Friday, November 22, 2024

శ్రీతలయేరుగుండు ఆంజనేయస్వామి

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే కాలినడక మార్గంలో పాదాల మండపం దాటిన అనంత రం దర్శనమిచ్చే ప్రాంతంలోని ఒక పెద్ద గుండు లాంటి రాయికి ”తలయేరు గుండు” అని పేరు. దీనికి చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉం ది. ఈ గుండు పై భాగంలో ”శ్రీఆంజనేయ స్వామి” వారు నమస్కార భంగిమలో దర్శనం ఇస్తారు. ఈ గుండుకు మోకాళ్ళను ఆనించి ఆంజనేయస్వామివారికి నమస్కరించి తిరుమ లకు నడిచి వెళ్తే కాళ్ల నొప్పులు ఉండవని భక్తుల విశ్వాసం. శ్రీకృష్ణదేవరాయలు కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. భక్తులు అలా మో కాళ్లను ఆనించడంతో గుండు పైన మోకాళ్ళు, తల తాకించడం వల్ల ఏర్పడిన గుంతలు ఆనవా ళ్లు ఉంటాయి.
ఈ తలయేరు గుండు వెనుక ఓ కథ వుంది.
కోట్లాదిమంది భక్తుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరుని దర్శనార్థం ఎంతోమంది భక్తులు వస్తూ వుంటారు. అందులో అధికశాతం అలిపి రి నడక మార్గం, శ్రీవారి మెట్ల మార్గం గుండా ఏడుకొండలను ఎక్కి స్వామివారిని దర్శిస్తే చాలు తమ కష్టమంతా తీరిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే అలిపిరి పాదాల మండపం దాటిన తర్వాత 100 మీటర్ల దూరంలో తలయేరు గుండు కనిపి స్తుంది. ఈ తలయేరు గుండు పూర్వం అలిపిరి మార్గంలో మెట్లు నిర్మించక ముందు ఈ ప్రాంతంలో ఒక సెలయేరు దానిపక్కనే ఒక గుండు కూడా ఉండేదని స్థానికులు చెబుతారు. అలిపిరి మెట్ల మార్గం నిర్మించే క్రమంలో తలయేరు గుండు కొట్టి పక్కకు జరపడం ద్వారా తలయేరు గుండు మార్గాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్వం ఈ మార్గం గుండా తిరుమలకు వెళ్లి శ్రీకృష్ణదే వరాయలు సైతం ఈ తలయేరు గుండు వద్ద తలవాల్చి కొంత సేపు విశ్రాంతి తీసుకుని వెళ్లారని పురాణాలలో ఉంది. అందు కే ఈ రోజుకి నడకమార్గంలో భక్తులు కొండ పైకి వెళ్ళేటప్పు డు స్వామి వారిని దర్శించుకొని మళ్ళీ కొండ దిగి వచ్చే భక్తులు ఈ ఆంజనేయస్వామి వారికి నమస్కరించి తమ తలను, మోకాళ్ళను ఈ గుండుకు ఆనిస్తారు. అలా చేసి నడిచి మెట్లు ఎక్కడం వలన కాళ్ళ నొప్పులు రావనీ, శ్రమ ఉండదని, మోకా ళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తు ల నమ్మకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement