవ దివ్య జీవనానికి సుపథాలు. అటువంటి వ్రతాల్లో అరణ్యక గౌరీవ్రతం ఒకటి. జ్యేష్ఠ మాసములో శుక్లపక్ష షష్ఠి రోజున ఈ మహత్తర వ్రతం ఆచరిస్తారు. అయితే నేడు అరణ్యాలు కనుమరుగవుతున్నాయి. మానవులు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు అడవులను నాశనం చేస్తూ మానవజాతి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు.
ఇక ఈ వ్రతం గురించి తెలుసుకుందాం. సమీప అరణ్యములోని మ ధ్య భాగాన్ని చేరుకొని ఉదయం నుండి సాయంకాలము వరకూ ముత్తైదు వులంతా కలసి చేసుకొనేది ఈ అరణ్యక గౌరీ వ్రతం. దేవీదేవతల పరోక్ష రూ పమే ప్రకృతిలోని రూపాలు. అవి వృక్షాలు, పర్వతాలు, ఏవైనా కావచ్చు. భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించడమే ఈ అరణ్యక గౌరీ వ్రతం.
ఈ వ్రతాన్ని దంపతులు ఆచరిస్తారు. స్త్రీలతోబాటు భర్తలందరూ కల సి వారికి సహాయ సహకారాలు అందిస్తూ గౌరీదేవిని అర్చించేవారు. సాధా రణంగా తెల్లవారు ఝామున మంగళ వాయిద్యాలతో అందరూ బయలు దేరి అరణ్యం మధ్య భాగానికి చేరుకొనేవారు. అక్కడ వారు ఒక పెద్ద వృక్షా న్ని ఎంపిక చేసుకొని దాని మూలభాగాన్ని శుభ్రపరచి, గోమయంతో అలికి ముగ్గులు వేసేవారు. తరువాత ఆసనాన్ని ఏర్పాటుచేసి దానిపై బియ్యము ను పరచి పసుపుతో చేసిన గౌరీదేవిని నిలిపి యథావిధిగా విఘ్నేశ్వర ప్రార్థ న, అర్చనతో వ్రతాన్ని చేసేవారు. అక్కడే ప్రసాదమును తయారుచేసుకొని పరస్పరం తాంబూలాలు వితరణ చేసుకొని ప్రసాదము స్వీకరించేవారు.
ప్రతి వ్రతానికి ఒక నేపథ్యం అనేది తప్పనిసరి. పూర్వం మధుర ప్రాం తాన్ని పాండ్యవంశస్థుడైన చంద్ర అనే రాజు పరిపాలించేవాడు. ఆయన సతీమణి కుముద్వతి. చంద్రపాండ్యుడు దైవభక్తి గలవాడు. కుముద్వతి పార్వతీదేవి భక్తురాలు. వారిరువురు పార్వతీ పరమేశ్వరులను నిత్యం ఆరా ధిస్తూ ఉండేవారు. తన రాజ్యాన్ని విస్తరిస్తూ ప్రజలను కన్నబిడ్డలలా పరిపా లించేవాడు. సామంత రాజులందరూ ఆయన శౌర్యపరాక్రమాలను, సుప రిపాలనను ప్రశంసించేవారు. ప్రజలందరూ పరిపరి విధాల పొగడెవారు. చివరకి రజోగుణ ప్రభావానికి గురయిన చంద్రపాండ్యుడు దైవభక్తి కంటే తన శౌర్య పరాక్రముల మీద భక్తి పెరిగింది. గర్వంతో దైవబలాన్ని విస్మరిం చాడు. తుదకు పూజ కూడా మానివేసాడు. ఈ భూమి మీద తనకంటే మిం చిన పరిపాలకుడు లేడనే భావం పెరిగిపోయింది. నియమ నిష్ఠలు లేని జీవి తాన్ని ప్రారంభించాడు. ఫలితంగా అతని ఆలోచన మందగించసాగింది. అప్రయోజన కార్యాల పట్ల