Friday, November 22, 2024

విచిత్ర వేదాంతి వేమన

ఆయనది సత్య మార్గము…. సత్య మతము. ఓ విచిత్ర వేదాంతి యోగి వేమన. సమా జంలోని ఏ అంశమును వదలలేదు. ఎవ్వరినీ విడువలేదు. అది ఆయన మానవతావాదం. సూనృతవాదం. ఆయన వాక్కులు వేదసారా లు. ప్రజాభిమానం కలిగినవారు. ఆంధ్రసాహిత్యాకాశంలో ధృవతారగా వెలి గిన ప్రజాకవి వేమన. ఆయన ఉదాత్త స్వభావం, మహోన్నత మానవతా దృక్పథం అనితరమై నవి. ఆయన సాహిత్యంలో… పద్యంలోని బోధ న… నీతులు, యదార్థాంశాలను బట్టి ఆయనను గొప్ప ఆత్మజ్ఞాని, మహాత్యాగి, మహాయోగి అన టంలో సందేహం లేదు. వేమన మహాకవిగా, గొప్ప తత్త్వవేత్తగా, నీతిజ్ఞునిగా, నీతి బోధకుడు గా అజరామరమైన వ్యక్తిత్వంతో విరాజిల్లిన చరి తార్థుడు. 17వ శతాబ్దానికి చెందిన వేమన సాహి త్యంపై సి.పి.బ్రౌన్‌ 17 సంవత్సరాలు అలుపెరు గని పరిశోధన చేసి, ఒక తెలుగు కవి పద్యాలలోని కవితను, కవితలోని భాష- భావం, అభివ్యక్తి, మాండలికతలపై దృష్టి నిలిపి వాటిని లోక విశ్రు తం గావించిన ఆంగ్లేయ పండితునికి ప్రపంచ మంతా ఋణపడి వుంటుంది. వేమన పద్య సాహిత్యాన్ని సకల జన సుబో ధమైన అలతిఅలతి తెలుగు మాటలతో నింపా రు. ”విశ్వదాభిరామ వినురవేమ” అనే మకుటం తో వేమన పద్యాలు అందరి మనస్సు లలో నిల్చి వుంటాయి. ఆయన పద్యాలన్నీ ఆటవెలది, ఛం దస్సులో వుంటాయి. ధారణకు ప్రతీక వీరి పద్యా లు. వీరి పద్యాలను పరిశోధించి దేశ, విదేశీయు లు మహాకవిగా గుర్తించారు. నేటి కవులు కూడా వేమన సాహిత్యంతో ప్రేరణ పొందారు. స్ఫూర్తి దాత వేమన. ప్రజాహృదయాలను కదిలించిన అభ్యుదయ కవి. సత్యము, యదార్థమునకు సం బంధించిన అనుభవమే ఆయన మతం. ఏ మతమైనా ఆశ్రితులను సత్య ధర్మ పరా యణుగా తీర్చిదిద్దటమే కర్తవ్యమన్నారు. వేమ న మతంలో పాతకొత్తల కలయిక కన్పిస్తుంది. ఆయన పద్యాలలో పలు మతాల ప్రశక్తి కనపడు తుంది. మంచిచెడులను నిర్భయంగా పద్యాల లో తెలిపారు. వేమన పద్యాలు సామాజికమైన విభిన్న భావాలకు ప్రతీకలు. సాంఘిక వృత్తాన్ని నిశి తంగా పరిశీలించిన దార్శనికుడాయన. సతీసుతులు, సంసారం, ధనం, ఘనత, చదువు వీటిని తన పద్యాలలో వినిపించారు. ప్రపంచమంతా మాయ అని స్పష్టం చేశారు. సం ఘంలో పుణ్యాత్ములకు, పాపాత్ములకు తేడా తెలుసుకోవాలంటే పరిశీలన సాధన అవసరం అన్నాడు. గుణాలను బట్టి మంచిచెడులు తెలుస్తా యన్నారు. వేమన అన్ని జాతులను సమంగా చూచినా, జ్ఞాన, విజ్ఞాన ధనుల్ని మాత్రమే మెచ్చుకున్నారు. అన్ని వృత్తులవారినీ గౌరవించ మన్నారు. ఆత్మవిశ్వాసమున్న వ్యక్తి. తాను చెప్పింది వేదం అన్నాడు. అందుకే ఆయన నిర్మ ల హృదయుడు. కర్మజీవి. వేతతత్త్వమును తన పద్యములలో అందరికీ అర్థమయిన రీతిలో అం దించిన ఆత్మతత్త్వ విదురుడు యోగి వేమన.
– పి.వి.సీతారామమూర్తి
9490388015

Advertisement

తాజా వార్తలు

Advertisement