మక్కువ పెరిగింది. పరిపాలన మందగించిం ది. మంత్రులను అలక్ష్యం చేయసాగాడు. దానికి తోడు దైవం ఆగ్రహించిం దా అన్నట్లు కరువు కాటకాలు ప్రారం భమయ్యాయి. ప్రజలు ఆహారం, త్రాగునీటికి కటకటలాడసాగారు. వారి క్షేమానికి సరైన నిర్ణయాలు తీసు కోలేకపోయాడు. ప్రజలలో చంద్రపాండ్యుని పై గౌరవ మర్యాదలు తగ్గసాగాయి. దానికి తోడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శత్రు రాజులు ఒక్కసా రిగా దండయాత్రలు చేసారు. చివరకు చంద్ర పాండ్యుడు ఓడిపోయి భార్య కుముద్వతితో పాటు అరణ్యాలకు పారిపోయాడు. అక్కడ దొరికిన కందమూలాలు తింటూ గడపసాగా రు. కరువు వల్ల అక్కడ కూడా సరైన ఆహారం, నీరు కూడా గగనం అయిపోయింది. ఒకరో జు ఆకలి దాహంతో అలసిపోయిన చంద్ర పాండ్యుని కాపాడుకోవడం కోసం కుముద్వ తి నీటి కోసం అన్వేషిస్తూ ముని ఆశ్రమానికి వెళ్ళింది. తమ అష్టకష్టాలను వివరించి కాపా డమని కోరింది. వెంటనే ఆ ముని తన శిష్యు లను పంపి చంద్రపాండ్యుని తన ఆశ్రమానికి రప్పించుకున్నాడు. తపో సంపన్నుడైన ఆ త పస్వి దివ్యదృష్ఠితో ఈ అరిష్టానికి కారణం అతని గర్వం తద్వారా దైవాన్ని మరచిపోవడం అని గ్రహించాడు.
వెంటనే ఆ దంపతులకు సర్వమంగళ స్వరూపిణి అయిన గౌరీదేవిని వ్రత రూపంలో అర్చించమని సూచించాడు. విధివిధానాలను రూపొం దించాడు. పసుపుతో గౌరీదేవిని నిర్మించి ఆవాహన చేసాడు. ఆ మహార ణ్యంలోనే ఒక పెద్ద వృక్ష మూలంలో గౌరీదేవిని ప్రతిష్ఠించి ఆ దంపతులచే అరణ్యక గౌరీ వ్రతాన్ని చేయించాడు.
సూర్యాస్తమయానికి వ్రతం సమాప్తమయింది. ఆ దంపతుల హృ దయాలు పవిత్రమయ్యాయి. గౌరీదేవితో పరమేశ్వరుడు దర్శనమిచ్చా డు. గౌరీదేవి తన అభయ వరద హస్తాలతో కరుణ కురిపించింది. ఆకాశం మేఘావృతమయ్యింది. రాజ్యమంతా వర్షాలు కురిసాయి. కరువు కాటకా లు అంతమయ్యాయి. శత్రువుల పాలయిన మధుర రాజ్యం అస్తవ్యస్తంగా తయారయింది. ప్రజలు తమ రాజును వెతుకుతూ అరణ్యాలకు వచ్చారు. అక్కడ చంద్ర పాండ్య, కుముద్వతి దంపతులను చూసి ఆనందంతో మురిసిపోయారు. ప్రజల అభీష్టం మేరకు తిరిగి మధుర రాజ్యం చేరి దైవభక్తితో సుపరిపాలన అందించాడు. అయితే అప్పటి నుండి ప్రతి సంవత్సరం అరణ్యానికి వెళ్ళి గౌరీదేవి వ్రతా న్ని జీవితాంతం కొనసాగించారు. తదనంతరం ప్రజలు కొనసాగించారు. ఆవిధంగా అరణ్యక గౌరీవ్రతం కరువు కాటకాలను దూరం చేస్తుంది. ప్రకృతి పట్ల మానవునికి భక్తి భావన పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement